Previous Page Next Page 
మారణహోమం పేజి 77

 

    మాట్లాడుతూనే , ఆ ఖరీదయిన రిస్టు వాచ్ ని ఆమె మణికట్టుకి పెట్టాడు తరుణ్.
    తర్వాత డిన్నర్ పూర్తీ చెయ్యడానికి  ఎంతోసేపు [పట్టలేదు. డిన్నర్ చేస్తున్నంత సేపూ ఏమీ మాట్లాడుకోలేదు వాళ్ళు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు.
    డిన్నర్ పూర్తికాగానే రివాల్వర్ బయటికి తీశాడు తరుణ్. దాన్లో నుంచి బుల్లెట్లు తీసేసి, వాటిని టేబుల్ మీద పరిచిన కర్చేపులో పోసి, తనతోబాటు తెచ్చిన చిన్న సీసాలోని ఆయిల్ తో రివాల్వర్ ని శుభ్రపరిచాడు. ట్రిగ్గర్ ని రెండుసార్లు నొక్కి బాగా అయిలింగయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత బుల్లెట్లు మళ్ళీ రివాల్వర్ లో పెట్టి, ఆయిల్ బాటిల్ ని టాయిలెట్లో పడేసి, ప్లష్ చేశాడు.
    "సోలాంగ్! అమూల్యా!"
    "సోలాంగ్!" అంది అమూల్య నెమ్మదిగా.
    మరుక్షణంలో నీడల్లో కలిసిపోయి, అదృశ్యమయిపోయాడు తరుణ్.

 

                                                   * * *


    మర్నాడు పోచయ్యని కలిసింది అమూల్య.
    "చెప్పు తాతయ్యా! ఆదిశేషు గురించి నీకు తెలిసింది అంతా చెప్పు!"
    "అంతా చెప్పినాను కదమ్మా! ఇంక చెప్పెడిది ఏమీ లేదు."
    "నువ్వు ఆదిశేషుని ఈ మధ్య కలిశావా పోచయ్యా?'
    "అతనే నన్ను కలిశాడమ్మా!"
    "ఎందుకు?"
    "ఉరికేనమ్మా! చుట్టపుచూపు"
    "ఏం మాట్లాడుకున్నారు మీరు?"
    "పిచ్చాపాటీ మాట్లాడుకున్నామమ్మా! పాదరసం బుల్లెట్ల గురించి"
    అలర్టుగా అయిపొయింది అమూల్య.
    "పాదరసం బుల్లెట్లా? అవేమిటి?"
    పోచయ్య చెయ్యి అప్రయత్నంగా మీసం మీదకు పోయింది.
    "ఇంగ్లిషోళ్ళు ఇప్పుడు వాడుతున్నారట కదమ్మా పాదరసం బుల్లెట్లు? అవి నేను నలభై ఏళ్ళ క్రితమే తయారుచేసినా!"
    "వివరంగా చెప్పు తాతా?"
    "పాదరసం బుల్లెట్లు మామూలు బుల్లెట్లలాగా శరీరంలోకి చొచ్చుకుపోయి అక్కడ ఉండిపోవమ్మ? శరీరానికి తగలగానే బాంబులా పేలతాయి.
    మామూలు బులెట్ కొనని రుద్ది, అక్కడ ఉండే లోహాన్ని తొలగించాలమ్మా! లోపల ఉన్న సీసం కనబడుతుంది. అప్పుడు బులెట్ కొస మొద్దుబారిపోతుంది. దీన్లోకి చిన్న రంద్రం దొలవాలి. ఆ రంద్రంలో ఒక్క చుక్క పాదరసం పొయ్యాలి.
    తర్వాత సీసంతో దాన్ని సీలు చేసెయ్యాలి. గట్టిపడిన తర్వాత ఆకురాయితో రుద్ది, బులెట్ కొన మళ్ళీ కోసుగా వచ్చేట్లు చెయ్యాలి. మామూలు తుపాకి గుండుకి ఇది జేజెమ్మ లాంటిదమ్మా! దీన్ని నేనే సొయంగా కనుక్కున్నా!"
    అమూల్యకి తెలియదుగానీ, అక్కడ తరుణ్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ బుల్లెట్ల గురించి మరిన్ని వివరాలు చెప్పి ఉండేవారు. అవి ఎంత ప్రమాదకరమైన వంటే జెనీవా ఒప్పందం క్రింద వాటీ భారీ తయారీ నిషేధించబడింది.
    కానీ ఇప్పుడు ఏక్స్ ప్లోజివ్ బుల్లెట్ల గురించి ఆలోచించడంలేదు అమూల్య. ఆమె మనసు మరో సంగతి గురించి ఆలోచిస్తోంది.
    అదిశేషు! పాదరసం బుల్లెట్లు!
    ఆదిశేషుకి పాదరసం బుల్లెట్లతో ఏం పని? అతను దొంగతనంగా ఆయుధాలు తయారుచేస్తున్నాడా?
    అదేనా పోచయ్య సబ్ కాన్షస్ లోకి ఇంకిపోయిన క్లూ?
    "ఆదిశేషు తుపాకులు తయారుచెయ్యడం గురించి నిన్ను ఎప్పుడన్నా అడిగాడా తాతా?"
    కొద్దిక్షణాలు అలోచించి , హటాత్తుగా నుదుటిమీద కొట్టుకున్నాడు పోచయ్య.
    "నువ్వడిగితే గుర్తు వచ్చిందమ్మా? రెండేళ్ళక్రితం అతను నన్నోసారి అడిగాడు తుపాకి గొట్టాన్ని కోసేస్తే ఏమవుతుందని! కాల్చినప్పుడు గురి తప్పవచ్చని చెప్పాను."
    పోచయ్య అమూల్య ఇద్దరూ ఒఅకరివైపు ఒకరు సాభిప్రాయంగా చూసుకున్నారు.
    "నేను వెళ్ళొస్తా తాతా?"
    పోచయ్య ఆదుర్దాగా చూశాడు.
    "ఎక్కడికమ్మా? ఆదిశేషు దగ్గరికా?"
    మౌనంగా తల ఊపింది అమూల్య.
    "వద్దు తల్లీ! వాడు మంచివాడు కాదమ్మా?"
    నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయింది అమూల్య.

                                                      * * *


    "నువ్వేనా ఆదిశేషు?"
    ఒక కన్నుమూసి సన్నగా, పొడుగ్గా ఉన్న స్టీలు గొట్టాన్ని పరిశిలీస్తున్న ఆదిశేషు ఉలిక్కిపడి తలఎత్తాడు.
    "అవును! ఏం?"
    "నీతో మాట్లాడాలి?"
    అతని మోహంలో చిరాకు కనబడింది.
    "నీతో ఉసులాడే టయం నాకులేదు. ఎల్లెల్లు!"
    అతన్ని బ్లఫ్ చేసి చూడదలుచుకుంది అమూల్య. చీకట్లోకి రాయి విసరడం లాంటిది ఇది.
    తగిల్తే తగులుతుంది. లేకపోతే లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS