రాజుగారు క్రిందకు తూలడంతో రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయ్యిందట.
రాజుగారిని వి ఐ పి రూమ్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ హాస్పిటల్ బోర్డు లో ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు రాజుగారు.
అక్కడికి వెళ్లారు విజిత వినీల్.
చాలా మంది సీనియర్ డాక్టర్లు, నర్సులు అటెండ్ అవుతున్నారు. రాజు గారు స్పృహలో లేరు. కానీ రీడింగ్స్ అబ్నొర్మల్ గా లేవు. అవి గమనించింది విజిత. ఫరవాలేదు. అవుట్ అఫ్ డేంజర్ అనుకుని మనసులోనే దేవుడికి వేయి దన్నాలు పెట్టుకుంది.
సీనియర్ డాక్టర్ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాడు.
ఆ డాక్టర్ కి విజిత కూడా డాక్టర్ అని తెలుసు.
చాలా లక్కీ అమ్మా. ప్రాణాపాయం లేదు. కాకుంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్లడ్ లాస్ చాలా అయ్యింది. ముందు బ్లడ్ ఎక్కించి తరువాత ఆపరేషన్ థియేటర్ లో రిబ్స్ ఫ్రాక్చర్ కి బ్యాండేజ్ వెయ్యాలి. ప్రస్తుతం నొప్పులు విపరీతం గ ఉంటాయి కాబట్టి మత్తు ఇంజక్షన్ ఇచ్చ్చున్నాము. రాజు గారిది రేర్ బ్లడ్ గ్రూప్. నిన్ననే కొందరికి ఎమర్జెన్సీ కింద ఇచ్చాము. అందుకే స్టాక్ అయిపొయింది. అన్ని హాస్పిటల్స్ లో ఇంక్విర్ చేసాము. ఒక హాస్పిటల్ లో ఉందన్నారు. అర్జెంటు గా గ్రీన్ కారిడార్ లో పంపమని చెప్పాము. కాకుంటే అక్కడినుంచి వచ్చేప్పటికి అరగంట పైనే అవుతుంది. కొంచెం ఇమ్మీడియేట్ గా కావాలి అని వివరిస్తున్నాడు.
వినీల్ ఆ డాక్టర్ని అడిగాడు ఏం బ్లడ్ గ్రూప్ అని. డాక్టర్ చెప్పాడు.
వినీల్ ఇమ్మీడియేట్గా చెప్పాడు. డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్. నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ అన్నాడు.
కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిస్టర్. మీకు ఇబ్బంది అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేసాడు డాక్టర్.
ఫరవాలేదు. ప్లీజ్ అర్రెంజ్ చెయ్యండి. ఇమ్మీడియేట్ గా అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ.
పక్కనే ఉన్న విజిత వినీల్ తో నీకు ఇబ్బంది అవుతుందేమో అన్నది.
ఏమీ కాదు విజ్జీ. నువ్వు కూల్ గా ఉండు. నువ్వూ డాక్టర్ కదా. నాకేం ఫరవాలేదు. అంతా ఓకే అవుతుంది అన్నాడు.
థాంక్స్ వినీల్ అంది.
చక చక వినీల్ బ్లడ్ గ్రూప్ చెక్ చెయ్యడం, ఫిట్నెస్ చెక్ చేసి రాజు గారి బెడ్ పక్కనే మరో బెడ్ అర్రెంజ్ చేసి పడుకోబెట్టారు.
రాజు గారికి సెడేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టున్నారు.
బ్లడ్ ఎక్కించడం అర్రెంజ్ చేశారు. ఆ ప్రాసెస్ మొదలయ్యింది.
విజిత ఇద్దరి మధ్యలో నిలుచుని ఉంది.
అక్కడున్న డాక్టర్ వినీల్ వైపు చూపిస్తూ అతని నడుము బెల్ట్ లూజు చేసి ఇన్ షర్ట్ తీసెయ్యండి నర్స్ అని చెపుతున్నాడు నర్స్ తో.
పక్కనే ఉన్న విజిత వినీల్ నడుము బెల్ట్ తీసి షర్ట్ పైకి లాగింది.
ఇంతలో విజిత మదర్ మాధవి వచ్చారు కంగారుపడుతూ.
విజిత అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది తల్లికి.
మధ్య మధ్యలో వినీల్ బి పీ చెక్ చేస్తున్నాడు డాక్టర్. నార్మల్ గానే ఉంది.
రాజు గారికి ఆక్సిడెంట్ అనగానే చాలామంది సీనియర్ డాక్టర్స్ అక్కడికి వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వేరే హాస్పిటల్స్ నుంచి కూడా సీనియర్ డాక్టర్స్ వచ్చున్నారు.
విజిత కూడా డాక్టర్ కాబట్టి పరిస్థితి అర్ధం చేసుకుంది. తండ్రికి డేంజర్ లేదు. కాకుంటే బ్లడ్ లాస్ వల్ల బి పి లెవెల్స్ పడిపోయి రక్తం కావాల్సి వచ్చింది.
సీనియర్ డాక్టర్ కి కూడా విజిత్ డాక్టర్ అని తెలుసు. చెప్పాడు. రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. రక్తం ఇవ్వడం పూర్తవగానే ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాడు డాక్టర్.
