రాబర్ట్ తోటలో సిమెంటు బల్లపైన కూర్చున్నాడు. ఆలోచన తాకిడికి తలపోటు ఎక్కువవుతోంది.
మోహిని దూరంగా నడిచిరావడం చూశాడు రాబర్టు.
తెల్లనిని పాలు, నల్లనిని నీళ్ళు అనుకోవడం ఎంత పొరపాటో మోహినిని చూశాక తెలుసుకున్నాడు రాబర్టు.
మోహిని వెనకే కుక్కలు తోక ఆడిస్తూ వస్తున్నాయి.
అందులో సుల్తాన్ కూడా వుంది. అన్ని కుక్కల్లోకి రాబర్టుకి బాగా మచ్చిక అయింది సుల్తాన్ కూడా వుంది. అన్ని కుక్కల్లోకి రాబర్టు కి బాగా మచ్చిక అయింది సుల్తాన్ అది రాబర్టు కాళ్ళపైకి ఎక్కి అప్యాయ గా అతని చేతుల్ని నాకుతోంది.
మోహినీ సిగరెట్ పెట్టెని అతనికి అందించింది.
"ధాంక్స్" అన్నాడు రాబర్ట్ సిగరెట్ వెలిగిస్తూ.
"రాబర్టు"
"ఏమిటి?" అన్నాడు అనాలోచితంగా
"ఎంతకాలంమిలా దొంగలా బతకడం"
"అంటే! చెయ్యని నేరాలకి భయపడిలా స్వేచ్చా స్వాతంత్రలు లేకుండా జీవించడం కష్టంగా లేదూ?"
రాబ్ర్టు మోహిని కళ్ళలోకి సూటిగా చూశాడు.
"నాకు ఆశ్రయమిచ్చినందుకు నువ్వు భయపడుతున్నావా మోహినీ" అన్నాడు రాబర్టు.
రాబర్ట్ మాటలు మోహినికి బాధని కలిగించినయ్.
" నీ విషయంలో నేనెప్పుడూ భయపడను రాబర్టు నిన్ను కాపాడు కొని నా గుండెల్లో దాచుకోవాలనేది నా ఆరాటం. నాకు బంగారం కలలో కొస్తుంది అందుకే నాకు భయం" అంది.
"ఏ బంగారం కలలోకి రాకూడదా ?" అడిగాడు మోహినీ కళ్ళతోనే అవునన్నట్టుగా చూసి.
"బంగారం బలికోరుతుండట రాబర్ట్ వెండి వెళ్ళగోరుతుంది రాగి 'రా' గోరుతుందని అంటారు నాకు బంగారం కలలోకి రావడం__ఆ దోషం కాశ్మీర పైన పోయిందనుకొన్నాను కానీ మళ్ళీ నాకు కళ్ళుమూస్తే అదే కల వస్తోంది దానికి తగ్గట్టుగానే నీ పైన హత్య ప్రయత్నం జరిగింది " అంది.
రాబర్టు మరో సిగరెట్ వెలిగించి పోగని గాలిలోకి వదిలాడు.
రాబర్ట్ కి అలాంటి నమ్మకాలున్నాయి. అతనికా క్షణంలో నల్లపిల్లి ఎదురురావడం-కారు కిందపడి చచ్చిపోవడం గుర్తుకోచ్చినయి
మోహిని కళ్ళలో నీరు గిర్రున తిరిగింది.
"రాబర్టు"
"ఏమిటి?"
"నిన్నోక్క కోరిక కోరనా?"
"ఏమిటో చెప్పు!"
"నా మాటని తోసిపుచ్చననే నమ్మకంతో అడుగుతున్నాను రాబర్టు"
"అడుగు మోహినీ"
"మనం ఈ దేశం వదిలి వెళ్ళిపోదాం !" అంది.
"ఎందుకని?"
"మనం ఇక్కడేవుంటే నువ్వు నాకు దక్కవనే భయం విడిస్తోంది ఐ వాంట్ యూ రాబర్టు ఐ లవ్ యూ రాబర్టు ఐ లవ్ యూ " అంది మోహిని ఆవేశంగా అప్పడామే కళ్ళు నీళ్ళతో నిండినయి.
"నీ భర్త సాత్వికుడు అతడు నన్ను నమ్మి ఆశ్రయమిచ్చాడు. ఈ ఎస్టేటు బాధ్యతనే నాకు ఒప్పగించాడు. అలాంటి ఉత్తముడికి ద్రోహం చేసి మనం వెళ్ళిపోవడం ఎంత దారుణమో కాస్తంత ఆలోచించుకో "అన్నాడతను.
"ఆయన్ని మోసగిస్తున్నానని నువ్వెందు కనుకోంటున్నావ్ రాబర్టు. ఆయనకీ అన్ని విషయాలు చెప్పి మనతో పాటే తీసుకెళ్ళిపోదాం నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నిన్ను ఆర్దిస్తూన్నాను!" అంది మోహినీ.
రాబర్ట్ కళ్ళేర్రబడినయి.
"మోహిని" గంభీరంగా పిలిచడతను. మోహినీ ఆ కంఠ స్వరానికి కంపించిపోయింది.
"నాలో ప్రవహించేది ప్రతికారవాంచతో ప్రతిక్షణం నన్ను దాహిస్తోన్న రక్తం కేవలం నా ప్రాణం క్షణ కోసం దేశాన్ని విడిచి పారిపోయేంత పిరికితనం నాలోలేదు. దయచేసి మరోసారి అలాంటి ప్రస్తావన నా దగ్గర తిసుకురాకు" అన్నాడు.
"అంతే నంటావా?"
"పగబట్టిన తాచు కాటువేయకమానదు మోహిని అది జరగని నాడు రాబర్ట్ ఆత్మహత్య చేసుకుంటాడు.
"నన్నిలాంటి మాటలతో ఆదరగొట్టకు రాబర్ట్. నీకు ద్రోహం తలపెట్టిన ఏ వ్యక్తయినా నాకు శత్రువే పగ సాధించినా నీ పోయిన జీవితం తిరిగిరాదు. అందుకే గతాన్ని మరచిపోయి కొత్తజీవితాన్ని ప్రారంభించు రాబర్టు"
రాబర్టు రెండుచేతులతో కణతల్ని నొక్కుతున్నాడు.
మోహీని ఎంతగా ప్రాధేయపడినా అతని మనసు మారదు అది రాబర్టు కి తెలుసు.
మెల్లగా లేచి నించున్నాడు రాబర్టు మోహిని అతని భుజాల చుట్టూ చేతులు వేసింది అతని కళ్ళలోకి జాలిగా చూసింది.
"నా మాట నువ్వు వినవా రాబర్టు" అని ఆమె అతిదినంగా ప్రార్దిస్తున్నాట్టుగా అనిపించింది.
'నీకేం ఫరవాలేదు నాకేమీకాదు' అన్న ద్తేర్యాన్ని ఆమెకి కలిగించలేక పోయాడు రాబర్టు.
__రాత్రి ఎనిమిదయింది.
డిన్నర్ అయినాక కార్డ్స్ ఆడదామంది మోహిని రాబర్టు కిష్టం లేకపోయినా ఆమెకోసం కూర్చున్నాడు.
అవి ఇంపోర్టెడ్ కార్ద్సు అందమ్తెన నగ్న సుందరీమణుల చిత్రాలున్నాయి ఆ కార్ట్స్ పైన.
