Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 7

 

ఇప్పుడున్న జీవితంలో తను ఎంతో హ్యాపీగా ఉన్నాడు.
ఏ అలవాటూ లేని తనకు భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక వరం సాఫ్ట్వేర్ కోడింగ్. అదే తన జీవితానికి మధురమైన వ్యసనం.
అలా ఆలోచనలలో మునిగి ఉన్న వినీల్  రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు.
విజిత కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతోటి పలకరించింది.
ఏమీ లేదు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు వినీల్.
విజిత వినీల్ కన్నులతో మాట్లాడుకోవడం రాజు గారు గమనించారు. 
ఎక్కడ ఉంటున్నావు వినీల్ అడిగారు రాజు గారు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో సర్.
మేము అదే రోడ్ లో ఉంటాము. నువ్వెక్కడ ఉండేది.
వీర్రాజు గారి ఇంట్లో సర్.
అరే భలేవాడివే. వీర్రాజు గారు మా అన్నయ్య గారు. మేము మీ పక్కనే ఉండేది. నిన్ను ఎప్పుడు చూడలేదే. అన్నయ్య రెండు నెలల క్రితం చెప్పాడు ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సెకండ్ ఫ్లోర్ ఇచ్చానని. ఓహ్ అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు.
ఓహ్ అంది విజిత ఏమీ తెలియనట్లు.
ఆ విషయం రాజు గారు పసిగట్టారు.
చాలా సంతోషం వినీల్ నిన్ను ఇలా కలవడం. రేపు శనివారం. మీకు వీక్ ఆఫ్ కదా. మా ఇంటికి లంచ్ కి రాకూడదూ అన్నాడు.
నో నో సర్. నాకు పని ఉంది ప్లీజ్ అన్నాడు.
పనులు ఎప్పుడూ ఉంటాయిలేవయ్యా. మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాము. నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటికి వచ్చినప్పుడే నాన్  వెజ్ తింటాను. నా భార్యా, విజిత ఇద్దరూ ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్ప కుండా రేపు లంచ్ కి వస్తున్నావు. అంతే అని ఆర్డర్ వేశారు రాజు గారు. 
ఇక తప్పేట్లు లేదు అనుకుని తల అటు ఇటు ఊపుతూ అన్యమనస్కంగా సరే సర్ అన్నాడు వినీల్. ఎందుకో అతనికి అంత అంతస్తు కల వాళ్ళతో స్నేహం అంతగా రుచించడంలేదు. అయినా తప్పేట్లు లేదుగా అని లో లోపల మదన పడుతున్నాడు.
విజిత అప్పుడే రేపటి వంటల లిస్ట్ గురించి, వినీల్ ఇష్టాల గురించి ఆలోచిస్తోంది. 


****


అనుకున్న దానికంటే ఎక్కువే టైం స్పెండ్ చేశారు రాజు గారు వినీల్ తో.
వినీల్ కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులివ్వక తప్పలేదు.
కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు.
విజితకి డాడీ అవన్నీ అడగటం ఆశ్చర్యం కలిగించినా తెలుసుకుంటే మంచిదేలే అనుకుంది. తనకూ కొన్ని ముఖ్య విషయాలు తెలిసాయి.
వినీల్ అన్న ఐ ఏ ఎస్ ఆఫీసర్, అక్క ఇంజనీరింగ్ లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ గా ఉంటోంది. అందరూ మంచి పోసిషన్ లో ఉన్నారు. మంచి వెల్ సెటిల్ ఫామిలీ. తను కేవలం వినీల్ గురించే ఇప్పటివరకూ ఆలోచించింది. ఇప్పుడు అతని ఫామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది. 
భోజనాలు, మాటలు పూర్తి కాగానే వినీల్ తన కేబిన్ కి వెళ్ళిపోయాడు.
విజి ఇండస్ట్రీస్ స్టాఫ్ కూడా అందరూ వెళ్లిపోయారు.
మృణాల్ వెంకటరాజు గారికి, విజిత కి తమ ఆఫీస్ చూపించాడు.
చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజు గారు. 
వెంకటరాజు గారు మృణాల్ ని అడిగాడు వినీల్ గురించి.
మృణాల్ అన్ని విషయాలు సవివరంగా చెప్పాడు.
వినీల్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సర్. ఎటువంటి చెడు అలవాట్లు, అమ్మాయిలతో డేటింగ్ లు అలాంటివి అతనికి ఇష్టం ఉండదు. వీక్ ఎండ్స్ మాతో పార్టీలకు కూడా కలవాడు. అతని వల్ల మాకు కూడా ఇంట్లో ఇబ్బంది. అతన్ని చూసి నేర్చుకోండి అంటుంటారు. కానీ అది మా వల్ల కాదు.
తన శాలరీ ప్యాకేజీ కూడా సంవత్సరానికి కోటి పైనే. అదీ ఇండియా లో కాబట్టి.
ఓవర్సీస్ లో అయితే తక్కువ కు తక్కువ పది కోట్లకు తగ్గదు.
నా ఊహ నిజమైతే కొద్దీ కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప        సీఈ ఓ గా అతన్ని చూడొచ్చు.
శని ఆది వారాల్లో ప్రముఖ కంపెనీ తరఫున ఆన్లైన్ లో కోడింగ్ క్లాస్సేస్ తీసుకుంటుంటాడు.
అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీ లో వాటా ఇచ్చింది.
చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ ఉన్నాయి సర్.
రెండు నెలలలో పెళ్లి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లి తరువాత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు.
వాళ్ళ నాన్న గారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు.
అతను ఊ అంటే మా కంపెనీ లోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలూ.
ఎందుకంటే అతనిలో మచ్చుకు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు.   
ఇన్ని మంచి క్వాలిటీస్  ఉన్నా ఏమాత్రం గర్వం ఉండదు అతనికి.
మా అందరి దృష్టిలో అతనో ముని.
ఎప్పుడూ నవ్వుతూ అందరిని బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేయిస్తాడు.
అందరూ అతనితో కలిసి పనిచేసేందుకు పోటీ పడుతుంటారు.
అతను ఇక్కడికి రాక ముందు ఔట్పుట్ సగానికి తక్కువే ఉండేది.
అందుకే అతన్ని ఇక్కడికి అమెరికా నుంచి డెప్యూటేషన్ పిలిపించాము.
అతను వచ్చి ఆరు నెలలు కాలేదు ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్ట్ లు గడువుకు ముందే కంప్లీట్ చేస్తున్నారు.
నాకైతే ఎంతో హ్యాపీ గా ఉంది.
వినీల్ ని చూస్తుంటేనే ఎంతో ఎనర్జీ వస్తుంది. 
అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది.
వినీల్ గురించి మృణాల్ పొగడ్తల మాటలు అన్నీ మౌనంగా వింటోంది విజిత.
ఆమెకు వినీల్ స్కూల్ మేట్ కాబట్టి అప్పుడే అతన్ని గురించి ఒక అవగాహనకు వచ్చింది.
అందరూ కాలం అలా గడిపేస్తుంటే వినీల్ మాత్రం కాలాన్ని ఒడిసిపట్టుకుని తన ప్రతిభ కు సాన పెట్టుకుంటాడు.
అతన్ని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేరు.
రాజు గారి మనసులో విజితకు వినీల్ పై ప్రేమ ఉన్నట్లు అనుమానం బలపడుతోంది.
కానీ వినీల్ ఎటువంటి వాడో తెలీదుగా.
ఈ కాలం అమ్మాయిలు ఈజీ గా మోసపోతారు.
తన కూతురు గట్టిదే ఐనా, ఇప్పటివరకు ఎటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినీల్ పై ఒక కన్నేసి ఉంచడం అవసరం అని భావించాడు. 
అన్నీ చూస్తూ వినీల్ కేబిన్ దగ్గరికి వచ్చారు ముగ్గురూ.
అద్దంలోనుంచి చూస్తే చాలా బిజీ గా వర్క్ చేసుకుంటున్నాడు. డోర్ నాక్ చేసి మృణాల్ తలుపు తీసి రావొచ్చా వినీల్ అని అడిగాడు.
ఓహ్ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. 
అతని కేబిన్ చాలా విశాలంగా తీర్చి దిద్దినట్లుగా ఉంది. అందరూ చాలా ఇంప్రెస్స్ అయ్యారు.
నేను వెళతానమ్మా. మినిస్టర్ ని కలవాలి. ప్రాజెక్ట్ గురించి నీకేమైనా సందేహాలుంటే వినీల్ తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చేప్పారు రాజు గారు విజిత తో. నేను డ్రైవర్ కి చెప్పాను ఇంకో కారు తెప్పించమని.
ఓకే డాడ్. బై అంది విజిత.
వినీల్ సర్. మీతో కాసేపు డిస్కస్ చేయొచ్చా అంది విజిత.
స్యూర్ మేడం. రండి కూర్చోండి అని ఇన్వైట్ చేసాడు నవ్వుతూ.
మృణాల్ కేబిన్ తలుపు వేసి వెళ్ళిపోయాడు.
వినీల్ విజిత ఇద్దరే మిగిలారు.
చాలా చాలా కంగ్రాట్స్ నీల్.
నీకు అవార్డు రావడం అదీ నేను నీకు ఇవ్వడం చాలా హ్యాపీ గా ఉంది అతని కళ్ళలోకి చూస్తూ.
నీల్ అనడం విజి కి బాగా నచ్చింది.
ఆఫీస్ లో అందరూ అతన్ని నీల్ అనే పిలుస్తున్నారు. 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS