Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 58

 

     డాక్టర్ వెంటనే చూసి.

    "రక్తం బాగా పోయింది మోహినీగారు మరో అరగంట ఆగితే ప్రాణం  పోయేది. వెంటనే రక్తం ఇవ్వాలి" అన్నాడు.

    డాక్టర్ మాటలకి ఆమె కళ్ళలో నీరు సుడులు తిరిగింది.

    "డాక్టర్ నా బ్లడ్  పరీక్ష చేయండి. గ్రూపు కలిస్తే నా  రక్తం ఇస్తాను " అంది.

    డాక్టర్ ఆమెకేసి ఓసారి చూసాడు అటు తర్వాత "ఓ  కే" అన్నాడు.

    మోహినీ  రక్తం రాబర్ట్ గ్రూపుకి చెందిందని చూశాక డాక్టర్ తన ప్రయత్నాన్ని  మొదలు పెట్టాడు.

    అతని ప్రాణానికి ఆపాయం లేదన్న  సంగతి  తెలిపేక మోహిని తృప్తిగా ఊపిరి  తీసుకుంది.

    ఆమెలోని ప్రతి అణువూ రగిలిపోతోంది. అతన్ని చంపడానికి ప్రయత్నం ఎవరుచేశారన్నదే  ఆమె సందేహం.

    అతన్నిక ముందు ఎస్టేటులోంచి బయటకి కదలవ్వకూడదని నిర్ణయించుకొంది మోహిననీ.

    తనలోంచి ఒక్కొక్క  రక్తపుబొట్టు అతని శరీరంలోకి ఎక్కుతూంటే తృప్తిగా కళ్ళుమూసుకొంది మోహినీ   తనలో  శక్తి క్షిణిస్తుందన్న బాధగాని తను బలహీనూరాలినై పోతున్నావన్నా దుగ్ధగాని మొహినిలో లేదు.

    ఎప్పుడో తిరిగి కళ్ళు విప్పిన మోహినీకి రాబర్టుకోలుకుంటున్నా తన్న  వార్త ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్ని కలిగించింది.

    మెల్లగా మంచంమించి లేవాలని ప్రయత్నంచింది. కానీ ఒక్క సారిగా లేవలేకపోయింది.

    మాలి ఆసరాతో  మెల్లగా రాబర్టు పడుకొనివున్న కాట్ దగ్గరకి వెళ్ళింది మోహినీ.  అతని తలకి పెద్ద కట్టుకటి వుంది.

    మెల్లగా అతని పక్కలో  కూర్చోని దినంగా పిలిచింది.

    "రాబర్టు" అని.

    కొన్ని క్షణాల తర్వాత రాబర్టు మెల్లగా కళ్ళు విప్పాడు.

    అతని గుండెలప్తెన వాలిపోయి బావురుమన్నది మోహిని.

    "ఎందుకిలా జరిగింది? ఎవరు చేశారీపని?" ఏడుస్తూ అడిగింది.

    రాబర్టు పెదవులప్తెన సజావుగా ఓ నవ్వు తేలిపోయింది.

    "తెలీదు" అన్నాడు.

    "అసలెందుకెళ్ళాపక్కడికి?"

    "కాశ్మీరని ఆఖరిసారి  చూడ్డానికి. ఆమె చితిమంటలో కాలిభస్మమయిపోతూంటే ఆ వేదనతో  ఆశ్రుతర్పణం చేయడానికి వెళ్ళాను మోహిని కానీ ఎవరు ఎందుకు కొట్టారో తెలీదు"

    "తెలీదని  ఎందుకనుకుంటున్నావు. శశిభూషణ్ కాకూడదా?" అంది.

    "ఏమో" ఏదో ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు రాబర్టు.

    మోహినీ  అతని గుండెలప్తెన చేత్తో అప్యాయంగా రాస్తోంది.

    "మోహినీ"

    "ఊ"
   
    "నేనంటే నీకెందుకింత...."

    "నన్ను అడుగుతూన్నావా రాబర్టు ఒక్కసారి నా గుండెప్తెన తల ఆన్చి విను నీకే తెలుస్తుంది ఈ మోహినీ హృదయంలో  నీకున్న స్ధానం ఏమిటో"

    "నేను చచ్చిపోయి వుంటే " అన్నాడు.

    "నా ప్రాణాన్ని  అడ్డంవేసి నిన్ను బతికించుకునేదాన్ని రాబర్టు"

    రాబర్టు ఒక్క క్షణం  కళ్ళుమూసుకున్నాడు.

    "ఇప్పుడు మాత్రం  నువ్వుకాక ఎవరో  బతికించారంటావు. చావు బతుకుల్లో వున్న నన్నిక్కడికి  తీసుకొచ్చి రక్తాదానం  చేసి కాపాడావు కానీ ఈ  రాబర్టు ఎక్కువ రోజులు బతకడన్న సత్యాన్ని మరిచిపోతున్నావు మోహినీ"

    మోహినీ  అతని పెదవుల్ని చేతివేళ్ళతో మూసింది.

    "దయచేసి నువ్విలా మాట్లాడకు మాట్లాడి నా  గుండెని  పగలకొట్టకు" అంది ఏడుస్తూ.

    మూడో రోజు సాయంత్రం మోహినీ  రాబార్టుని  ఇంటికి  తీసుకొచ్చింది. గాయం బలంగా తగలడం చేత అతను నీరసంగా కనిపిస్తూన్నాడు. సరిగ్గా  లేచి  తిరగడానికి  పదిహేను రోజుల్తెనా  పట్టొచ్చునని డాక్టర్ చెప్పాడు.

    రాబర్టు ఇంట్లోనే కూర్చుని  వుండడంతో సాంబశివం తాగడం తగ్గించాడు చాలావరకూ అతను రాబర్టు తో కలిసి కార్డ్స్ ఆడుతూ గడుపుతున్నడిప్పుడు.

    రాబర్టు నివురుగప్పిన  నిప్పులా ఉన్నాడని మోహినికి తెలిదు. ఏ క్షణాన రాజుకుని మండి జ్వాలలతో శత్రువులను చహించివేస్తాడో మోహిని ఆలోచనలకి అందని వచ్చి నిజమిది.

    అర్జున హత్యకి  కారుకుల్తెన  పూర్ణా రమేష్  దాసు అనబడే హంతకులనీ  కాశ్మీరని సజీవదహనం  చేసిన శశిభూషణ్ నీ ప్రాణాలతో వదలడం ఎంత మాత్రం ఇష్టంలేదు రాబర్టుకి.

    ఓ నిండు ప్రాణాన్ని అతి దారుణంగా  తీసేసి  ఘరానాగా  తిరిగే సంఘ విద్రోహులని క్షమించకూడదు.

    అసలు  వేరస్దులు తప్పించుకొంటూనే వుంటారు. నిరపరాధులు శిక్షకి పాత్రులవుతుంటారు.

    ఎంత అన్యాయం ?

    ఈ మధ్యలోనే పేపర్లో ఓ ఘోరమయిన  వార్తని చదివాడు రాబర్టు.

    ముప్పేఏడు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి తన భార్యతో తండ్రికి సంబంధం వుందని అనుమానించి కన్న తండ్రిని హత్య చేశాడు అయితే ఆ హత్యా నేరానికి ఓ ఇద్దరు నిరపరాదులకి  ఉరిశిక్ష పడింది. ఇంతకాలం  తర్వాత ఆ వ్యక్తి ముప్పే  ఏడేళ్ళ క్రితం తండ్రినీ హత్య చేసింది తనేనని  ఒప్పుకోవడం అంతా చకితులాయ్యారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS