Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 69

    "మీరు ఎంత బుకాయించినా చట్టం నుండి తప్పించుకోలేరు గురుజి... రోజిని అనుభవించి, ఆనక హత్య చేసినందుకుగాను మీకు ఉరి శిక్ష పడడం ఖాయం" నేదిరిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.

    "ఒర్నాయనో, ఇదెక్కడి గోల? రాజీని నేనెందుకు చంపుతాను? నాకేం తెలిదు  నాయనలారా, నన్ను వదిలిపెట్టండి. కావాలంటే ఆప్పుడు మీరు నాకు ఇచ్చ్సిన ఫీజులు వాపస్ చేసేస్తా" చేతులు జిదిస్తూ అన్నాడు ప్రేమానంధం.

    "ఏవండోయ్!పిండాకూడు మింగడానికి వస్తారా?"

    లోపలినుండి ప్రేమనంధం భార్య రంకె వెసింది.

    "ఆ...ఆ... వస్తున్నా..." ప్రేమనంధం లేవబోయాడు.

    "మమ్మల్ని మధ్యలో వదిలేసి ఎక్కడికి పోతారు గురూజీ?..." కన్నారావు ప్రేమనంధం భుజలుపట్టి కిందికి నొక్కాడు లేవనియకుండా.

    "నిజం ఒప్పకో గురూజీ... లేకపోతే నువ్వు రోజితో చక్కర్లు కొట్టావని, మోజు తీరిన తర్వాత చంపెశావని మీ ఆవిడకి చెప్తాం. ముందు మీ ఆవిడ నీకు చాపాతిలు వడ్డిస్తుంది. తర్వాత పోలీసులు తిస్కెళ్ళి పచ్చడి చేస్తారు...." అన్నాడు చిట్టబ్బాయి.

    ఇదెక్కడి గోల నాయనా నాకు?... రోజీ నాకు తెలుసుగాని రోజీని హత్య చేసింది నేను కాదు...." తల  పట్టుకుంటూ అన్నాడు ప్రేమనంధం.

    "ఏవండోయ్...పిండాకూడు మింగదానికి రారేం?..." లోపలి నుండి ప్రేమనంధం భార్య మళ్ళి అరిచింది.

    "చూశారా నాయన్లారా ఎలా అరుస్తుందో?... అసలు మొగుడని ఏమాత్రం గౌరవం లేదు... దీనితో ఏవిధమ్తెన సుఖం లేకనే రోజీ వేంటపడ్డాను. కాని రోజీని నేను హత్య చేయలేదు...నన్ను నమ్మండి నాయనా..." దినంగా అన్నాడు ప్రేమనంధం.

    "సర్లె...సర్లె.... మాకు రోజీ అడ్రెసు కావాలి చెప్పు..."అన్నాడు చిట్టబ్బాయి.

    కన్నారావు ప్రేమనంధం చేతిలోంచి ఫోటో తీస్కుని జేబులో పెట్టేస్కున్నాడు.

    "చనిపోయిన రోజీ అడ్రెసు మీకెందుకు నాయనా?" ఆశ్చర్యంగా అడిగాడు ప్రేమనందం.

            "శ్రాద్ధం పెట్టడానికి!!-లేకపోతే ఆమె అడ్రెసు మాకెందుకో నీకెందుకు?... చెప్తావా లేకపోతే...." అని ఆగి గది లోపలికి చూస్తూ "ఏవండి...." అని పిలిచాడు కన్నారావు.

    ప్రేమానంధం చటుక్కున కన్నారావు నోరుమూసేసి "కంగారుపడకు నాయనా... చెప్తానుగా" అన్నాడు.

    "ఊ నాన్చాకుండా త్వరాగా చెప్పు"  గద్దించి అడిగాడు చిట్టబ్బాయి.

    "ప్రేమనంధం రోజీ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి వివరంగా చెప్పాడు.

    "నేను మరోసారి చెప్తున్నా నాయనా. రోజీ హత్యతో నాకేమాత్రం సంబంధం లేదు" అన్నాడు వెళ్ళిపోడానికి సిద్దాపడ్తున్న చిట్టబ్బాయి కన్నరావుల్తో.

    "మాకు ఇక్కడికి రాకముందే తెల్సు" చెప్పాడు కన్నారావు.

    "ఎలా తెల్సు?"

    "రోజీ బ్రతికే ఉంది కనుక..."

    "ఆ...నోరు తెరిచాడు ప్రేమనంధం.

    "ఏవండోయ్ ఇందాకట్నుండి పిలుస్తుంటే రారేం మీ జిమ్మడ..." లోపల్నుండి మళ్ళి గట్టిగా అరిచింది ప్రేమనంధం వాళ్ళావిడ.

    "చూడు  గురుజి... ఈ రోజిలూ, గిజిలూ మార్చిపోయి ముందు ఆవిడ్ని కంట్రోల్ చేసి మాగాడిలా బ్రతుకు" సలహా ఇచ్చాడు చిట్టబ్బాయి.

    "ఏవండోయ్! మిమ్మల్నే, పిలుస్తుంటే వినబడ్డంలేదా? చెవులు దిబ్బళ్లేశాయా? మళ్ళి లోపలి నుండి పిలుపు వచ్చింది.

    "నువ్వు చెప్పిన సలహా నాకు నచ్చింది నాయనా. లోపలికెళ్ళి దాని పని పడ్తాను... వస్తా నాయనా."

    చిట్టబ్బాయితో  చెప్పి పిడికిళ్ళు బిగించుకుని లోపలికి విసురుగా వెళ్లాడు ప్రేమనంధం.

    మరుక్షణం లోపలి నుండి :గుభి" మని శబ్దం, ఆ వెనువెంటనే "చచ్చాన్రో దేవుడో" అని ప్రేమనంధం భార్య పెట్టిన కేకా వినిపించాయి చిట్టబ్బాయి కన్నరావులకి.

    వాళ్ళిద్దరూ ప్రేమనంధం ఇంట్లోంచి మెయిన్ రోడ్డు మీదికి వచ్చారు. అక్కడ ఒక ఆటో మాట్లాడుకుని పోలిస్ స్టేషన్ కి వెళ్ళారు. ఆక్కడ ఇన్ స్పెక్టర్ బంగార్రాజు లేడు. "ఇపుడే ఆయన యింటికెళ్లారు" అని స్టేషన్లో వాళ్లు చెప్పారు.

    ఇద్దరూ అక్కడి నుండి బంగార్రాజు ఇంటికి వెళ్లారు.

    "రా బాబూ రా- బొత్తిగా మా ఇంటికి రావడం మానేశావేం? మర్డరు చేసేవాడు లేకా?" వరండాలో ఉన్న బంగార్రాజు కన్నరావుని చూస్తూ అన్నాడు.

    "ఎందుకు రావడం లేదండి? నేను వచ్చినప్పుడు మీరు డ్యూటి లో ఉంటారండి. మీరు డ్యూటి లో ఉన్నప్పుడు నేనోస్తుంటానండి..." అన్నాడు కన్నారావు.

    కన్నారావు గొంతు వినగానే కాంతామణి బయటికి పరుగెత్తుకు వచ్చింది. ఆ వెనుకే కామాక్షమ్మ కూడా వచ్చింది.

    "ఏవిటి సంగతి... ఎదో హడావిడిలో ఉన్నట్టున్నారు?" అడిగాడు బంగార్రాజు.

    "మీతో ఒక ముఖ్యమ్తెన పని ఉంది వచ్చానండి "అన్నాడు చిట్టబ్బాయి.

    "ఏవండి భోజనాలు పెట్టాలా కాఫీ తాగుతార?" అడిగింది కామాక్షమ్మ.

    ఆమెకి సమాధానం చెప్పకుండా "ఏం పని?" అని అడిగాడు బంగార్రాజు.

    "త్వరగా చెప్పండి...నాకసలే ఆయాసం ఎక్కువ. అన్నిసార్లు అడగలేను.
భోజనాలు వడ్డించాలా, కాఫీలు తాగుతారా?" అంది కామాక్షమ్మ.

    "ఆయాసం అయితే లోపలికెళ్ళి పడుకో. మేం మాట్లాడుకుంటుంటే అలా డిస్టర్బు చేయుద్దు...ఏమ్తెనా కావాలంటే నేనే వచ్చి చెప్తా" విసుక్కుంటూ అన్నాడు బంగార్రాజు.

    "ఏంటో ...అసలే నాకాయాసం అయితే ర్రాయణ విసుక్కోడం ఒకటి"

    గోనుక్కంటూ  లోపలికి వెళ్ళిపోయింది కామాక్షమ్మ.

    "చెప్పండి...ఏంటి మీ ప్రాబ్లం?" అడిగాడు బంగార్రాజు.

    కన్నారావు, చిట్టబ్బాయి సంగతంతా వివరంగా చెప్పారు.

    అంతా విని బంగార్రాజు గట్టిగా అరిచాడు. "ఏయ్  సెవెన్ హిల్!"

    వరండాలో ఓ మూల నిల్చుని ఉన్న కాని స్టేబుల్ ఏడుకొండలు టక్కున
ముందుకువచ్చి నేలకేసి బూతుకాల్తో ఠా...ప్  మనికొట్టి  "యస్సార్..." అన్నాడు.

    "మనం ఇప్పుడు తక్షణం రోజీ అనే ఆడ కూతుర్ని మర్డర్ చేయాలి! పద!!"

    "యస్సార్...."

         అందరూ ఇంటి ముందు ఆగివున్న జీపు ఎక్కారు. జీపు రయ్యిమని ముందుకు కదిలింది.


                           *               *            *

    చిట్టబ్బాయి డోర్ బెల్  నొక్కాడు. బెల్ లోపల మోగడం వినిపించింది.

    కాసేపు ఆగి మళ్ళి నొక్కాడు.

    కొన్ని క్షణాలు ఎదురు చూశాడు  చిట్టబ్బాయి, కన్నరావులు. ఎవరూ తలుపు తియ్యలేదు.

    "ఇంట్లో ఎవరెవరు ఉంటారో??" అన్నాడు కన్నారావు చిట్టబ్బాయి వంక చూస్తూ.

    "ఒక్కరతే వుంటుందనుకుంటా..." జవాబిచ్చాడు చిట్టబ్బాయి.

    "బెల్ కొడ్తే ఎంతకిరాదేం?" మొహం చిట్లించి అన్నాడు కన్నారావు.

    "వస్తుంది,వస్తుంది. ఏం పనిలో ఉందో ..." అంటూ మరోసారి కాలింగ్ బెల్ నోక్కబోయాడు చిట్టబ్బాయి. అంతలోనే భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి.

    ఆమె!...

    రంగనాయకులు తో ఫోటోలో ఉన్నామో!!...

    ఆమె రోజీ.

    రోజీ రోజ్ కలర్ చిరలోనే ఉంది. ప్తెట గుండెల మీద నుండి కాస్త తప్పుకుని లోనేక్ జాగిట్ లోంచి ఆమె గుండెలు సగం సగం కనిపిస్తున్నాయి.

    రోజీ చూడగానే చిట్టబ్బాయి, కన్నరావూ ఇద్దరూ తడబడిపోయారు.

    "ఏమిటి?... ఎవరు కావాలి?..." కళ్ళు ఎగరేస్తూ ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ అడిగింది రోజీ.

    "మరి.. ఏంటంటే... అది అసలు సంగతి హిహి..."అన్నాడు కన్నారావు మెలికలు తిరిగిపోతూ

    "అదేనండి.. ఇక్కడ...రోజీ అని హిహి..."అన్నాడు చిట్టబ్బాయి.

    రోజీ నర్మగర్బంగా నావ్వుతూ "అర్ధం అయ్యింది. ఈ పనికి కొత్తలా వున్నారు... కోపలికి రండి..." అంది వెనక్కి తిరిగి వయ్యారంగా లోపలికి నడుస్తూ.

    ఇద్దరూ ఆమెని ఫాలో అయ్యారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS