Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 61

   తను మోహీనీ ఇంట్లో వున్న సంగతిగానీ  వాడికి తెలుసా?


    తన ఆ చూకి పోలీసులకి తేలిస్తే మోహినీ చిక్కుల్లో పడుతుంది.

    చట్టప్రకారంగా తనకి ఆశ్రయం ఇవ్వటం తప్పు మొహినీది.

    "మోహినీ నా వల్ల నీకు ప్రమాదం రావడం నేను భరించలేను. దయచేసి నన్ను వెళ్ళిపోనీ" అన్నాడు .

    "ఎక్కడకేళతావు?" అదోలా అడిగింది మోహిని.

    "ఏమో!" అన్నాడు దిగులుగా రాబర్టు. మోహినీకి అతన్ని చూస్తే జాలేసింది.

    "రాబర్ట్ ఈ బంగళాలో నువ్వుండగా నీప్తెన ఈగకూడావాలదు."

    "నువ్వు  సుఖంగా ఉండాలంటే.... తప్పదు మోహినీ"

    "ఏమిటి కోరికష్టాలను ఆహ్వానించడమా?" అంది మోహినీ.

    రాబర్టు మాట్లాడలేదు.

    "రాబర్టు ఒక్కమాట చెప్పు నీకు పుట్టబోయే బిడ్డని చూసుకోవాలని నీకు లేదా?" అడిగింది.

    "మోహినీ!" బాధగా అన్నాడు రాబర్ట్. మోహినీ కన్నీరు అతని గుండెని  నిలువునా చిలుస్తోంది.

    అప్పడతను "మోహినీ. ఈ నష్టజాతకుడినీడ స్తెతం అ బిడ్డ ప్తెన  పడకూడదు వాడిని గుండెల్లో పెట్టుకుని పెంచగల తల్లివి నువ్వు. సాంబశివం లాంటి ఉత్తముడు వుండగా నాకా భయంలేదు."

    "అలాని చెప్పి నీ ప్రాణాలప్తెకి తెచ్చుకొంటావా రాబర్టు"

    "కళ్ళముందు జరిగే ఘేరాలనీ, నేరాలనీ చూసి సహిస్తూ అమాయకుల్లా ఆ ఘేరాలకీ, నేరాలకీ బల్తేపోతుంటే చూసి సహించమంటావా?"

    "అందుకు చట్టం వుంది రాబర్టు" అంది మోహినీ.

    "చట్టం గురించి నాకు చెప్పకు మోహినీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు ఋజువులు చట్టానికి ఒక వేళ యదార్ధం తెలిసినా,  సాక్ష్యాలకీ  బుజువులకీ  అనుగుణంగానే తీర్పు చెప్పవలసిన స్ధితిలో  ఉంది. సంఘ నిద్రోహులు చట్టం చేతిలోంచి తప్పించుకొనిపోయి విచ్సల విడిగా దమనకాండని సాగిస్తూనే వున్నారు."

    "అందుకని నువ్వు చెయ్యాలనుకునేదేమిటి? వాళ్ళని చంపాలను  కోడమేగా? అంటే నువ్వు నేరం చెయ్యడానికి సిద్దపడుతున్నావుగా?"

    "నేను చేయబోయేది నేరం అని అందరూ భావించవచ్చు మోహినీ కేవలం చట్టం కళ్ళు కప్పి చేసిన నేరాల్ని పూడ్చి పెట్టి గుండెలప్తెన చెయ్యివేసుకొని తిరిగేదుష్ట శక్తుల్ని వేలాడదల్చుకున్నాను. కారణం వాళ్ళ నేరాల్ని నేను రుజువు చెయ్యలేకపోవచ్చు. కానీనిజం నాకు  తెలుసు ఆ నిజాన్ని వాళ్ళోప్పకొక పోవచ్చు అందుకే  ప్రతి కార వాంచలో ఈ రాబర్టు  మనస్సు  రగిలిపోతున్నది." అతని కళ్ళు ఎర్రగా వున్నాయి.

    మాటలు వాడిగా వున్నాయి. స్ధిరంగా వున్నాయి. నిశ్చయం గోచరిస్తోంది.

    మూడో కన్ను తెరవడానికి సిద్దంగావున్న శివుడిలా వున్నాడు రాబర్ట్.

    మోహినీ సోఫాలో కూలబడి బావుమంది. అర్ధరాత్రి__ఎటూకానీ ఆ సమయంలో  ఆ ఇద్దరిగుండెల్లో రగిలే రెండురకాల సంఘర్ధనకి పరస్పరంగా ఒదార్చుకునే స్ధితిని కూడా  వాళ్ళు కోల్పోయారు.

    కొన్ని నిముషాల తర్వాత రాబర్టు మోహినీ దగ్గరగా  నడిచాడు.

    ఆమె విలపిస్తుంటే అతనిగుండేల్లో చెయ్యి పెట్టి కెలికినట్టుయింది.

    మోహిని భుజాల్ని పట్టుకుని మెల్లగా లేవదీసి  గుండెల్లోకి  చేర్చుకుని___

    "ప్లీజ్ ఏడవకు నువ్వేడిస్తే నా గుండె బలహీనమావుతోంది నాకు  ద్తేర్యాన్ని నూరిపోయావలసిన నువ్వే ఇలా బేలగా అయిపోతే నేనేమ్తె పోవాలి మోహినీ" అన్నాడు ఆమె విపుప్తెన చేత్తోసవరదీస్తూ.
    
    మోహినీ ఇంకా ఏడుస్తూనే వుంది. పక్కగదిలో సాంబశివం గాఢ నిద్రలో వున్నాడు. మాలి వరండాలో నిద్రపోతున్నాడు.

    బయట ఎక్కడో కుక్క ఏడుస్తోంది. రాబర్టు మోహినీని ఎత్తుకుని మెల్లగా మేడమెట్లు ఎక్కాడు.

    ఆమెని మంచంప్తెన  పడుకోపెట్టి  ఆమె పక్కనే పడుకున్నాడు రాబర్టు.

    అతను గానిలేచి ఎక్కడిక్తేనా  వెళ్ళిపోతాడా అన్న భయంతో కాబోలు గట్టిగా అతన్ని పట్టుకొని పడుకొంది మోహిని.

    గడియారం రెండుగంటలు కొట్టింది.

                                                        *    *    *

    __ఆకాశం నల్లచీర కట్టుకోంది బోరుమని ఎడవడానికి సిద్దంగా వున్న శోకదేవతలా వుంది నీలాంబరి.

    నీలాంబరి  శోకాన్ని చూసి ఉప్పొంగిపోతున్న దుర్మార్గుడిలా  గాలిదేవుడు చిందులు ప్రారంభించాడు.

    రోడ్డుమీద దుమ్ము చక్రాల్లా లేస్తోంది. చెట్లు ఊగిసలాడుతున్నాయి. గాలిదేవుడు ప్రతాపానికి తట్టుకోలేక మబ్బుతునకలు  ఆకాశంలో చెల్లా చెదరవుతున్నాయి.

    సాయంత్రం ఆరుగంటలకే  చీకటి పూర్తిగా అలుముకోంది.

    పెళపెళమని ఎక్కడో  దూరంగా వురిమింది. దానివెనకే కళ్ళు మీరుమిట్లు గొలిపే విధంగా ఓ మెరుపు  మెరిసింది.

    అలాంటి  సమయంలో రాబర్టు తుపాకీ  గూండులా మోటార్  స్తేకిల్  ప్తెన ఓ  గేటులోకి దూసుకుపోయాడు.

    అది శశిభూషణ్ ఇల్లు.

    అతనే  విధమ్తెన దారుణాని కోడిగడుతున్నాడో అన్న భయంతో  ఆకాశం భయంగా ఉరిమింది.

    ఆకాశం ఏడవటం మొదలెట్టింది. చిన్న చిన్న చినుకులతో ప్రారంభమ్తె వానగా మారింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS