Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 62



    రాబర్టుమోటార్ ప్తెకిల్ని పోర్టికో దగ్గర స్టాండ్ వేసి  గబగబ మేట్లేక్కాడు.

    తలుపుమీద చెయ్యివేశాడు రాబర్టు. అవి ఎవరో తీసినట్లుగా తెరుచు కున్నాయి.

    ఎదురుగా  రివాల్వంగ్ చ్తేర్లో కూర్చుని విస్కీ తాగుతున్న శశిభూషణ్  రాబర్టు ని  చూసి నవ్వేడు.

    రాబర్టు అడుగులు ముందుకేస్తున్నాడు. శశిభూషణ్ చేతిలోని గ్లాసుని టీపాయ్ ప్తెన పెట్టి తాపీగా అన్నాడు.

    "శభాష్ విజయ్, నువ్విలా వస్తావని నాకు  ముందే తెలుసు."

    రాబర్టు సింహకిశోరంలా అతనిప్తెకి ఉరకబోయేంతలో ఎవరో  రాబర్టునీ పట్టిలాగినట్టయింది.

    అతను తేరుకుని చూసేలోగా అతని చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు నలుగురు ఆగంతకులు.

    శశిభూషణ్ ఆ హాలు దద్దరిల్లిపోయేట్టుగా  పగలబడి నవ్వేశాడు.

    బయట వాన కురుస్తోంది.

                     *    *    *    *

    సాయంత్రం  ఆరుగంటలు బయట ప్రకృతి చేస్తున్న ప్రళయ తాండవాన్ని కిటికీలోంచి చూస్తూ నించుంది మోహీని.

    ఆమె మనసు  మనసులోలేదు. రాబర్టు మధ్యాహ్నమనగా బయటకి వెళ్ళాడు. ఇంతవరకూ రాలేదు.

    అతనే మయిపోయాడో అన్న దిగులు ఆమెని పూర్తిగా బాధిస్తోంది.

    శశిభూషణ్ జిత్తులమారి నక్కని మోహినీకి తెలుసు.

    కాశ్మీర మరణానికి రాబర్టు  కారణమని అతను నిరూపించడానికి ప్రయత్నస్తున్నాడంటే ఆమెకి కారణం అనూహ్యంగా వుంది.

    శశిభూషణ్  కాశ్మీరని చంపలేదన్నా గ్యారంటి ఏమీలేదు. అతనందుకు సమర్దుడేనని మోహినీకి తెలుసు. ఆ విషయంలో రాబర్టు అనుమానం నిజమ్తెనదే అన్న నమ్మకం ఆమెకీ లేకపోలేదు.

    మోహినీ ఆలోచనలు మరోవిధంగా  సాగినయి.

    శశిభూషణ్  కాశ్మీరనీ  చంపివుంటే ఆమె మరణాన్ని ప్రమాదపూర్వకంగా  జగిరిందని చెప్పాలి.  పొలిసు దర్యాప్తుని అక్కడితో  ఆగిపోయేలా చేయాల్సింది. కానీ ఆ నేరాన్ని  రాబర్టు ప్తెన  తోస్తున్నాడంటే కాశ్మీరగానీ  ఏక్సిడెంటల్ గా చనిపోయిందా? అలా అనుకోడానికి  ఆస్కారం కనబడలేదు ఇంట్లో వంటమనిషి వుండగా కాశ్మీర వంటగదిలోకి పోయి స్టౌవ్  వెలిగించాల్సిన అవసరం లేదు.

    'స్టవ్'

    'స్టవ్'

    అసలు శశిభూషణ్ ఇంటోవున్నది  కిరసనాయిల్ స్టవ్ లేక గాస్  స్టవ్వా? గాస్ స్టవ్ వుంటే  కాశ్మీర కిరసనాయిలుపోసుకొని చావడం ఎలా జరిగింది?

    అయితే  ఆత్మహత్య !

    మోహీనీ ఆలోచనలు తెగడంలేదు

    ఇందులో మిష్టరీ  ఖచ్చింతంగా వుంది.

    ఇది ఆత్మహత్య కాదు.

    ప్రమాదం కాదు.

    మరి?


                            హత్య...
                      అవును హత్యే!



    అయితే ఎవరి పనిది!

    హంతకుడెవరు?

    రాబర్టు కాదు ఆ సంగతి  ఖచ్చింతగా తెలుస్తూనేవుంది తనకి.

    అయితే శశిభూషణే చంపి వుండాలి. ఆమెని చంపడంలో  అతని ఉద్దేశమేమిటి?

    "రాబర్ట్ నువ్వెంత దురదృష్టజాతకుడివి" ఆమె మనసు విల విల్లాడింది.

    వానజోరు ఎక్కువ్తేంది. గాలికూడా  తగ్గట్టుగానే  వుంది. చెట్లు గజగజలాడుతున్నాయి.

    తోటలో వాననీరు వరదలా  పారుతోంది. మోహినీ  కళ్ళలో నీరు సుడులు  తిరిగింది.

    గేటులోంచి లోపలికి దూసుకొస్తున్న పొలీసు జీపుని చూసి ఉలిక్కి పడింది మోహిని.

    "మాలీ!" అని కేకపెట్టింది మోహిని  మరుక్షణంలో 'మాలి' అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

    "మాలి, పొలిసులోస్తున్నారు జాగ్రాత్త!" అంది.

    "అలాగేనమ్మా" అన్నాడు మాలి.

    మోహినీ  ఏవిధమ్తెన  కంగారుని కనబడనియకుండా మేడమెట్లు దిగి కిందికి వచ్చింది.

    సాంబశివం సోఫాలో కూర్చుని తీరుబడిగా తాగుతున్నాడు.

    పోలిస్ ఇన్స్ ప్పెక్టర్, నలుగురు కానీస్టేబుల్స్ గబగబ లోపలికి వచ్చారు.

    సాంబశివం వాళ్ళకేసి చూసి.

    "వాట్ ఇన్స్ పెక్టర్ ఇలాంటి సమయంలో వచ్చారు. ఎనివర్క్  విత్ మీ" అన్నాడు నవ్వుతూ.

    ఇన్స్ స్పెక్టర్  నవ్వలేదు.

    సాంబశివానికి దగ్గరగా వచ్చి నించున్నాడు. మోహిని అదేమీ తనకు పట్టనట్టుగా పేపరు చూస్తోంది.

    సాంబశివం ఇన్స్ స్పెక్టర్  నేమ్ బాడ్డి కేసి చూసి "మిస్టర్ ప్రసాద్ బిసిటేడ్" అన్నాడు  ఇన్ స్పెక్టర్ నవ్వుతూ కూర్చున్నాడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS