Previous Page
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 75

    "నేను చీపురు దెబ్బలు కొడ్తా" అంది చాముండేశ్వరి.

    "నేను జుట్టు పుల్లింగ్. చెవి పుల్లింగ్. హిహి" అన్నాడు భీమయ్య.

    "నేను చేంపపిన్నుతో  జబ్బల్లో పొడుస్తా" కసిగా అంది చిన్నమ్మాయి.

    "నేను మొహం మీద ప్తేటిస్తా..." అన్నాడు చిట్టబ్బాయి పిడికిలి బిగిస్తూ.

    "నేను నడ్దిమీద తంతా" అన్నాడు కన్నారావు.

    "నేను వాడి మెడమీద  కొరుకుతా-హిహిహి" అన్నాడు పండు.

    "నేను చుట్టకాల్చి నొసలు మీద వాతలు పెడ్తా..."మ్తెమరచిపోయిన వెంకన్న కూడా అన్నాడు హుషారుగా.

    "ఒరేయ్!నువ్వు  నా ఇంట్లో పనోడివి! మర్చిపోయావా?" పళ్ళు బిగిస్తూ అన్నాడు శివరావు.

    వెంకన్న నాలుక కొరుక్కుని చెంపలు వేసుకున్నాడు.

    "స్టాపిట్!... మీరంతా నోళ్ళు ముయ్యండి. లేకపోతే మీ అందర్నీ వర్సగా  మర్డర్ చేస్తా. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోడానికి  వీల్లేదు..." అంటూ అరిచాడు ఇన్స్ పెక్టర్ బంగార్రాజు. 

    శివరావు అటూ ఇటూ  చూసి ఉన్నట్టుండి పరుగు లంకించుకున్నాడు.

    "పారిపోతున్నాడు సచ్చినోడు పట్టుకోండి.... పట్టుకోండి అంటూ కంగారుగా అరిచింది చాముండేశ్వారి.

    భీమన్న  వెంటనే హాలు గుమ్మంకి అడ్డుగా నిలబడి శివరావు వంక చప్ప్స్తూ "కం బాబూ.. కం..." అన్నాడు జబ్బలు చరుస్తూ.

    శివరావు వెనక్కి పరుగుతిశాడు పెరట్లోంచి పారిపోదామని.

    కాని ఆ దారికి చిట్టబ్బాయి కన్నారావులు అడ్డుగా నిలబడ్డారు.

    "పట్టుకోండి ....పట్టుకోండి అంటూ అందరూ కేకలు పెట్టారు.

    శివరావు హాల్లోనే అందర్నీ తప్పించుకుంటూ అటూ ఇటూ పరుగులు పెడ్తున్నాడు.

    అందరూ అతన్ని పట్టుకోవాలని అతని వెనకాల పరుగు తీస్తున్నారు.

    "ఆగండి-ఆగండి" అంటూ గట్టిగా అరిచాడు ఇన్స్ పెక్టర్ బంగార్రాజు.

    అందరూ ఆగి బంగార్రాజు వంక చూశారు.

    "అసలు ఇన్స్ పెక్టర్ నేనా మీరా?"

    "మిరే" కోరస్ గా అన్నారు అంతా.

    "మరి వాడిని పట్టుకోడానికి మీరంతా పరుగులు పెడ్తారేం? నేరస్దుడిని నేను పట్టుకోవాలి! మీరంతా నోర్మూస్కుని ఓ పక్కన నిలబడండి. లేకపోతే మర్డరు చేస్తా వాడిని పట్టుకుంటూ" అన్నాడు బంగార్రాజు ముక్కు పొంగిస్తూ.

    "మిరే పట్టుకోండి. మాయదారి సంత, మేం ఊర్కే నిలబడ్తాం... మాకే లక్కి, ఆయాసం రాదు!" అన్నాడు రంగనాయకులు.

    "ఇన్స్ పెక్టర్ బంగార్రాజు "రెడి-వన్-టూ-ద్రి..." అని పరుగందుకున్నాడు శివరావుని పట్టుకోడానికి.

    శివరావు బంగార్రాజుకి చిక్కకుండా హల్లో పరుగు తీయడం ప్రారంభించాడు.

    "కమాన్, బంగార్రాజు కమాన్" అంటూ జనం మొత్తం అరవసాగారు.

