"మాలి చెప్పాడు. ఆ ఇద్దరికీ స్నేహం కుదరటంలేదు. అందుకే ఇద్దర్నీ ఒక్కచోట కట్టేయద్దని, ఒకేసారి వదిలిపెట్టద్దనీ చెప్పాను" అంది.
రుస్తుం, సుల్తాన్ లు మనుషులుకారు ఆ పేర్లు వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు కుక్కలని.
కుక్కలంటే సాంబశవానికి ప్రాణం. పసిపిల్లలకంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తాడతను ఆ ఎస్టేటులో పదిహేను కుక్కలన్నాయి వాటిని జగ్రత్తాగా చూసుకునే బాధ్యత మాలిది. ఈ మధ్య కాలంలో నే రాబి రావడంతో మూడు కుక్కల్ని,(జానీ, డాన్ , పీటర్,) బాధనిపించినా ఘాట్ చేసేశారు.
అపురూపంగా పెంచుకునే జంతువుల్ని యజమానులు అవిజబ్బు చేసినప్పడు బతకవని నిర్ధారణ అయినాక వాటిని బాధనించి తప్పించడానికి చంపేస్తారు. దాన్ని "మెర్సీ కిల్లింగ్" అంటారు.
ఈ పద్ధతి రేసు గుణ్ణాల విషయంలో ఎక్కువగా ఆచరిస్తారు. పరిగెత్తే గుర్రానికి పేడ్ లాక్ (కాలిగిట్ట) విరిగిపోతే వెంటనేడి స్టాయ్ చేస్తారు. కొన్ని వేల ఖరీదు చేసే గుర్రాన్నాలా చంపడం టైనర్ కీ, యజమానికి ఎంతో బాధగానే వుంటుంది. కానీ ఆ పద్దతికి వాళ్ళు తలోంచాలి.
తన పెంపుడు కుక్కలని ముద్దుగా పేర్లతో పిలుచుకోవడమేగానీ ఎవరన్నా 'కుక్క' అంటే సాంబశివం చాలా బాధపడతాడు.
మోహీని మొదటిసారి ఆ ఇంటికి రాబర్ట్ నీ తిసుకోచ్చినప్పాడు జరిగిందదే.
'మంచి నిద్రలో వున్నాడు ఫినిష్ హిమ్ ' అన్న మోహినీ మాటల్ని రాబర్ట్ అపార్ధం చేసుకోడానికి కారణం అదే.
ఆ రోజు 'జానీ' కి ఇంజక్షన్ చేశారు. జానీ నిద్రలో వుండగా మాలిని చంపమని మోహినీ చెప్పింది.
అంతకుముందు డాన్, ఇరవ్తే రోజుల క్రితం పీటర్ నీ అలాగే డిస్టాయ్ చేశాడు.
ఈ మధ్యనే 'రుస్తుం'నీ గోవానించి తెప్పించాడు సాంబశివం.
__"వాటికి స్నేహం కలిగేలా చూడు మాలి రుస్తుం చాలా మంచి బ్రిడ్" అన్నాడు సాంబశివం.
"అలాగేనయ్యా" అన్నాడు మాలి.
సాంబశివం గ్లాసులోకి విస్కీ పోసుకోడం చూసి మోహినీ తిరిగి మెడమీది కొచ్చింది.
ఆ రాత్రి నిద్ర పట్టదని మోహినీకి తెలుసు.
మంచంమీద పడుకొని సీలింగ్ ఫాన్ కేసి చూస్తూ పడుకొంది మోహిని.
ఆమె గుండెలనిండా రాబర్ట్ రూపం నిండిపోయింది. మంచం నుంచి లేచి రెండు కంపోజు బిళ్ళల్ని వేసుకొంది. అరగంట గడిచినా ఆ మాత్రలు ఆమె ప్తెన పనిచేయలేక పోయినాయి..
అతనేదన్నా చిక్కుల్లోపడితే కనీసం ఫోన్ చేసి వుండవచ్చు అలా జరగలేదంటే అతనికేదన్నా హాని జరిగివుండాలి.
మోహినీ తట్టుకోలేకపోయింది. లేచి గోడగడియారం కేసి చూసింది. నాలుగాయింది. మరో గంటన్నర గడిస్తే తెల్లవారుతుంది.
కానీ గంటన్నర గడవద్దూ? మోహినీకి పిచ్చిపట్టేలా వుంది.
మోహిని గడియరంకేసి తదేకంగా చూస్తూ కూర్చుంది.
తెల్లవారింది గబగబ కిందకి వచ్చింది. ఆమె భర్త ఇంకా లేవలేదు.
మాలిని కారేక్కించుకుని బుల్లెట్ లా బయటకి దూసుకెళ్ళి పోయింది మోహిని.
ఎక్కడనీ వెదకాలి?
కాశ్మీర ఇంటికి వేళే అవకాశంలేదని అతనికి తెలుసు.
ఆ ఇంటికెళ్ళి శశిభూషణ్ గాడి మొహం చూడ్డం అంటే రోత తనకి.
అరగంట ప్రయాణం చేసిన తర్వాత మెరుపులా తట్టింది మోహినికి.
రాబర్టు స్మశాసనం దగ్గరికి కానీ వెళ్ళేడా? వెళితే ఆ చోటెక్కడ?
ముందుగా బంజారాహిల్స్ వేపు పోనిచ్చింది కారుని.
ఆమె ఊహ తప్పులేదు.
రోడ్డుపక్కన కొంతమంది జనం మూగివున్నారు. మోహినీ కారాపి చివాల్న దూకి దగ్గ కి పరుగు దీసింది.
రాబర్టు రక్తపు మడుగులో పడివున్నాడు.
మోహిని గుండె చల్లగా అయిపోయింది.
రాబర్ట్ చనిపోయాడు.
ఎవరో హత్య చేశారు.
ఆమెని స్పురించిన మొదటి ఆలోచనది. ప్రాణంలేని బొమ్మలా నిలబడిపోయింది మోహిని.
"అమ్మా" పిలిచాడు మాలి.
వాళ్ళని చూసి జనం కాస్త పక్కకి తొలిగారు. మోహిని మెల్లగా వంగి అతని చేతిని పట్టుకొని చూసింది అతని శరీరం కాస్త వేడిగా వుంది. నాడి బలహీనంగా కొట్టుకుంటోంది.
మోహినీ బరువుగా ఊపిరి తీసుకోంది.
రాబర్టు చనిపోలేదు.
ఇంకా ప్రాణం వుంది.
తలప్తెన దేనితోనో బలంగా కొట్టడంతో పడిపోయాడని గ్రహించింది.
"ఏమవుతాడమ్మా నీకు? ఎవరో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి మోహిని ఏ విధమ్తెన సమధానం చెప్పలేదు.
మాలి రాబర్టునీ జాగ్రత్తగా లేవదీసి కార్లో పడుకోబెట్టాడు.
మోహినీ వెంటనే కారుని తనకి తెలిసిన ఓ నర్సింగ్ హొం దగ్గరికి తీసుకెళ్ళింది ఆ డాక్టర్ మోహినికి బాగా తెలుసు తీసుకోవలసిన జాగ్రత్తల గురించీ అతనికి చెప్పి రాబర్టుని అక్కడ జాయిన్ చేసింది.
