Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 68

    రంగనాయకులు సమాధానం ఏమి చెప్పలేదు.


    "మీరు చెప్పకపోయినా నాకు తెల్సు. ఆ శివరావుగాడి గురించే కాదూ?..."


    "అవును... వాళ్ళ నాన్న వీరాస్వామి..." ఎదో చెప్పబోయాడు రంగనాయకులు  కాని చిట్టబ్బాయి మధ్యలోనే అడ్డు తగిలాడు.


    శివరావు తండ్రి పేరు వీరాస్వామి కానే కాదు... అంతేకాదు. అతని తండ్రి ఏనాడో మరణించాడు... ఈ శివరావు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు... అంతేనా?"


    రంగనాయకులు తెల్లబోయి చిట్టబ్బాయి వంక చూశాడు.


    "రజ్జూ...నాకు తల దిమ్ముగా ఉంది... కాస్త కాఫీ తీసుకురావా?" అడిగాడు చిట్టబ్బాయి చిన్నమ్మాయ్ వంక చూస్తూ.


    చిన్నమ్మాయి లోపలికి వెళ్ళింది.


    ఆమె  అలా లోపలికి  వెళ్ళగానే చిట్టబ్బాయి కన్నారావుకి స్తెగా చేశాడు. కన్నారావు    జేబులోంచి కవరు తిసి రంగానాయకులుకి అందించాడు. రంగనాయకులు ప్రశ్నార్ధకంగా ఇద్దరి వంకా చూశాడు.


    "అందులో ఫోటోలు ఉన్నాయ్.. .చూడండి..." అన్నాడు చిట్టబ్బాయి.


    రంగనాయకులు కవరులోని ఫోటోలు తిసి చూశాడు. అంతాని మొహంలో చుక్క రక్తం లేదు.


    "ఈ ఫోటోలు మికెలా వచ్చాయి?"


    అలా అడుగుతున్నప్పుడు అతని గొంతు వణికింది.


    "మీ అమ్మాయే ఇచ్చింది..." జవాబు చెప్పాడు కన్నారావు.


    "ఈ ఫోటోలు చూస్తుంటే తప్ప  నాకు నమ్మకం కలగడం లేదు...అసలు ఇలా  నేనేనా చెయ్యగలిగింది అని" బాధపడ్తూ అన్నాడు రంగనాయకులు.


    "మీరు అనుకుంటున్నట్లు ఆ ఫోటోలోని అమ్మాయి చనిపోలేదు...ఆమె బ్రతికే ఉంది... ఆ శివరావు ఫోటోలు  అడ్డుపెట్టుకుని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..." అన్నాడు చిట్టబ్బాయి.


    "నిజంగానా!...." కళ్ళు ఇంతింత చేస్కుని చూస్తూ అన్నాడు రంగనాయకులు.


    "అవును సార్... ఆ అమ్మాయిని నేను రెండ్రోజుల క్రితం చూశాను..."చెప్పాడు కన్నారావు.


    "అసలు నేననుకోవడం ఆ అమ్మాయి పక్కన పడుకోడం కూడా మీకు తెలీకుండానే ఉండాలి!" అన్నాడు చిట్టబ్బాయి.


    "అవును! దరిద్రం సంత... నాకప్పుడు మ్తెకంగా ఉంది..." అన్నాడు రంగనాయకులు ఎదో గుర్తు చేస్కుంటున్నాట్టు.


    "అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తారా?... అసలు ఈ శివరావుకి మీకూ ఎలా పరిచయం?' కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయి.


    రంగనాయకులు చటుక్కున ఫోటోలు చొక్కా జేబులో పెట్టేసుకున్నాడు. ఫోటోలు చూస్తుండగా రంగనాయకులు ఇబ్బందిగా ఫిలవకూడదనే చిట్టబ్బాయి కాఫీ పేర్తో చిన్నమ్మాయిని లోపలికి పంపించాడు.


    అందరూ కాఫీ కప్పలు అందుకుని తాగారు.


    "ఊ...ఇప్పుడు చెప్పండి... అసలేం జరిగింది" కప్పు పక్కన పెడ్తూ అడిగాడు చిట్టబ్బాయి.


    రంగనాయకులు కూతురు వంక ఇబ్బందిగా చూశాడు.


    "చెప్పనాన్నా..."


    రంగనాయకులు గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు.


    "మా కం స్ట్రక్షన్ కంపెనీలో శివరావు ఇదివరకు మేనేజర్ గా పనిచేసేవాడు. అతని ప్రవర్తన మీద నాకు చాలా కంప్ల్తేంట్స్  వచ్చేవి, అమ్మాయిలతో మిస్  బిహేవ్ చేసేవాడని. ఒకట్రెండుసార్లు అతన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చాను. ఒకసారి కంపెని అక్కౌంట్స్  చెకింగ్ చేస్తుంటే నాకు అనుమానం వచ్చింది వాడు దొంగ లెక్కలు వేసి కంపెని సొమ్ము కాజేస్తున్నాడేమొ అని. ఇంక ఈ దిక్కుమాల్ని సంతని కంపెనీలో ఉంచుకుంటే లాభంలేదని వాడిని ఉద్యోగం  లోంచి తిసేశాను."


    చెప్పడం ఆపి ముగ్గురి వంకా చూశాడు రంగనాయకులు.


    "ఊ... తరువాత?" చిట్టబ్బాయి కుతూహలంగా ప్రశ్నించాడు.


    "కొన్ని రోజులు తరువాత శివరావు నాకు ఫోన్ చేశాడు. తను కంపెని సామజము చాలా తక్కువ మొత్తం తిన్నాడని, నా కంపెని మరొకడు తిన్నాడని...


    వాడు చాలా తినేస్తున్నాడని చెప్పాడు. ఎవరు వాడని అడిగాను నేను. ఫోన్లో కంటే పర్సనల్ గా వస్తే వివరాలన్నీ రుజువుల్తో సహా చూపిస్తానని చెప్పాడు... నేను చిక్కడపల్లిలోని వాళ్ళింటికి వెళ్లాను..."


    చిన్నమ్మాయి, చిట్టబ్బాయి, కన్నరావులు చెవులు రిక్కించి రంగనాయకులు చెప్పేది వినసాగారు.



                                                                        23


    చిట్టబ్బాయి,కన్నారావుల్ని చూడగానే ప్రేమానందం చెవుల్దాకా నవ్వాడు.


    "రండి... రండి... అప్పుడు నేను జెప్పిన సలహాలేమి క్లిక్ కాలేదా? జంటలుగా నా దగ్గరికి రాకుండా ఇద్దరే వచ్చారు?... మరేం ఫర్లేదు.

నా దగ్గర ఇంకా చాలా చిట్కాలున్నాయి... ఈసారి తప్పకుండా ప్రేమలో పది పోతారు..." అన్నాడు హుషారుగా.


    "ఆ ఏం పడడంలెండి గురూజీ..." నిర్సంగా అన్నాడు చిట్టబ్బాయి.


    "ఏం నయానా అలా అంటున్నావ్?" కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ప్రేమానందం.


    "నిర్సం కాకుండా మరేంటి?... ఊర్లోని ఆడపిల్లల్ని మీరు మాదాకా రానిస్తారా అసలు?" అన్నాడు కన్నారావు నిఘ్టరంగా.


    "ఏంటి నాయనా భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావ్?"


    "గమ్మత్తేనండి మరి... యవ్వనంలో ఉన్న మమ్మల్ని కాకుండా అమ్మాయిలు మిమ్మల్నేందుకు ప్రేమిస్తారో..." అన్నాడు చిట్టబ్బాయి.


    "నాకంతా గందరగోళంగా ఉంది నాయనా... మీరు మాట్లాడుతున్నాది ఒక్క ముక్క కూడా నాకు అర్ధంకావడం లేదు."

అయోమయంగా ఇద్దరి వంక చూస్తూ అన్నాడు ప్రేమానందం.


    "అదే గురూజీ... రాజీ అనే అమ్మాయి మీకు తెలుసు కదా..."


    చల్లగా అన్నాడు కన్నారావు.


     "ఆ అమ్మాయికి మేము ల్తెనేద్దమనుకుంటే ఆమేమో మిమ్మల్ని ప్రేమిస్తుంది..."


    రాజీ పేరు వినగానే ప్రేమనందంలో కంగారు బయలుదేరింది.


    "రోజియా?... రాజీ ఎవరు నాయనా?... ఆ పేరే నేనెప్పుడు వినలేదే...హిహి... నిజంగా నాయనా...హి.." నవ్వాలని ప్రయత్నిస్తూ అన్నాడు ప్రేమానందం. అతని మొహంలో టకటకా రంగులు మారిపోసాగాయి.


    "ఎందుకు గురుజి అలా కంగారు పడ్తున్నారు?" ప్రేమనంధం మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి.


    "కంగారా?.. నాకా?.. ఎందుకూ?.. నేనేం కంగారు పడట్లేదుగా... నేను నవ్వుతున్నాగా...హిహి.."అన్నాడు ప్రేమానంధం మరింతగా కంగారు పడ్తూ.


    "ఇంతకి మీకు  రాజీ తెలిదా గురూజీ?" కన్నారావు అడిగాడు.


    "నాకు తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి నాయనా..." నేత్తికొట్టుకుంటూ అన్నాడు ప్రేమనంధం.


    "బుకాయించొద్దు గురూజీ, నేను మిమ్మల్ని రోజితో ఇందిరాపార్కులో చూశాను.


    "ఏమో నాయనా! మీరు ఎవర్ని చూసి ఎవరని అనుకున్నారో... నాకు బయటికి వెళ్లే  పనుండి నాయనా" లేవబోతూ కంగారుగా అన్నాడు ప్రేమనంధం.


    "మేం వెళ్తాంగాని ఓసారి ఈ పోటోచూడు గురూజీ" కన్నారావు జేబులోంచి ఫోటో తిసి ప్రేమనందానికి అందించాడు.


    ఆ ఫోటో చూడగానే ప్రేమనంధం  అదిరిపడ్డాడు.


    అది రోజీ రక్తపు మడుగులో పడివున్న ఫోటో.


    "ఆ!!రోజీ చాచ్చిపోయిందా? ఎవరు చంపారు?" ఒణికిపోతూ అన్నాడు.


    "రోజీ ఎవరో తెలీదని చెప్పి ఫోటో లోని  రోజిని ఎలా గుర్తుపట్టారు గురూజీ" చిట్టబ్బాయి నావ్వుతూ అడిగాడు.


    "అదా అది, మిరిందాకట్నుండి రాజీ రాజీ అంటున్నారు కదా... అందుకనే ఫోతోలోనిది ఆ అమ్మాయేమోనని గెస్ చేశాను" తడబడ్తూ అన్నాడు ప్రేమనంధం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS