"ఈ కార్ట్సంటె నాకు చాలా ఇష్టం" అంది.
"దేనికి?"
"ఇవి నా దగ్గరకొచ్చిన రోజునే నీతో పరిచయం కలిగింది."
"నువ్వింత సెంటిమెంటల్ అనుకోలేదు."
"మెంటల్ అనుకోకుండా వుంటే అంతే చాలు" అంది అదోలా.
రాబర్టు ఆలోచనలు వేరుగా వున్నాయి. మోహిని నిద్రపోతే బయటకెళ్ళాలని అతని ప్రయత్నం.
పదయింది.
"పడుకోందాం నిద్ర వస్తోంది" అన్నాడు కార్ద్సు ని అవతల పడేస్తూ రాబర్టు.
"నువ్వు నిద్రపోతావని నమ్మమంటావా రాబర్ట్ " అడిగింది మోహిని.
మోహినీకి తెలుసు రాబర్ట్ బుర్ర ఏ విధంగా ఆలోచిస్తున్నదీమ.
మోహిని ఏమాత్రం అవకాశం యిచ్చినా అతను శశిభూషణ్ ని హత మార్చాడానికి వెళ్ళిపోతాడు. ఆ సంగతీ ఆమెకి తెలుసు. రాబర్టు చిక్కుల్లో పడ్డం ఆమె కిష్టంలేదు
"నేనుపడుకుంటాను" అన్నాడు.
మోహినీ కూడా అతని పక్కనే పడుకొంది.
గోడ గడియారం పన్నెండు కొట్టింది. ఆ రాత్రి శశిభూషణ్ న్నీ అంతం చేసెయ్యాలని రాబర్ట్ ఉద్దేశ్యం అతనికి మోహినిపైన కోపంగా కూడా వుంది. కా నీ ఆమె మాటలకి ఎదురు చెప్పలేని అసహయతకి తనని తానే తిట్టుకున్నాడు రాబర్ట్.
వెంటనే ఏదో చేసేయ్యాలన్న దుగ్ధ అతన్ని మరీ పిడస్తోంది.
కాశ్మీరని చంపిన నేరానికి ఆ నేరాన్ని తప్పించుకోడానికి గానూ కాశ్మీర మరణాన్ని ఓ ప్రమాదంగా చిత్రీకరించిన ఆ రాక్షసుడ్ని ఖండ ఖండాలుగా నరకాలనుంది రాబర్టుకి.
రాబర్ట్ మంచంప్తెన లేచి కూర్చున్నాడు.
మోహినీ మొహంలోకి చూశాడు. నిద్రలో వుంది.
అది నిద్రా?
నటనా?
ఏదన్నా కావచ్చు. కానీ తననిక ఆపడం ఎవరివల్లా కాదు తన శరీరంలో రక్తం మరిగిపోతోంది.
ఆమె చేతిని కదిపిచూశాడు రాబర్టు మోహీనీ కదల్లేదు.
ఘ్యర్ ఆమె నిద్రలోకి జారిపోయింది. ఆ నమ్మకం కలగాగానే అతను మెల్లగాలేచి కిటికీ దగ్గరగా నడిచాడు.
బయట వెన్నెల పుదృపువ్వులా వుంది. దూరంగా నగరంలోని దీపాలు కనిపిస్తున్నాయి. చెట్లు గాలికి మెల్లగా కదులాతూ ఆకులు దీపాలు కనిపిస్తున్నాయి. చెట్లు గాలికి మెల్లగా కదులుతూ ఆకులు చప్పుడు చేస్తున్నాయి. అంతకిమించి బయట ఏ విధమ్తెన అలికిడీలేదు.
అతను అడుగులో అడుగువేస్తూ టెలిఫోన్ వున్న స్ధానానికి చేరాడు.
మెల్లగా ఓ నెంబరు డయిల్ చేశాడు రాబర్టు.
అవతలవ్తేపు ఫోన్ రింగవుతోంది. కొన్ని క్షణాలు....నిముషాలుదోర్లిపోయినయి.
ఫోన్ ఎవరూ ఎత్తలేదు.
రాబర్టు రిసీవరు పెట్టలేదు. అలాగే పట్టుకుని నిలబడ్డాడు సిగరెట్ వెలిగించి.
అవతల రిసీవరు ఎత్తిన చప్పుడు.
విసుగ్గా "ఎవరు?" అడిగాడు అవతలనుంచి.
రాబర్టు ఆ గొంతుని చాలా ఈజీగా గుర్తుపేట్టాడు.
అది శశిభూషణ్ గొంతు.
"నేనే!" అన్నాడు రాబర్టు.
"అంటే పేరు?" విసుగ్గా చాలా విసుగ్గ కోపంగా అడిగాడు శశిభూషణ్.
"మృత్యువు " అన్నాడు రాబర్టు
"రా...బ...ర్టు...నువ్వా? నువ్వింకా బతికేవున్నావా?"
"నేనప్పడే చావను మిష్టర్ శశిభూషణ్. నాకు బలి కావాలి. నీ రక్తం తాగాలి. ఆ తరువాతే ఏదన్నా ఈ రాబర్టుకి జరిగేది!"
"నాకు తెలుసు రాబర్టు మంచితనంతో మా ఇంట్లో ప్రవేశించి మమ్మల్ని నాశనం చేయాలనుకొన్నావు. నా భార్య కాశ్మీరని చంపింది నువ్వే!"అన్నాడు శశిభాషణ్.
"డర్టిరోగ్. కాశ్మీరని నేను చంపానా?"
"అవును నువ్వే కిరసనాయిలు పోసి నిప్పంటించి చంపేశావు."
"షటప్" అరిచాడు రాబర్టు.
"పిచ్చికుక్కలా అరవకు. ఈ నేరం చేసింది నువ్వేనని మా మామగారు అంటున్నారు. పాతకక్షతో కాశ్మీరని చంపినా హంతకుడివి నిన్ను ఉరికంబం ఎక్కించి తీరాతాను" అన్నాడు శశిభూషణ్.
"ఉరికంబం ఎక్కించాలనుకొనేవాడివి నన్నెందుకు చంపాలను కొన్నావ్ శశిభూషణ్ "అడిగాడు రాబర్టు.
"నేనలాంటి ప్రయత్నం చెయ్యలేదు."
"నువ్వింకా బతికున్నావా అని అడిగినప్పడే అర్ధం అయిందిరా రాస్కెల్ కాశ్మీర ప్రాణం పోయేటప్పడు ఎవరూ దగ్గరలేరు కనక ఆ నేరాన్ని నాప్తెన తోయాలనుకుంటున్నావు నీ రక్తం తాగడానికి వస్తున్నాను రెడీగా వుండు" అని ఫోన్ పెట్టేశాడు రాబర్టు.
రాబర్టు వెనక్కి తిరిగేసరికి ఎదురుగా మోహీనీ కనబడింది.
"నేను అంతా విన్నాను" అంది మోహిని రాబర్టు పళ్ళు పటపట కొరికాడు.
"రాబర్టు ఒకప్పుడు నువ్వేమన్నాడో గుర్తుందా?"
"ఏమిటి?"
"చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నావు. నువ్వు స్వయంగా తెచ్చి పెట్టుకున్నా హెడేకిది."
రాబర్టు వేగంగా ఆలోచిస్తున్నాడు. శశిభూషణ్ కాశ్మీర చావుకి నేరం తనపైన వేస్తున్నాడు.
