కృష్ణు - కట్టేసిన నక్కమల్లె నీభర్త ఎంత గుంజుకుంటాడో. వాడి గర్వం కొంత తగుతుంది.
శశి - ఇంకా అతన్ని నాభర్త అంటావేమిటి? అమ్మా! అన్ని దుగ్ధలూ వదిలాయి కృష్ణా! మనకు ఇంక సంతోషముగాక యింకేమిటి? ఇంతకన్న ఆనందంగా ఎవరన్నా వుంటారేమో! రాముడూ సితా కాలవ దాటే బొమ్మ ఉందే!అప్పుడు సీత యింత సౌఖ్యముగా వుందేమో!
కృష్ణు - ఆ లక్ష్మణుడూ పడవవాడూ అక్కడే ఉండగా సీతకు సౌఖ్యమేమిటి?
శశి- ఆ చివర కూర్చుంటావేం?ఇట్లా రారాదూ? నిద్రవస్తోండి. నువ్వు దగ్గర వున్నావనే నమ్మకం వుంటేనేకాని సరిగా నిద్రరాదు.
కృష్ణు - ఇక్కడ యీ చుక్కాని గోల ఒకటోచ్చిందో. నిద్రపో మళ్ళి ఎండ వస్తుంది. ఆ నేత్ర కమలాన్ని విప్పెటందుకు.
శశి - ఈ రాత్రి కలువలయినాయి.
కృష్ణు - అవును. చూడు చంద్రుడు వెలవెలపోతున్నాడు. ఈ నాటి రాత్రి వెన్నెల్ని మరవగలనూ? నా జీవితంలో మహా దుఃఖాన్ని సంతోషాన్ని ఈ రాత్రే అనుభవించాను.నిద్రేనా?
శశిరేఖ కళ్ళు ముసెను. ఉషఃకాంతి ఆమె ముఖము నావరించి చెక్కిళ్ళ కొక కొత్త యందమును రంగును తెచ్చెను. మలయమారుతము ముంగురుల మధ్య జిక్కువడి యాడుచుండెను. నేత్రములయందును పెదవులయందును చక్కని చిరునవ్వుతో ఆమె సంపూర్ణమగు సంతుష్టి జెందిన పసిబిడ్డవలె నిద్రంచుచుండెను. కృష్ణుడామె ముఖమును గాలికి
గదలుచున్న చిరె మరుగుపరువజాలని సుకుమారమ్తె యే లోపమును లేక వంపుదిరిగిన దేహమును జూచుచు సకలమును మరచెను.
4
"శశిశశి పట్టుకో పట్టుకో "
కృష్ణుడు బాధమచెట్టు నెక్కి ఆకులను పండ్లను విధల్చుచుండెను .శశిరేఖ చెట్టు క్రింద నుంచి ముఖమెత్తి చూచుచుండెను .ఒక పెద్ద పండు ముక్కు పైపడెను .
కృష్ణు-ఆ ముక్కేట్లా పెట్టినావు! అధ్ధముంటే ఎంత బాగుండేది ?అని నవ్వుతోకింధబడుతకు సిద్ధంయ్యేను .
శశి-ఎందుకంత నవ్వు ! ఇంకా చాలు దిగు .
కృష్ణుడు చెట్టు నుండి దూకెను.
శశి -వళ్ళంతా గండుచీమలేనోయి. అంతేకావాలి. బాగా కుట్టాలి . నా ముక్కు చితకకోట్టినావు డేట్టావుందో?
కృష్ణు- నీకేం సంతోషమో ?నిన్ను కుడితే ఎట్లా వుంటుంది ? కావలసి కొట్టినానా యేం?ఇదంతా నికోసమేగా? కోసినందుకుపకారమా?
శశి -నా కోసమేం ? భోజనానికి పిలిచినా నీ స్నేహితుడి కోసం ,నీ కోసం
కృష్ణు-సుందర్రావు వచ్చేస్తాడు . త్వరగా ఆకులు కుదదామురా, అని అచ్చాటనున్నకుటిరములోనికి పోయిరి .
శశి -పొగాకు కళ్ళు మండినాయి . కొంచెం ఆ పులుసు చూద్దూ.నేను విస్తళ్ళుకుడుతూ వుంటాను .
కృష్ణు-ఆ తిరగామూత వెయ్యడం ఎన్నిరోజులయినా చేతకాదు కదా నాకు!
శశి -లేకపోతే మొగవాళ్ళకి వంట వస్తుందీ?
కృష్ణు-మా భీముణ్ణి, నలున్ని మరచిపోయినావా?
శశి -అప్పుడు వంటల్లో తిరగామూతలు లేవు.సుందరరావు వచ్చెను.
సుంద -ఏం చేస్తున్నాడు మావాడు ?
శశి-(నవ్వుచు) పులుసు వామ్డుతున్నాడు .
సుంద-కృష్ణా,వంట చేసేది నువ్వని చెప్పకపోయినావురా ముందుగానే ?ఇంటి దగ్గర అన్నం పెట్టమని చెప్పి వచ్చేవాన్ని .
కృష్ణు-లేదురా ,ఇప్పడే వెళ్ళినాను ,పులుసు పోంగాకండా చూడడానికి .ఏంరా !పొద్దున్నే వస్తాననిఇంత
ఆలస్యం చేశావు?
సుంద- ఎంతచెప్పినా తెలీదురా వీళ్ళకి. పశువులకన్న అన్యాయం. మొన్నటినించి విషజ్వరంగా వున్న ఆవిడ
యివాళ ముట్టయిందిట. ఇంట్లోంచి తిసి యీ గాల్లో బయట పాకలో వేసినారు. రేపు స్నానం చేయించక మానరుట. ఇంక
మా వయిధ్యమెందుకు, మందులేందుకు?
కృష్ణు- ఏం చేశావు?
సుంద- చేసేదేముంది? వద్దని చెప్పినాను. కాని వింటారా, యేమంన్నానా?
శశి-అందుకనేనా ఆలస్యం ? మీ కెంతిస్తారు యీ జబ్బు కుదిర్తే ?
సుంద - కుదిర్తేకదా ? ఏమైనా రెండు వందల కోప్పుకున్నాను.
శశి - కృష్ణా ,నువ్వింకా యేడాది చదివితే , నువ్వు కూడా యిట్లా సంపాదించేవాడవు కదూ ?
సుంద - వాడికి వెధవడబ్బెందుకు ? వాడి కోక్కసారిగానే వనిధుల్తో సమానంమైన మణి దొరికింది .
శశి- మంచి మణే! కడుపు నిందనా , కాలు నిండనా, ఎందుకు పనికొస్తుంది!