    తలకిందులుగా వేళ్ళాడగట్టబడిన శివరావు  అసిస్టెంట్లు కూడా అరిచారు.

    "కమాన్ బాస్ కమాన్"

    బంగార్రాజు స్పిడందుకున్నాడు.

    శివరావు చేతికి దొరికె  సమయంలో హఠాత్తుగా శివరావు "కబడి-కబడి కబడి -కబడి..." అని కూతపట్టాడు.

    బంగార్రాజు ఠక్కున ఆగిపోయాడు.

    "నువ్వు చచ్చినా నన్ను ఔట్ చెయ్యలేవు. నేను చిన్నప్పుడు కబడి చాంపియన్ ని తెల్సా?" అన్నాడు బంగార్రాజు శివరావుని తప్పించుకోడానికి వెనక్కి జరుగుతూ.

    హాల్లోని అందరూ ఐఒక్కసారిగా "హ!... "అన్నారు తలల మీద చేతులేస్కుంటూ.

    "సార్-మిరుప్పడు కబడి ఆడడం లేదు. దొంగా పోలిస్ ఆతాడ్తున్నారు... మీ నుండి తప్పించుకోడానికి వాడలా వేషాలు వేస్తున్నాడు-" నెత్తి కొట్టుకుంటూ అన్నావదు అన్నాదెఉ కానిస్టేబుల్ ఏడుకొండలు.

    బంగార్రాజు నాలుక కొరుక్కుని "అవును కదా!" అని మళ్ళి ముందుకు పరుగెత్తాడు.

    శివరావు కంగారుగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయి కాళ్లు మెలికపది ధబెల్ మని బోర్లాపడ్డాడు.

    బంగార్రాజు అతన్ని కింద నుండి లేవదీసి ఒడిసి పట్టుకున్నాడు.

    కానిస్టేబుల్  ఏడుకొండలూ శివరావు చేతికి బేడీలు వేశాడు. దూలం నుండి వేళ్ళాడుతున్న శివరావు అసిస్టంట్స్ ని కూడా జిండికి దించి వాళ్ళకి కూడా బేడీలు వేశారు.

    "దూలం నుండి తలకిందులుగా వేళ్ళాడుతుంది వీళ్ళు ముగ్గురూ అయితే ఇందాక బయటికి నాకు ఆడాళ్ళు కెవ్వు కెవ్వుమని అరిచినట్లు వినిపించిందేమిటి?" అందరి వంకా చూస్తూ ప్రశ్నించాడు బంగార్రాజు.

    "అదా? వీళ్ళని తలకిందులుగా వెళ్లాడదిసి ఊపుతుంటె సంతోషం పట్టలేక మేం ఆడాళ్ళం అంతా అట్టా అరిచాం ఇన్స్ పెక్టర్ గారూ" అంది పార్వతమ్మ సిగ్గుపడ్తూ.

    "అంతేకదా?...నేనింకా ఇక్కడ మర్డర్లు అయిపోతున్నాయని అను కున్నాను..." అన్నాడు బంగార్రాజు నవ్వుతూ.

    అందరూ అతని మాటలకి నవ్వారు.

    చిక్కులన్నీ తొలగిపోయాయ్. సందేహాలన్నీ తిరిపోయాయ్. విలన్లు కూడా నన్ను క్షమించవూ?" అంది చిన్నమ్మాయి చిట్టబ్బాయ్ వంక చూస్తూ.

    "అలా అనకు రజ్జూ.  పరిస్ధితులు అలా వచ్చాయ్. దానికి నువ్వేం చేస్తావ్?"
    "చిట్టి!" ప్రేమగా పలికింది చిన్నమ్మాయి.

    "రజ్జూ" అంతకి ఇంకాస్త  ఎక్కువ  ప్రేమని పలికిస్తూ అన్నాడు చిట్టబ్బాయ్.

    "చిట్టి" చిట్టబ్బాయ్ దగ్గరకు జరుగుతూ అంది చిన్నమ్మాయి.

    "రజ్జూ" చిన్నమ్మాయిని దగ్గరకు  తీసుకుంటూ అన్నాడు చిట్టబ్బాయ్.

    రంగనాయకులు కళ్ళని భుజాలకేసి రుద్దుతూ ఆనందభాష్పాలు తుడుచుకున్నాడు. చాముండేశ్వారి చిర కొంగుతో ఆనందభాష్పాలు తుడుచుకుంది.

    "ఏవండి!నేనాత్మహత్య చేస్కుంటానండి" అంది భర్తతో పార్వతమ్మా.

    "నో... వీల్లేదు. ఆత్మహత్య చేస్కొడానికి చట్టం ఒప్పకోదు. నేను మిమ్మల్ని అరెస్టు చేసి లాకప్ పెట్టాల్సి వుంటుంది" వెంటనే అన్నాడు బంగార్రాజు.

    "అబ్బా!.. మా భార్యాభర్తల సంభాషణలో మీరెందుకు దూర్తారండి..."  తలపట్టుకుంటూ  అన్నాడు పరమేశ్వర్రావు.

    "ఆవిడ మీ భార్య అయినా సరే ఆవిడ ఆత్మహత్య చేస్కొడానికి నేనోప్పకోను ఆవిడని తిస్కెళ్ళి లాకప్ లో పడేస్తా. అడ్డోచ్చినోళ్ళని  మర్డరు చేస్తా"

    "మీరేం కంగారుపడకండి. పెళ్ళయిన  దగ్గర్నుండి  చూస్తున్నా ఆవిడిలాగే లక్షలసార్లు అందికాని  కనీసం ఒక్కసారి కూడా ఆత్మహత్య చేస్కోలేదు. మీరు అనడంలేదూ మర్డరు చేస్తానంటూ. మరి మర్డరు చేస్తున్నారా? అలాగేనన్న మాట!!" విడమర్చి చెప్పాడు పరమేశ్వర్రావు.
    "ఓ.. అలాగే .?...." అన్నాడు తలకాయ తాటిస్తూ ఇన్స్ పెక్టర్ బంగార్రాజు.
    "ఏవండి... నాకాత్మహత్య చేసుకోవాలని వుందండి..." మళ్ళి అంది పార్వతమ్మ.
    "అలాగేనమ్మా" అన్నాడు ఇన్స్పెక్టర్ బంగార్రాజు చిరునవ్వు నవ్వుతూ.

    "అందరూ ఇంత సంతోషంగా వున్నా  టైంలో  నికాత్మహత్య చేస్కోవాలని ఎందుకనిపిస్తుంది?" భార్యని అడిగాడు పరమేశ్వర్రావు.

    "మనకాలంలో ఇలానే వున్నామా? నేను మన పెళ్ళయిన నెల రోజులు దాకా మీతో మాట్లాడానా?"

    "అయితే ఇప్పడేమంటావ్?"

    "వీళ్ళు చూడండి పెళ్ళి కాకముందే ఎలా దగ్గరగా పట్టుకుని నిల్చున్నారో ..."

    "సర్లె...కాలం మారిపోయింది. అప్పట్లాగే ఇప్పుడు వుండమంటే ఎలా?" అన్నాడు పరమేశ్వర్రావు.

    "అవునమ్మగారు! అయ్యాగారు టెల్లింగ్ కరెక్ట్. యస్ అమ్మగారు యస్..." అన్నాడు భీమయ్య.

    "నాకు చేగోడీలు కొనివ్వరా బావగారండి" చిట్టబ్బాయ్ చొక్కా పట్టి లాగుతూ అడిగాడు పండు.

    "అబ్బా! తర్వాత కొంటానులేవోయ్" అన్నాడు చిట్టాబ్బాయ్ తల పట్టుకుంటూ.

    "ఆ... ఆ... నా కిప్పడే కావాలి!... పోనీ నువ్వు కొనిపెట్టారా" శివరావుని చూస్తూ అడిగాడు పండు.

    శివరావు ఏం సమాధానం చెప్పకుండా పళ్ళు నూరాడు.

    "బయటికెళ్ళాక నేను కొనిపెడ్తాలే బాబూ. కం బాబూ కం" అంటూ పండుని ఎత్తుకున్నాడు భీమయ్య.

    "ఎండుకుసార్ అట్టా అరిచారు? విళ్ళేమ్తెనా తప్పించుకుపోడానికి ప్రయత్నిస్తున్నారా?"

    కంగారుగా అడిగాడు కానిస్దేబుల్  ఏడుకొండలు.

    "నువ్వు నోర్ముయ్. లేకపోతే మర్డరు చేస్తా"

    బంగార్రాజు చూస్తున్న దిక్కుకి అందరూ చూశారు.

    కన్నారావు కాంతామణి భుజాలు మీద చేతులు పెట్టి మొహంలో మొహం పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు.

    "కన్ని..." ప్రేమగా పలికింది కాంతామణి.

    "కాంతా" మత్తుగా అన్నాడు కన్నారావు.

    మీరిద్దరూ దూరంగా జరగండి. లేకపోతే మర్డరు చేస్తా అరిచాడు ఇన్ స్పెక్టర్ బంగార్రాజు
    కన్నారావు కాంతామణికి దూరంగా జరిగాడు.

    "మా ఇంట్లో మీ ఇద్దరి పెళ్ళికి అభ్యంతరం  లేదయ్యా. కాని మీ ఇంట్లో కూడా అభ్యంతరం వుండకూడదుగా? ముందు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మానాన్నలకి ఈ విషయం చెప్ప. వాళ్ళని ఇక్కడికి తీసుకురా. తాంబూలాలు పుచ్చుకుందాం. అప్పడే ఏ పిచ్చివేషాలు వేసినా.." అన్నాడు బంగార్రాజు.

    "అలాగేనండి" అన్నాడు కన్నారావు.

    "నేను చెప్పినట్టు చేశారా సరే. లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా?" "ఆ తెల్సండి మర్డరు చేస్తారు!" అన్నాడు కన్నారావు.

    "నేను చెప్పినట్టు చేశారా సరే. లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా?" "ఆ తెల్సాండి  మర్డరు చేస్తారు!" అన్నాడు కన్నారావు.

    అందరూ ఘోల్లున నవ్వారు.

          చెట్టు చాటున నిల్చున వెంకట్ కెవ్వున అరిచి సుబ్బిగాడి డొక్కలో పొడిచాడు.

    "ఒరేయ్! ఇద్దరు  అమ్మాయిలు ఇటే  వస్తున్నార్ర్రా"

    "నిజంగా!" డొక్కా తడుముకుంటూ చెట్టు వెనకాల నుండి తొంగి చూసి అన్నాడు సుబ్బిగాడు.

    "అబ్బ! ఎంత బాగున్నార్రా!!"

    "మన ట్రిక్కు వీళ్ళమీద ప్రయోగిద్డామా?" అడిగాడు  వెంకట్.

    ఊ!..." హుషారుగా అన్నాడు సుబ్బిగాడు.

    ఇద్దరమ్మఇల్ని చెట్టు దాటనిచ్చి ఇద్దరు హిరోలూ మెల్లగా ఆ అమ్మాయిల వెనకాల కాస్త దూరం ఫాలో అయ్యి జేబులోంచి రుమాళ్ళు తిసి వాళ్ళ వెనకాల వేశారు.

    "ఏవండి మిమ్మల్నే..." పిలిచాడు వెంకట్.

    ఆ ఇద్దరు అమ్మాయిలూ వెనక్కి తిరిగి చూశారు.

    వాళ్ళు ఎవరో కాదు! చిన్నమ్మాయి, కాంతామణి.

    "మీ జేబురుమాళ్ళు పడిపోయాయ్. హిహి" అన్నాడు సుబ్బిగాడు.

    చిన్నమ్మాయి కాంతామణి మొహమొహాలు చూస్కుని నవ్వుకున్నారు.

    చిన్నమ్మాయి కాంతామణికి  స్తేగాచేసింది.

    కాంతామణి తల వూపింది.

    ఇద్దరూ ఆ అబ్బాయిలవంక చూసి  చిరునవ్వు నవ్వారు.

    వెంకట్, సుబ్బిగాడూ తబ్బిబ్బు అయిపోయారు.

    ఆ తరువాత చిన్నమ్మాయి, కాంతామణి ఇద్దరూ మెల్లగా ప్తెటకింది  నుండి బయటికి లాగారు.

    తళతళలాడే తాళిబొట్లు!!

    వాటిని చూస్తూనే "కెవ్వు" న వెనక్కి పరుగు తీశారు ఆ హీరోలు మిసెస్ చిట్టబ్బాయి, మిసెస్ కన్నారావూ పకపకా నవ్వారు.

  
                                                                         సమాప్తం
 


 Previous Page

WRITERS
PUBLICATIONS