Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 67

    "ఎప్పుడోచ్చారు అన్నయ్యగారూ?..." అడిగింది పరమేశ్వర్రావుని పలకరింపుగా.


    "నిన్న తగలడ్దాంలే చెల్లెమ్మా..." అన్నాడు పరమేశ్వరరావు.


    చాముండేశ్వరి మొహంలో రంగులు మారాయ్. కాని అంతలోనే తామయించుకుని "  "బాగున్నారా వదినా?"....అని పార్వతమ్మని అడిగంది.


    "ఏం బాగుండడమోలె... ఆత్మహత్య చేస్కోవాలని అనిపిస్తుంది..." అంది పార్వతమ్మ ముక్కుపుటాలు పొంగిస్తూ.


    పెళ్ళి సంబందం  కాన్సిల్ అయిందన్న విషయం వాళ్ళకి తెలిసిందన్న సంగతి రంగనాయకులకి అర్ధం  అయింది.


    "అమ్మా...అమ్మా...వీళ్ళు వచ్చారంటే మన  అక్కయ్య పెళ్ళి అవుతుంది కాదమ్మా?..." అన్నాడు అపండు సంబరంగా.


    "సిగతరగ.. ఆయ్యోలాగే ఉంది. పెళ్ళి పెటాకులూ..." విసుక్కుంటూ అన్నాడు పరమేశ్వర్రావు.


    పరమేశ్వరరావు అలా విసుక్కోనేసరికి పండుగాడికి ఏడుపు ముంచు కొచ్చింది.


    "వా..."అంటూ వాడు రాగం అందుకున్నాడు.


    "చిన్నపిల్లలు ఏడిస్తే నేను చూళ్ళేను... ఆత్మహత్య చేస్కోవాలని అనిపిస్తుంది" అంది పార్వతమ్మ పండు వంక జాలిగా చూస్తూ.


    చాముండేశ్వారి పండుని ఎత్తుకుని ఊర్కోబెట్టింది.


    "చామూ... నువ్వు కాస్త కాఫీ, టిఫిన్ ఏర్పాట్లు చూడు" అన్నాడు రంగనాయకులు భార్యవంక చూస్తూ.


    "నువ్వు ఆగు చెల్లమ్మా!... కాఫీ టిఫిన్లకిప్పుడు కంగారేం లేదు" అన్నాడు పరమేశ్వరరావు కరుకుగా.


    చాముండేశ్వరి త్ల్లెమొహం వేస్కుని భర్తవంక  చూసింది.


    "ముందు నాకి విషయం గురించి తేల్చి చెప్పండి... మీరు మా సంబంధము  మానుకున్నారట!... కారణం ఏమిటి?" డ్తెరెక్టుగా  పాయింట్లోకి వస్తూ అన్నాడు పరమేశ్వర్రావు


    రంగనాయకులు సమాధానం చెప్పకుండా తల వంచుకున్నాడు.


    "మీ అమ్మాయికి మా అబ్బాయి తగడని అనుకున్నారా?"


      "దిక్కుమాలిన సంత...నేనలా అనుకోలేదు బావగారూ!" బాధగా అన్నాడు రంగనాయకులు..


    "సిగతరగ...మరి వాడితో అలా ఎందుకు ప్రవర్తించారు?" రెట్టించి అడిగాడు పరమేశ్వర్రావు.


    "మావాడు గుండెదిటవు చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. వేరే ఎవరయినా అయితే ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. తెల్సా అన్నయ్య గారూ?" అంది పార్వాతమ్మ.


    "చెప్పండి. ఏమిటి  మీ ఉద్దేశ్యం?" మళ్ళి రంగానాయకుల్ని అదే ప్రశ్న అడిగాడు.


    రంగనాయకులు ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పడం  మొదలు పెట్టాడు. అతను చెప్తున్నంత సేపూ పరమేశ్వర్రావు మొహంలో రంగులు మారసాగాయి.


    కూతురికి ఏ కారణాలేయితే చెప్పాడో పరమేశ్వర్రావుకి  అవే కారణాలు చెప్పాడు రంగనాయకులు.


    అది వింటూనే పరమేశ్వర్రావు మండిపడ్డాడు. " ఆవిషయాలన్నీమీరుతాంబూలాలు పుచ్చుకొకముండు ఆలోచించాల్సింది. తాంబూలాలు పుచ్చుకుని సంబంధం  కుదుర్చుకున్నాక తెల్సింది " నీళ్ళు నముల్తూ అన్నాడు రంగనాయకులు.


    "తెలిస్తే తెలిసింది... మా అమ్మాయికి వేరే సంబంధం కుదిరిపోయిందని చెప్పాల్సింది. ఏం మేమంటే అంత చులకనగా ఉందా?" అంటూ డాం డూంఅంటూ ఎగరసాగాడు పరమేశ్వర్రావు.


    అతనలా ఎదుర్తుంటే అందరూ నోళ్లు తెరుచుకుని చూస్తూ వుండిపోయారు.


    అదే సమయంలో గుమ్మంలో చిన్నమ్మాయి, చిట్టబ్బాయి, కన్నారావు ప్రత్యక్షమయ్యారు.


    చిత్తబ్బాయిని చిన్నమయితో చూడగానే పరమేశ్వర్రావు మండిపడ్డాడు.


    "ఏంట్రా ఇది? ఆ అమ్మాయిని వేంటేస్కుని తిరుగుతున్నావ్.... నువ్వు వద్దనుకున్న వళ్ళతో తిరగడానికి నీకు సిగ్గులేదా?"


    "వాడు అమ్మయకుడండి... వాడ్నాలా తిట్టకండి నాకు ఆత్మహత్య


     చేస్కోవాలనిపిస్తుంది... ఆ అమ్మాయే విడి వెంటబడి ఉంటుంది" అంది పార్వతమ్మ చిన్నమ్మాయిని  గుచ్చి గుచ్చి చూస్తూ.


    "ఒకళ్ళ వెంటపడే  ఖర్మ మా  అమ్మాయికేం వచ్చింది... మీ అబ్బాయే వెనకపడుంటాడూ" దీర్ఘాలు తీసింది చాముండేశ్వారి.


    "సిగతరగ అసలు ఎవరు ఎవరి వెనక పడ్డారన్నాది కాదు క్వశ్చను. ఈ సంబంధం వద్దకున్నవారు మీ అమ్మాయి మా అబ్బాయితో తిరగడానికి ఎందుకు పంపిస్తున్నారు?" అన్నాడు పరమేశ్వర్రావు గట్టిగా అరుస్తూ.


    "నేనేం  పంపడం లేదు" అన్నాడు పరమేశ్వర్రావు గట్టిగా అరుస్తూ.


    "నేనేం పంపడం లేదు... అది బయటికి వెళ్ళినట్టే నాకు తెలిదు" అంది చాముండేశ్వరి కూడా.



    "అబ్బాయ్ గారు... మిరిట్టా మా అమ్మయిగోర్ని తిప్పడం బాలేదండి. రాంగ్ బాబూ ... రాంగ్" అన్నాడు అన్నాడు భీమయ్య.
    "తప్పంతా మన అబ్బాయ్ మీద తోసేస్తుంటే చూస్తూ ఊర్కుంటారేంటండి... మన అబ్బాయి తప్ప చేస్తే మన పెంపకం సరిగా లేనట్టేకదా? ఇలా మాటలు అనిపించుకునేకంటే ఆత్మహత్య చేస్కోవడం మేలండి"


    "రంగండి అమ్మగారూ... ఆత్మహత్య  చేస్కోడం చాలా రంగండి" అన్నాడు భీమయ్య మధ్యలో కల్పించుకుంటూ.
    "ఇంత బతుకూ బతికి నేను  చివరికి ఒక పనివాడి చేత ఏది మంచో ఏది చెడో చెప్పించుకోవాల్సిన నాకు శరణ్యం" బాధగా అంది పార్వతమ్మ.


    "నువ్వు కాస్త నోరు మూస్తావా?" భార్య మీద విసుక్కున్నాడు పరమేశ్వర్రావు.


    ఈ గోలకి  కంగారుపుట్టిన పండు 'బేర్ ర్ ' మన్నాడు.


    "మీరంతా కాస్త నిశ్శబ్దంగా ఉంటారా? ప్లీజ్!" అంది చిన్నమ్మాయి కాస్త గట్టిగా.


    అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. పండుగాడు మాత్రం 'బేర్' అంటూనే అన్నాడు.


    "అట్టా ఏడవకూడదు బాబూ. రాంగ్ బాబూ.. రాంగ్. నో క్త్రే... నీకు చేగోడీలు కొని పెద్తాగా?" పండు ని బుజ్జగిస్తూ అన్నాడు భిమయ్యా.
     పండు  వెంటనే నోర్ముస్కుని కళ్ళు తుచుకుని ఆనక కిలకిలా నవ్వి  "పడమరి! మనం వెళ్ళి  చేగోడీలు కొనుక్కుందాం" చేతులూ కళ్ళూ కొట్టుకుంటూ అన్నాడు పండు.


    "అలాగే.. అలాగే"


    భీమయ్య పండుని తీస్కుని బయటికి వెళ్ళిపోయాడు.


    "నాన్నా! అమ్మా... మీరిక ఇంటికి వెళ్ళండి" అన్నాడు చిట్టబ్బాయి తల్లిదండ్రులవంక  చూస్తూ.


    "ఉండరా .. వీళ్ళతో నేను విషయం తేల్చుకొనివ్వందే" అన్నాడు పరమేశ్వర్రావు.


    "విషయం నేను తేల్చుకుని వస్తాగా.. ఈ పెళ్ళి జరుగుతుంది నాన్నా" అపనమ్మకంగా చూశాడు పరమేశ్వర్రావు.


    "అవునండి మామయ్యగారు.. మీ అబ్బాయి చెప్తున్నది నిజం" చిన్నమ్మాయి పరమేశ్వర్రావుతో అంది.


    "మీరు వెళ్ళిరండి అంకుల్... వాళ్ళు చెప్తున్నాది నిజమే" అన్నాడు కన్నార్వు కూడా.


    పరమేశ్వర్రావు పార్వతమ్మకి కనుస్తెగా చేశాడు. పార్వతమ్మ సోఫాలోంచి లేచింది. పరమేశ్వర్ర్రావు కూడా లేచి నిల్చున్నాడు.


    "ఉండండి కాస్త కాఫీ తాగివెళ్దురుగాని" అంది చాముండేశ్వరి.


    "ఇప్పుడు ఫార్మాలిటిస్ ఏమి పెట్టుకోకండి అత్తయ్య్యగారు... మాకు అత్యవసరంగా మాట్లాడుకునే  పని వుంది... వాళ్ళని వెళ్ళనివ్వండి" అన్నాడు చిట్టబ్బాయి.


    పరమేశ్వర్రావు, పార్వతమ్మ ఇంటికి వెళ్ళిపోయారు.


    "ఎంటాంత ముఖ్యమ్తెన విషయం?" కూతురు వంక ప్రశ్నార్ధకంగా చూస్తూ అడిగింది చాముండేశ్వరి.


    "నువ్వు లోపలికి వెళ్ళమ్మా...నీకు తర్వాత చెప్తాంలె"


    చాముండేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది.


    "ఏమిటంత ముఖ్య విషయం?" ఈసారి రంగనాయకులు అడిగాడు.


    "మీరు మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయాలనీ అనుకున్నాక మళ్ళి ఆ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS