థాంక్ యు విజ్జీ. నాకూ చాలా హ్యాపీ గా ఉంది నిన్ను మీ నాన్న గారిని కలవడం అన్నాడు.
ఏమన్నా జూస్ చెప్పనా. ఫ్రెష్ లైం లాంటివి.
ఇపుడేం వద్దు. రేపు ఏమి వంటలు చేయించమంటావు. నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది.
నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు. సింపుల్ గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు.
మా నాన్నగారు అంత సింపుల్ గా సరిపెట్టరు. నీ ఇష్టం. ముందే చెపుతున్నా అంది విజిత నవ్వుతూ.
ఆ ముగ్ద మనోహర నవ్వుకు వినీల్ మనసు పెండ్యులం లా అటూ ఇటూ ఊగుతోంది. దాన్ని పట్టుకుని ఆపడం అతనికి చాలా కష్టమైంది.
మీ నాన్నగారికి జాతకం పంపారా.
ప్రొద్దున్నే ఫార్వర్డ్ చేసాను. అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీ గా ఉన్నారట. రెండు మూడు రోజులు పట్టొచ్చని చెప్పారు.
ఓహ్ గుడ్. ఆ విషయం సక్సెస్ అవ్వాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను నీల్ అంది.
వినీల్ మోహంలో నీరసం కనిపించి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది.
నేను బాగానే ఉన్నాను. కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయి.
ఎందుకబ్బాయి. ఎందుకలా. ఈకాలంలొ కూడా నీలాంటి అబ్బాయిలున్నారా అని సందేహం కలుగుతుంది అంది బిగ్గరగా నవ్వుతూ విజిత.
ఏమో విజ్జీ స్నేహం ఒకే కానీ, నీతో పెళ్లంటేనే కంగారుగా ఉంది. అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతోంది.
మీ నాన్నగారి తో మాట్లాడాక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తోంది. నువ్వూ కొంచెం ఆలోచించు.
నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు.
నన్నెందుకు కోరుకుంటున్నావో అస్సలు అర్ధం కావడం లేదు అని తలపట్టుకున్నాడు.
నీల్ ప్లీజ్. అలా మాట్లాడకు.
ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటిరోజే నువ్వు నాకు ఎంతో నచ్చావు.
నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకుని నీతో వస్తాను.
అయినా అంత దూరం ఆలోచనాలెందుకు. ఇంకా ఏ మాటలు జరుగలేదు కదా.
మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు.
అప్పుడే ఎందుకు అంత నిరాశ అని అతను చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్లీజ్ ఆ ఆలోచనలు మానెయి.
హాపీగా ఉండు. అంతా హ్యాపీగానే జరుగుతుంది.
మనిద్దరం ఒకటవుతాం. ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఏవో సినిమాలు చూసి ఎదో ఊహించుకుంటున్నావు. అంత ఏమీ జరుగవు అని ధైర్యం చెప్పింది విజిత.
ఇట్స్ ఓకే విజ్జీ. చూద్దాం. కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ విజిత చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కు మెల్లగా విడిపించుకున్నాడు.
నీ ప్రతి చర్యా నాకు నచ్చుతుంది నీల్. నీతోనే నా జీవితం.
ప్లీజ్ కొద్దిరోజులు మాత్రమే. తరువాత నేను నీదాన్నవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటె చెప్పు. ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది.
నా మొహానికి తోడు ప్రేమ కూడానా. ఇదిగో ఇదే నా ప్రేమికురాలు. ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నెచ్చెలి. నాతో నిరంతరం కాపురం చేస్తోంది అన్నాడు నవ్వుతూ.
అది నాకు తెలుసులే చదువు బిడ్డా. నీ కోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందని నా నమ్మకం.
నీవు చాలా ఆప్టిమిస్టిక్ విజ్జీ అన్నాడు నవ్వుతూ.
అలా అని కాదు. నువ్వంటే నాకిష్టం నీల్. నాకు జీవితంలో అన్నీ దొరికాయి. నీతో పెళ్ళైతే నాకు ఇంకేమి అక్కర్లేదు.
సరేలే. కొంచెం ఫ్రూట్ జూస్ చెప్తాను అని ఇంటర్కం లో చెప్పాడు తీసుకు రమ్మని.
****
వినీల్ విజిత అలా కబుర్లు చెప్పుకుంటుండగానే విజిత ఫోన్ మోగింది.
అమ్మ కాల్ చేస్తోంది.
ఏంటమ్మా అంది.
