రోజీ సోఫాలో కూర్చుంది. "మీరు కూర్చోండి" అంది ఇద్దరి వంకా చూస్తూ.
ఇద్దారూ గబుక్కున కూర్చున్నారు.
"చెప్పండి...ఎవరికీ కావాలి?"
ప్తెట సర్దుకున్నట్టు సర్దుకుని మళ్ళి జారేస్తూ అడిగింది.
"నాకే..."ఆనాడు ఉత్సాహంగా కన్నారావు.
కన్నారావు ఉత్సాహానికి చిట్టబ్బయికి కంగారు పుట్టింది.
రోజీకి కనబడకుండా చిట్టబాయ్ కన్నారావు తొడల మీది గిల్లి "అదే అదే ఇద్దారికి కావాలి ఇన్పర్మేషన్..." అన్నాడు.
"ఇన్ప ర్మేషన్ ? చెప్తాను వినండి. గంటకి ఇంత.హొల్ న్తెటైతే నాలుగొందలు!..."కళ్ళు తిప్పుతూ అంది.
"హమ్మో... నాలుగోందలే! పోనీ రెండొందలు చేస్కోరాదూ?..." అన్నాడు కన్నారావు.
ఈసారి చిట్టబ్బాయి కన్నారావు తొడలమీద గట్టిగా గిల్లెశాడు.
దెబ్బకి కన్నారావు కెవ్వుమని అరిచాడు.
"మనం ఇక్కడికెందుకోచ్చామో మార్చిపోయావా?..." పళ్ళు బిగబట్టి కన్నారావు చెవిలో మెల్లగా కసిరాడు చిట్టబ్బాయి.
కన్నారావు నాలుక కొరుక్కున్నాడు.
బయట గోడపక్కగా కాపు కాసి ఎదురు చూస్తున్న బంగార్రాజు ఉలిక్కి పడ్డాడు.
"లోపల మర్డర్లు జరిగిపోతున్నాయి... మనం వెంటనే లోపలికెళ్ళి మర్డర్లు ఆపాలి!!..." అన్నాడు రెండడుగులు ముందుకు వేస్తూ.
"మర్డర్లూ కాదు ఏం కాదు, మిరుండండిసార్...లోపల ఆ రోజీని చూచి సంతోషం పట్టలేక అట్టా కేవ్వమని అరిచుంటాడు..." అన్నాడు ఏడుకొండలు.
"అంతేనంటావా?" వెనక్కి తిరిగి అన్నడు బంగార్రాజు.
"అంతేసార్..."
పోలిసుల్ని చూస్తే కంగారుపడి అసలు విషయం దాచేసి తనకేం తెలీదని అంటుందని బంగార్రాజు, ఏడుకొండ బయట కాపువేశారు. చిట్టబ్బాయి, కన్నరావులు రోజీ నుండి వివరాలు రాబట్టలేని పక్షంలో బంగార్రాజు, ఏడుకొండలూ రంగంలోకి దూకి రోజీని భయపెట్టి విషయం రాబడ్తారు. అది వాళ్ల ప్లాన్...
కన్నారావు అరిచిన అరుపుకి రోజీ ఉలిక్కిపడింది.
"అదేంటండి అంత ఇదిగా అరిచారు...పోనీ నాలుగోందలంటే మరి అంతేక్కువలాగా అనిపిస్తే మూడొందలు ఇవ్వండి సరేనా?" అంది.
కన్నారావు మండుతున్న తోడ నిమురుకుంటూ చిట్టబ్బాయి వంక చూశాడు.
"దాని గురించి తర్వాత మాట్లాడ్తాం కాని ముంది విషయం చెప్పు... నీకు ప్రేమనంధం తెలుసా?" అడిగాడు చిట్టబ్బాయ్.
రోజీ ఫక్కుమని నవ్వింది.
"ఏది ఆ ప్రేమ సలహాల పిచ్చోడేనా?... ప్రేమనంధం నాకు తెలీకపోవడం ఏంటి...అందరికి సలహాలిచ్చేవాడు ఈ మధ్య నా వెనకాల ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతున్నాడు..."
"మరి నీకు శివరావు తెల్సా?"
"ఆయనెందుకు తెలీదూ?... శివరావు నా రెగ్యులర్ కష్టమర్ కదా?" మెలికలు తిరుగుతూ చెప్పింది రోజీ.
చిట్టబ్బాయ్ ,కన్నరావులు మొహమొహాలు చూస్కున్నారు.
"నీకు రంగనాయకులుగారు కూడా తెల్సా?" రోజీవ్తెపు తిరుగుతూ అడిగాడు చిట్టబ్బాయ్.
"రంగానాయకులా?.... ఆయనేవరూ??" ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి అంది రోజీ.
"కళ్ళద్దాలు పెట్టుకుని వుంటారూ? కాస్త మధ్య పాపిడి తిసి దువ్వుతారూ?వయసు యబ్తే ఏళ్లుంటాయి" గుర్తు చేస్తూ అన్నాడు కన్నారావు.
"ఎవరబ్బా!?" ఇంకా ఆలోచిస్తూనే అంది.
"నీకెలా గుర్తుంటార్లె రోజుకో కష్టమారు. ఒరేయ్ కన్నా ఫోటోలు తియ్య్రా చూసి చెప్తుంది..."
"ఆ...ఆ... ఫోటో అయితే చూసి గుర్తుపడ్తా..."హుషారుగా అంది రోజీ...
కన్నారావు జేబులోంచి ఫోటోలు తిసి రోజీ చేతికి ఇచ్చాడు.
ఫోటోలు చూసి రోజీ మొహం పాలిపోయింది.
"ఫోటోల్లో ఏమో నువ్వు చచ్చిపోయినట్టు ఉంది. నువ్వు చూస్తే బ్రతికే వున్నావ్... ఈ విషయం కాస్త వివరించి చెప్పమ్మా..."అన్నాడు చిట్టబ్బాయి.
రోజీ వెంటనే తేరుకుంది.
"అరె! ఈ అమ్మాయెవరో అచ్చం నాలాగే ఉందే..."అంది ఆశ్చర్యంగా ఫోటోల వంక చూస్తూ.
"నీలాగే ఉండడం కాదు ఆ ఫోటోల్లో ఉన్నది నువ్వే. నువ్వు అనవసరంగా నటించకు..."సీరియస్ గా అన్నాడు చిట్టబ్బాయ్.
వెంటనే రోజీ మొహంలో ఫీలింగ్స్ ఠకిమని మార్చేసింది.
ఓరగా ఇద్దరి వంకా చూసింది. తరువాత చిరునవ్వు నవ్వి కింద పెదవిని పంటితో నొక్కింది. ఆ తర్వాత "ఊ... ఆ..." అని మూలిగి ప్తెట పూర్తిగా జార్చింది.
"హిహి..."అన్నాడు కన్నారావు సంతోషం పట్టలేక.
చిట్టబ్బయికి ఒళ్ళుమండి కన్నారావుకి మరోసారి తొడపాశం పెట్టేశాడు.
మళ్ళి కెవ్వుమన్నాడు కన్నారావు.
"చూశావా చూశావా?...అది వీళ్ళనేడో చేసేస్తుంది. మళ్ళి ఎలా అరిచాడో చూడు!!"
బయట బంగార్రాజు చిందులేశాడు.
"లోపలికి వెళ్ళి ముగ్గుర్ని మర్డరు చెయ్యాలి!... ఏం చేస్తున్నారో ఏంటో..."
"మీరేం కంగారు పడకండి సార్...వాళ్ళు అలాంటి పనేద్తేనా చేస్తే ముగ్గుర్ని వ్యభిచారం కింద బుక్ చేద్దాం" అన్నాడు ఏడుకొండలు.
గది లోపల చిట్టబ్బాయ్ రోజీవంక కోపంగా చూస్తూ అన్నాడు. "ని వేశాలేం మా దగ్గర చెల్లావ్... చెప్పు ఎందుకలా నాటకం ఆడావ్?"
"ఏమో నాకేం తెలిదు..." అంది రోజీ మొండిగా.
"చెప్తావా లేదా?" అన్నాడు కన్నారావు పిడికిళ్ళు బిగిస్తూ...
"నాకు తెలిదు తెలిదు..."
చిట్టబ్బాయి కన్నారావు వంక చూసి కనుస్తెగా చేశాడు.
కన్నారావు నోట్లో రెండు వెళ్లు పెట్టుకుని విజిలేయ్యడానికి ప్రయత్నించాడు
"తు స్ స్ స్ స్...." అని శబ్దం వచ్చ్సింది తప్ప విజిల్ రాలేదు.
మరోసారి ప్రయత్నించాడు మళ్ళి 'తుస్' మని శబ్దం వచ్చింది.
"ఛి...సమయానికి వచ్చి చావదు...." విసుక్కున్నాడు కన్నారావు. "నీకు విజిలేయ్యడం వచ్చా?..." రోజీ వంక చూసి ప్రశ్నించాడు.
"ఓ.... ఎందుకురాదూ?" అంది రోజీ.
"ఏది వెయ్యి చూద్దాం!"
రోజీ చేతివేళ్ళని నోట్లో పెట్టుకుని గట్టిగా విజిలేసింది.
ఆ విజిల్ వింటూనే ముందుగా అనుకున్న ప్రకారం ఇన స్పెక్టర్ బంగార్రాజూ, కానిస్టేబులు ఏడుకొండలూ బిలబిలా లోపలికి వచ్చేశారు.
పోలిసుల్ని చూడగానే రోజీ కంగారు పడిపోయింది.
"ఏమిటిది?...ఎందుకు వచ్చారు మీరు?..." భయంగా చూస్తూ అడిగింది.
"ఎందుకంటావెంటి?.. నిన్ను అరెస్టు చేసి ఆ తర్వాత మర్డరు చేద్దామని" అన్నాడు బంగార్రాజు.
"ఎందుకూ? నేనేం చేశానని?!"
బంగార్రాజు కన్నారావు వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
"లేదండి...మాకేం చెప్పలేదు...నాకేం తెలీదని అంటోంది" అన్నాడు కన్నారావు.
"ఎలా చెప్పదో చూస్తాను..." అంటూ రోజీవ్తెపు తిరిగి "చెప్తావా? నాలుగు తగల్నియనా?" అన్నాడు బంగార్ర్రాజు.
వెంటనే రోజీ బంగార్రాజు వంక ఓరగా చూస్తూ ప్తెట జార్చింది.
"హిహిహి" సంబరంగా నవ్వాడు ఏడుకొండలు.
"ఏయ్ సెవెన్ హిల్స్ ... ఎంతా వెర్రి నవ్వు? ఇంకిలించడం ఆపకపోతే దానికంటే ముందు నిన్ను మర్డరు చేస్తా" అరిచాడు బంగార్రాజు.
ఏడుకొండలు నోర్మూసుకున్నాడు.
బంగార్రాజు రోజీవంక చూస్తూ అన్నాడు.
"ఏం?...ఒంటిమిద చిరనిలవడం లేదు?.. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ఒరేయ్ సెవెన్ హిల్స్! ని లాఠిని దిని ఒంటి మీద డాన్సాడించు...."