ఓకే డాక్టర్. థాన్క్ యు అని చెప్పింది.
రాజుగారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంచార్జి డాక్టర్ మనసులోనే దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు. వినీల్ సమయానికి బ్లడ్ ఇవ్వకుంటే ఏం జరిగేదో అతనికే తెలుసు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.
కారు డ్రైవర్ కి కూడా నుదుటి మీద బాగా దెబ్బలు తగిలాయి.
అతనికి కూడా అక్కడే ఎమర్జెన్సీ వార్డ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు.
వెంకటరాజు గారి అన్నయ్య వీర్రాజు గారు కూడా వచ్చారు చూసేందుకు.
బ్లడ్ ఇస్తున్న వినీల్ ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన ఇతను ఇక్కడేందుకున్నాడా అని.
వెంకటరాజు గారి స్టాఫ్ చెప్పారు వీర్రాజు తో. వెంకటరాజు గారు వినీల్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లడం. అక్కడనుంచి తమ ఫ్యాక్టరీ కి బయలుదేరడం, పొలిమేరల్లో వెనుకనుంచి లారీ గుద్దడం అన్నీ వివరించారు.
వినీల్ బ్లడ్ సమయానికి ఇవ్వడం వల్లే వెంకటరాజు గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అని అందరూ చెప్పారు వీర్రాజు గారితో.
వీర్రాజు గారు వినీల్ దగ్గరకు వెళ్లి థాంక్స్ బాబు అని చేతులు జోడించి చెప్పాడు. మా తమ్ముడిని కాపాడావు అన్నాడు.
అయ్యో అదేముంది సర్. లక్కీ గా నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది అన్నాడు వినీల్.
రక్తం ఎక్కించడం పూర్తయ్యింది.
డాక్టర్లందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
లక్కీ గా వినీల్ బ్లడ్ ఇవ్వబట్టి సరిపోయింది. ఏమాత్రం లేట్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ప్రాణానికే ముప్పు వచ్చి ఉండేది అనుకున్నారు అక్కడి డాక్టర్స్.
డాక్టర్స్ అదే మాట వినీల్ తో విజిత తో చెప్పారు.
ఇంచార్జి డాక్టర్ అయితే వినీల్ చేతి పై ఆప్యాయంగా నొక్కుతూ సమయానికి దేవుడిలా కాపాడావు అని పెద్దగానే కృతఙ్ఞతలు చెప్పాడు.
హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు ఇంచార్జి ని పిలిచి సీనియర్ డాక్టర్ తెగ తిట్టిపోస్తున్నాడు. బ్లడ్ స్టాక్ అయిపోగానే ఇమ్మీడియేట్ గా తెప్పించడం తెలీదా. ఏంటి అంత అశ్రద్ధ అని చీవాట్లు పెట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు.
డాక్టర్ వినీల్ ని చెక్ అప్ చేసాడు. కొంచెం నీరసంగా ఉంటుంది. కొన్ని గంటలు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అన్నాడు.
ఫరవాలేదండి అంటూ లేవబోయాడు వినీల్. కానీ కొంచెం తూలాడు.
విజిత పట్టుకుంది.
డాక్టర్ చెప్పారు కదా నీల్. కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. ఇవాళ ఇక్కడే ఉండు నాతోటి. నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది.
సరే. ఉంటాను అన్నాడు.
వినీల్ నీరసం చూసి సీనియర్ డాక్టర్ వెంటనే అతనికి సెలైన్ పెట్టమన్నాడు.
నర్స్ వచ్చి సెలైన్ అర్రెంజ్ చేసింది వినీల్ కి.
సీనియర్ డాక్టర్ విజిత వైపు తిరిగి అతనికి సెలైన్ ఇవ్వడం బెటర్ అని చెప్పాడు.
యస్ డాక్టర్ అంది విజిత థాంక్స్ చెప్తూ.
వీర్రాజు విజిత మాధవి ల దగ్గరికి వచ్చి ఈ రోజు అదృష్టం బాగుందమ్మా. మన వాడికి ప్రమాదమేమీ లేదు. కాకుంటే రిబ్స్ అతుక్కునేందుకే టైం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. మూడు నెలలు బెడ్ రెస్ట్ అవసరమన్నారు. అవన్నీ చిన్న విషయాలు అన్నాడు.
అవును బావగారు. నిజంగా అదృష్టం అంది మాధవి.
విజిత దగ్గరికి వచ్చి, ఏరా విజిత అంతా ఓకే నా అంటూ ఆప్యాయంగా తల నిమిరాడు. డాడీ సేఫ్ రా . ఏమి కాదు అన్నాడు.
థాంక్స్ పెదనాన్న. విజిత కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి డాడీ ని అలా చూస్తూ ఉంటె.
నేను పక్క రూమ్ లోనే ఉంటా. మనవాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్లకి విషయం చెప్పి వస్తాను అన్నారు వీర్రాజు గారు.
సరే పెదనాన్న అంది విజిత.
****
అప్పుడు రాత్రి ఏడు గంటలయింది.
అక్కడున్న పరిస్థితిలో ఎవ్వరూ ఏమీ మాట్లాడటల్లేదు. అంతా సీరియస్ గా ఉన్నారు.
వెంకటరాజు గారిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు రిబ్స్ కి బ్యాండేజ్ వేసేందుకు.