అటు సైడ్ విజిత అమ్మ గట్టిగా ఏడుస్తోంది.
విజ్జీ మీ డాడీ కి ఆక్సిడెంట్ అయ్యిందిరా.
హాస్పిటల్ లో చేర్చారంట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళుతున్నాను. నువ్వు వెంటనే రా. నాకు భయంగా ఉంది అంటోంది.
విజిత కి ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయ్యింది. మోహంలో ఏడుపు ఛాయలు అలముకున్నాయి.
అది గమనించిన వినీల్ ఏంటి విజ్జీ ఏం జరిగింది అన్నాడు.
విజిత చెప్పింది కుర్చీలోంచి లేస్తూ.
ఓహ్ గాడ్. ఉండు నేనూ వస్తాను. ఈ టైం లో రోడ్స్ బిజీ గా ఉంటాయి. మా కంపెనీ అంబులెన్స్ ఉంది. దాంట్లో వెళితే సిగ్నల్స్ ఇబ్బంది ఉండదు. త్వరగా వెళ్లొచ్చు. పద పద అంటూ ఇద్దరూ లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు.
పరుగెడుతూనే వినీల్ అంబులెన్సు డ్రైవర్ కి ఫోన్ చేసి అర్జెంటు గా పోర్టికో లోకి రమ్మన్నాడు.
మృణాల్ కి విషయం చెప్పి నేను వెళుతున్నాను అని చెప్పాడు.
అతనూ కంగారుగా వచ్చాడు పోర్టికోలోకి.
నేను వచ్చేదా అన్నాడు మృణాల్.
నో మృణాల్. నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు వినీల్.
అంబులెన్సు లోకి ఎక్కిన వినీల్ విజితకి చెయ్యి అందించాడు ఎక్కేందుకు.
ఇద్దరూ అంబులెన్సు లో వెనుక కూర్చున్నారు.
విజిత వినీల్ ప్రక్కనే కూర్చుంది.
హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్ కి. అర్జెంటు అని చెప్పాడు.
ఓకే సర్ అని బయలుదేరారు.
నీల్ నాకు చాలా భయంగా ఉంది. డాడీకి ఎలా ఉందొ అని ఆందోళనగా ఉంది విజిత. వినీల్ భుజంపై తలవాల్చి కళ్ళుమూసుకుంది విజిత.
ఏమి కాదురా అంకుల్ కి. ఆయన బాగానే ఉంటారు. నువ్వు కంగారు పడొద్దు. అంతా బాగుంటుంది. వర్రీ అవ్వకు అని ఓదార్చాడు.
వినీల్ చేతిని గట్టిగా పట్టుకునుంది విజిత. ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న దిగులు ఆమె మోహంలో ప్రస్ఫుటమవుతోంది.
ఇంతలో విజిత ఫోన్ మోగింది. రాజు గారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు.
భయంగా రిసీవ్ చేసుకుంది విజిత. మా నాన్నను రక్షించు అని భగవంతుని ప్రార్ధిస్తూ ఫోన్ మాట్లాడింది.
మేడం. సర్ కి డేంజర్ లేదు. కొద్దిపాటి సీరియస్ ఉంది. మీరేమీ భయపడకండి. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యున్నారు. ట్రీట్మెంట్ మొదలయ్యింది అని అటువైపునుంచి చెప్తున్నారు.
థాంక్స్ అంది. నేను దారిలో ఉన్నాను. వస్తున్నాను. అరగంటలో అక్కడుంటాను. డాడీ ని జాగ్రత్తగా చూడండి అని రిక్వెస్ట్ చేస్తోంది.
తప్పకుండా మేడం. మేమంతా ఉన్నాము. ఏమీ కాదు. మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు.
థాంక్ గాడ్ అనుకుని డేంజర్ లేదని చెప్పారు నీల్ అంది.
అంతా ఓకే అవుతుంది రా విజ్జీ . ఇంకొద్దిసేపట్లో అక్కడుంటాము. అంకుల్ కి అంతా బాగుంటుంది అని మరో మారు ధైర్యం చెప్పాడు వినీల్.
ఇరవై నిముషాల్లో హాస్పిటల్ కి చేరుకున్నారు.
ఇద్దరూ ఎమర్జెన్సీ వార్డ్ లోకి పరుగు తీశారు.
అప్పటికే రాజు గారి స్టాఫ్కి, తెలిసినవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు.
విజిత ను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు.
ఫ్యాక్టరీ కి కారులో వెళ్ళేప్ప్డు డు వెనుకనుంచి ఒక లారీ గుద్దిందట.
