Previous Page Next Page 
శశిరేఖ పేజి 5

కృష్ణు - ఏం పని చేశావు?
శశి - నీ దగ్గరకు రావడం, కృష్ణా, ఈ నిముషమునుంచి నేను నీ దాన్ని.నన్ను నీ వేం చేసినా సరే, ఎక్కడికి రమ్మన్నాసరే.
కృష్ణు - నిజంగా? కాని నాకేం అర్ధమవడం లేదు.ఏం జరిగింది?ఎందుకట్లా వణకుతున్నావు? ఎందుకు భయం? ఈ నగలు, కొత్త బట్టలు, యీ శృంగారమంతా యేమిటి?
శశి - విను. కార్యము రేపటి ముహూర్తనీకి కుదిర్చారు. మా నాన్న నిన్న వచ్చి, "ఏమి అల్లరి లేకుండా కార్యం చేసుకుంటావా లేదా"అని కఠినంగా అడిగినాడు. నేను చేసుకోనన్నాను. దుర్భాషలాడి  నన్నొక చీకటి సామానుగాదిలోవేసి మూసినాడు.అన్నం పెట్టలేదు. ఎవరో నాకు తెలీకుండా గూట్లోనుంచి మీఠాయి  వేశారు. తింటో వుంటే మా నాన్న వచ్చి లాక్కుపోయినాడు.రోజుల్లా ఉపోషం ఈ వాళ పొద్దున్న మళ్ళి అడిగినారు. నేను నా పట్టు వదలక పోయ్యేటప్పటికి, మా నాన్న బెత్తం తీసుకు కొట్టినాడు. అంత ప్రేమ వున్న మా నాన్న కూడా యిట్లా కొట్టినాడు చూడు ఎట్లా తెలిందో వాళ్ళంతా. నేనేమితప్పు చేశానని  కొట్టడం? నాదా వాళ్ళదా తప్పు! పైగా కొట్టడం? ఇంక వాళ్ళకి నామీద ప్రేమ యేమిటి? విసుగుపుట్టి అత్తవారు వచ్చారని ఇట్లా ముస్తాబు చేశారు. ఏమైనా సరే, రేపు బలవంతంగా వాళ్ళు చేతులు కట్టేసి కార్యం చేస్తామన్నారు. ఆయన వంటరిగా వుండే సమయం చూసి ఏమైనా ఆశ వుంటుందేమోనని మాట్లాడినాను కూడాను.
కృష్ణు - ఎవరు?
శశి - ఎవరు?భర్త.
కృష్ణు - ఉహూ. ఏమన్నాడు?
శశి - "నాకు నీ మీద ఇష్టంలేదు. కార్యం ఇష్టంలేదు, నన్ను ఇట్లా బలవంతం చెయ్యడం న్యాయమేనా?అన్నాను.  "నీకు ఇంత నోరు వచ్చిందని, నీ వేషాలు, నీ తిరగడాలు వినే, కార్యంమించి పోకుండా వెంటనే తిసుకేడదామని  వచ్చాను. రేపట్నించి యిట్లా మొగవాళ్ళు యెదటపడి మాట్లాడ్డం యేమిటో చెపుతా " నన్నాడు.
భర్త చూడపోతే యిలాగు.ఇంక ఆశ యేముంది? నిలవ నిడలేదని యిట్లా వచ్చేశాను.రేపు నేను వచ్చేసింది చూసి మా వాళ్ళు నాకోసం  వస్తారు అప్పుడు వెడతాను. తరవాత కార్యం చేస్తామని పట్టుపట్టర్లె. అందాకా ఉందనియ్యవూ నీతో?
కృష్ణు- తెల్లవారి మీ వాళ్ళువచ్చి నువ్వు నా దగ్గర  వుండడంచూసి యేమనుకుంటారు-నేనే చేశాననుకోరా? నా  మీద యెందుకు యిదంతా?
శశి - ఇప్పడిట్లా అంటున్నావూ?అసలు వచ్చెయ్యమని అడగ లేదూ నువ్వు
కృష్ణు - అప్పుడు వేరే  సంగతి. ఇప్పుడు మళ్ళి వెడతానంటున్నావుగా తెల్లారి.
శశి- కృష్ణా మరిచిపోయి వచ్చాను. నేనుచేసింది తప్పని  తోస్తోంది. ఇంటికి వెడుతున్నా.
అని చివాలున లేచి వెళ్ళిపోయెను. కృష్ణు డాలోచనలో  నుండి రెండు నిమిషములు లేవనేలేదు. లేచి వెధకునప్పటికి  శశిరేఖ కనపడలేదు. చుట్టు ప్రక్కల ఆమెకోఱకు  తిరిగి, యూరివ్తేపునకు నడచెను. ఎక్కడను కానరాలేదు. ఎక్కడకు వెళ్ళింనది? ఇంటికి తిరిగి వెళ్ళినదేమో! తాను సహాయము చేయలేదను నిరాశతో నింటికిబోయెను కాబోలు! అయిన ఇంక తనకు కనబడునా? ఇంకెన్నాడు కనబడదా? ఆహ! తన్నుకోరివచ్చిన శశిరేఖను తాను ఇట్లు పోగొట్టుకోనేనా? దౌర్భాగ్యమా? తనే కదా ఆమెను రమ్మని బతిమాలినది? అర్ధరేయి తన్ను నమ్మివచ్చిన దానిని తూలనాడెను గదా! తన వారివలన బాధపడలేక  ఎంత యిష్టము లేకున్నను తన వద్ధకువచ్చిన నా మెనిట్లు తన వారివలన బాధపడలేక ఎంత యిష్టము లేకున్నను తన వద్దకువచ్చిన నామెనిట్లు తన స్వార్ధపరత్వముచే నిరాశకోల్పిపంపెను గదా! ఇట్టి నీచునెన్నడైన శశిరేఖ  కన్నెత్తి చూచునా! ఆమె దెట్టి త్యాగము, తన దెట్టి స్వార్ధము?  ఆమె దెంత విశ్వాసము,తన దెంతసందేహము! తన కృతఘ్నత గాంచి ఆమె యెంతయాసహ్యపడినదో? తన ప్రేమ ఇట్లు తిరస్కరింపబడేనయ్యేనని ఎంత పరితపించినదో? తిరిగి ఆ రాక్షసులవద్దకు- ఆ భర్త దగ్గరకు పోవలసివచ్చుటచే నామె హృదయమెంత  వేదన చెందినదో? ఈ సమయమున నీ నిమిషమున  నెచట నేడ్చుచున్నదో గదా! అని అతడాలోచించెను. ఈ పశ్చాత్తాపముతో నాతనికి పొరలి పొరలి దుఃఖము రాసాగెను. కండ్ల నిరు రాగ తుడుచుకోనుచు వడివడిగ నామె యింటి వద్దకు నడిచెను.తోరణములును  పసుపు కుంకుమలును అతని నేక్కిరించెను. నిశ్శబ్దముగా నుండెను.ఇల్లు వచ్చినదో లేదో! ముందరి ద్వారమును మెల్లగ నేట్టేను. తలుపు తెరచికోనేను. ఆహ! రాలేదుగదా, అతని హృదయమున సంతోషమంకురించెను. రాలేదు. ఆమెను కలిసికోనవచ్చునని తిరిగి  త్వరత్వరగ వచ్చినదారినే నడవసాగెను. కాని ఎచటకు పోవలెను? ఎచటనున్నది? అయ్యో ఏమి  చేయుటకును తోచక బలవంతముగ మరణించెనేమో! ఈ నిమిషముననే మరణించుచుండెనేమో? ఈ తలుపు వచ్చుటతోడనే అతడు పరువెత్తేనుచెట్లక్రిందను  కాలువవడ్డునను  పరువెత్తి పరువెత్తి  వెతకెను. చివరకు అలసి క్రిందపడి బిగ్గరగా "శశి,శశి,శశి" అని యరచెను. వడివడిగ వచ్చు తీక్షణములగు  తలపులచే తలబ్రద్దలగుచున్నట్లుండెను. భయముచేలజ్జచేగుండెలు కొట్టుకోనుచుండెను.ఏమియును తోచదు. నిశ్చేష్టితుడైఆ వేన్నేలయందు ఎంతకాలమతడుండేనో తెలియదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS