దూరమువ రెండు గంటలు కొట్టిన చప్పడయ్యేను. అంతదాతడు లేచి శశిరేఖను తలచుకొనుచు దాము సంతోషముగ దినములు గడపిన ఆ వృక్షముల క్రిందకు బోయెను.ఆమె మృతి జేందేనని నిశ్చయమేర్పడెను. తానేకారకుడామె మరణమునకు. ఇంక దేని కొరకు తాను మాత్రము బ్రతుకవలెను? ప్రేమలేని యవ్వనము నూని వలికిన దీపము. ఇట్లు తలపోయుచు అపారమగు హృదయవేదనను కృంగి యా వృక్షమును సమీపించెను.
నిర్మలాకాశము తెల్లని వెన్నెల కాయుచుండెను. వెన్నెల తరంగములచేలోకము నింపబడినటుల కానవచ్చెను. లాకు తలుపుల సందులలో నుండిపడు నిరు జలజలమను శబ్దము చేయుచుండెను. తెల్లవారినదని లేచి కోయిల కూసెను. ఎచటనో గుడ్లగూబ యొకటి కిచుమనెను. అప్పడే వికసించిన జాజిపూవుల వాసన చల్లని వాయువు పై విచుచుండెను.కృష్ణుడు తటాలున రాలిన ఆకులపై బోర్లపడి "శశి,శశి, ఎక్కడున్నావు? అయ్యో శశి, రావూ,రావూ," దయలేదూ, గుండెలు పగులుతున్నాయి శశి, రావూ,రావూ,"అని మెల్లగ నావేశాముతో ననుచుండెను.ఒక హస్తమాతని వీపు పై ప్రాకి కౌగలించుకోనేను. కన్నీళ్ళతో తడిసిన ముఖమొక టాతని ముఖమునానుకొని మెల్లగ, "కృష్ణా,ఎందుకు?" అని యడిగెను. తనను తాను నమ్మజాలక అతడు ముఖమెత్తి చూచెను. దిర్ఘమగు మృదు శిరోజము లాతని కండ్లకడ్డుపడెను. ఎవరని యాతడడిగెను." నేను కృష్ణా, ఎందుకు ఏడుస్తావు? ఏడవకు ఇంక నిన్ను వదలనుగా, నా కృష్ణా, నిన్ను వదలి పోయినాననుకున్నావా?" అని అతనిని కౌగలించుకొని శశిరేఖ అతని కన్నీళ్ళను తుడిచెను.
* * *
చంద్రుడు హంసతూలికాతుల్యములగు మేఘముల నాకర్షించి తన చిరునవ్వుచే సత్కరించుచుండెను. మందమారుతము పూకన్నియల సంయోగము తెల్పు పరిమళమును విచుచుచుండెను. చంద్రకిరణములచేముద్దిడబడిన యలలు వజ్రములు వెదచల్లి నటుల మెరయుచుండెను.ప్రతి యాకును ఆకసమువంక నోర్లుతేరచి మంచుబిందువుల స్పర్శనాసౌఖ్యము కొరకు వేచియుండెను. లోకమంతయును ప్రేమలిలలలో నోలలాడుచుండెను.
మూడుగంటలు కొట్టిన చప్పుడ్తెనది. కృష్ణుడు తటాలున పత్రశయ్యములనుండి లేచి, శశిరేఖను లేపెను.
కృష్ణు - మూడుగంటలయినంది. తెల్లవారుతోంది.
శశి- సరేలే. నిధ్రవస్తోంది.
కృష్ణు - కాని ఏమాలోచించావు?ఏం చెయ్యాలి?
శశి - చేసేదేముంది? ఇంకేం కావాలి? మన్ని విడదియ్యడం ఎవరుకి చేతవుతుంది?
కృష్ణు - అట్లాకాదు.ఏమయినాసరే తెల్లవారి నిన్నిక్కడ చూశారంటే మీవాళ్ళు బలవంతంగా మన్ని విడదియ్యక మానరు.
శశి - నన్నా? వాళ్ళకు చేతవుతుందా? భయంలేదు కృష్ణా, నిధ్రవస్తోంది, ఇట్టా పడుకో.
కృష్ణు - శశి, ఈ నిమిషం సంతోషంలో ముందుసంగతి నీకు తెలవడంలేదు. ఒక్కనిమిషం నా మాట విను.
అని మెల్లగా ఆమెను తన చేతులతో లేవదీసి తననానించుకొని కూర్చుండబెట్టుకోనెను.
కృష్ణు - బలవంతంగా నిన్ను లాక్కేడితే ఎవరేం చెయ్యగలరు? వాళ్ళకోపంలో మనమేమన్నా వాళ్ళు వినేస్దితిలో వుండరు.శశి నా ప్రాణాలు పోయినా నాకు విచారంలేదు. నిన్ను వదలి బతకలేను. నేను చెప్పేది వినవూ?
శశి - చెప్పు.
కృష్ణు - మనము కొంతకాలము వీళ్ళకి కనబడకుండా వుంటే మంచిది. తరువాతవచ్చి యిక్కడే వుండవచ్చును. కాలము మించిపోతోంది.వప్పకోవూ నాతో రావడానికి?
శశి - వప్పకొక చేసేదేముంది. మఱి యెక్కడకేడదాం?
కృష్ణు - అదంతా ఆలోచించాను. ఇక్కడే వుండు వస్తాను.
అని యింటికిపోయి కావలసిన వస్తువులు సొమ్మును తీసుకొని వచ్చెను. లాకులకవతల కట్టియుండు డింగియందు నాలుగు దిండ్లను వైచి సంసిద్ధము చేసెను. శశిరేఖకు ద్తేర్యము చెప్పచు తీసికొనిపోయి ఆ డింగియందు కూర్చుండబెట్టి తానును ఎక్కి డింగిని లోపలికి నేట్టేను. ప్రవాహమునకు డింగి పోవుచుండెను.
కృష్ణు - వాటి నానుకొని నిద్రపో.
శశి - ఇప్పుడు నిద్ర రావటంలేదు.
కృష్ణు- ఇందాక వచ్చిందే?
శశి - ఎంతబాగుంది కృష్ణా! ఎప్పడూ మనయిద్ధారం యిట్లా వెడుతూవుంటే బాగుండదూ? ఎంత చల్లగాలి చూడు. మెల్లిగా తెల్ల పడుతోంది ఆకాశం.
కృష్ణు - మీవాళ్ళమనుకుంటారు, తెల్లవారి నువ్వు కనబడకపోతే దేంట్లోనో పడిపోయినావనుకుంటారు. నువ్వు పోయిందే చాలని రేపటి ముహుర్తనికే వాడు యింకోకర్ని కట్టుకోంటాడు.
శశి - మీ వాళ్ళో?
కృష్ణు - మా వాళ్ళతో చెప్పేవచ్చాను.
శశి - నేను చాచ్చిపోయానని మావాళ్ళనుకుంటే నాకు బాగుండదు. నేను నీతో వచ్చేశానని వాళ్ళకు తెలియాలి.
కృష్ణు - తెలిస్తే అందరూ వరుసగా ఉరేసుకొని వెళ్ళాడతారు.
శశి - పాపం మా అమ్మ ఎంత ఏడుస్తుందో?
