"చెప్పండి కంపెనీ లేక బోరుగా వుంది. సమయానికి వచ్చారు. అంటూ మరో గ్లాసులో విస్కీపోసి అందివ్వబోయాడు.
"నో ధాంక్స్" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ .
సాంబశివం లాంటి వ్యక్తులకి నగరంలో వుండే పరపతి ఎలాంటిదో ఆ ఇన్స్ స్పెక్టర్ కి తెలీని విషయంకాదు.
నిజానికి సాంబశివానికి ఆ ఇన్స్ స్పెక్టర్ ఎందుకు వచ్చింది తెలుసు సిగరెట్ వెలిగించి టీపాయ్ ప్తెన పెడుతూ.
"దెన్ అసలు విషయం చెప్పండి" అన్నాడు.
"హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న 'విజయ్' అనే వ్యక్తి మీ ఇంట్లో వున్నట్టుగా ఇన్ ఫ' మేషన్ వచ్చింది! అందుకని వచ్చాను" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ .
సాంబశివం కోపంగా అన్నాడు.
"బ్లడి బుల్ షిట్ అలాంటి వాళ్ళేవరూ ఇక్కడికి రాలేదు. లేరు"
"అతని మారు పేరు రాబర్టు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"ఇన్స్ స్పెక్టర్ అసలు పోలీసులు నా ఇంటికి రావడమే అవమానం పరువునష్టం. పేర్చి వారంట్ వుందా?"
"వుంది"
"దెన్ సెర్చి వెదకండి ఈ ఎస్టేట్ మొత్తం గాలించిచూడండి" అన్నాడు ఆ వేశాంగా సాంబశివం
మోహినీ పేపర్ని పక్కనే పడేసి భార్తకేసి చూసింది ఏమిటన్నట్టుగా.
"చూసేవా మోహినీ మనింట్లో హత్య చేసిన మనిషికి ఆశ్రయం ఇచ్చామని ఇన్ స్పెక్టర్ అనుమానిస్తున్నారు. ఇల్లు వేదుక్కోమంటున్నాను" అన్నాడు.
"బ్తె ఆల్ మీన్స్ " అంది .
కానీస్టేబుల్స్ ఆ మేడంతా చూసివచ్చి
"ఎవరూ లేరు సార్" అన్నారు.
"ఈ ఇంట్లో ఎవరేవారుంటారు" ఇన్స్ స్పెక్టర్ అడిగాడు.
"నేను నా భార్య మోహీని, మాలి" అన్నాడు చిరాగ్గా సాంబశివం.
"మాలి ఎవరు?"
"నేనేనయ్యా!"
వెనక్కి తిరిగి చూశాడు ఇన్స్ పెక్టర్ ఆ మాటలకి మాలి వినయంగా నించొని వున్నాడు.
ఇన్స్ పెక్టర్ టీపాయ్ ప్తెనవున్న సిగరెట్ పెట్లే కేసి చూశాడు.
ఒకటి త్రిబుల్ ఫైవ్ ,మరోటి గోల్డ్ ప్లాక్ పాకెట్ వున్నాయి.
సాంబశివం కేసిచూసి నవ్వూతూ అడిగాడు ఇన్స్ పెక్టర్
"మీరే బ్రాండ్ సిగరెట్లు కాలుస్తారు?"
సాంబశివం టీపాయ్ కేసి చూశాడు. "నాకో బ్రాండు అంటూలేదు చార్మినార్ కూడా కాలుస్తాను!" ఆన్నాడు.
"ఐసీ!"
"ఐసీకాదు ఇన్స్ స్పెక్టర్ ఉదాహరణకి చూడండి ఆ ఖాళి సీసాలు విస్కీ బ్రాంది రామ్ బిరు, ఎద్తేనా సరే మూడ్ నీ బట్టి లాగించేస్తుంటాను!" అన్నాడు సాంబశివం.
ఇన్స్ స్పెక్టర్ వెళ్ళబోతూ మాలికేసి చూశాడు.
"ఓసారి నువ్వు బయటకిరా!" అన్నాడు. మాలి అతని వెనకే నడిచాడు.
పోర్టికో దగ్గర నిలబడి మాలిని పరీక్షగా చూశాడు ఇన్స్ స్పెక్టర్
మాలిలో అతనికే విధమయిన మార్పు కనబడలేదు.
"నీ పేరు!"
"చెప్పాను గదు బాబు!" అన్నాడు మాలి.
"మళ్ళి చెప్పుకూడదా?"
"మాలి!"
"నువ్వేం చేస్తుంటావిక్కడ?"
"వంటపని, ఇంటిపని, తోటపని....!"
"ఈ ఇంటికి కొత్తగా ఎవరన్నా వచ్చారా?"
"ఎప్పుడు బాబూ" అమాయకంగా అడిగాడు మాలి.
"ఈ నెల మధ్యలో!"
"లేదు బాబూ!"
"ఈ ఇంట్లో వుండే దేవరెవరు ?"
"అయ్యగారు , అమ్మాగారు నేను, కుక్కలు " అన్నాడు.
అతని మాటలకి ఇన్స్ స్పెక్టర్ కి నవ్వొచ్చింది.
ఇన్స్ స్పెక్టర్ జీపుకేసి నడవబోతుంటే.
"వానగా వుంది బాబూ, తడిస్తే జలుబు చేస్తుంది పోనీ కాస్త టీ తాగి వెళాతారా?" వినయంగా అడిగాడు మాలి.
"వద్దులే" అంటూ జీపులో ఎక్కి ఇన్స్ స్పెక్టర్ కానీ స్టేబుల్స్ వెళ్ళిపోయారు.


