Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 55

 

    వెంటనే టపటప మరి నాలుగు చినుగులు పడ్డాయి. వర్షం మొదలయింది.
    అభిషేకన్ లాంటి బిడ్డల్ని కన్నందుకు తెలుగుతల్లి విలపిస్తున్నట్లు ఉంది ఆ వర్షం.
    తెలుగుతల్లి కార్చిన కన్నీటితో నిండినట్లు కనబడుతోంది అక్కడే టాంక్ బండ్ కింద వున్నా హుస్సేన్ సాగర్!
    
                          *    *    *    *
    హటాత్తుగా తమ మధ్యకి ఒక మనిషి దూకగానే ఊలిక్కిపడ్డారు ఉదయార్కర్ బృందం లోని అందరూ.
    ఎవరతను! మనుషులని తినే ఆ గొత్తేజాతి ఆటవికుడా! భయంగా చూశాడు.
    అతను ఆటవికుడు కాదని మరుక్షణంలోనే తెలిదిపోయింది వాళ్ళందరికీ. అతను సదానంద్.
    మొదట్లో ఎడిటరు దగ్గరకొచ్చి , నిదులూ, నిక్షేపాల గురించి వివరాలు చెప్పి, సీరియల్ కి  తగినంత సమాచరం తను సేకరింఛి ఇస్తాననీ, దాన్ని ఉదయార్కర్ చేత రాయించమనీ కోరి, తర్వాత ప్రెంకుమార్ తో కలిసి మరో మేగజైన్ కి వెళ్ళిపోయిన మనిషి!
    అతను ఇక్కడికెలా వచ్చాడు?
    అతనివైపు ఆశ్చర్యంగా చూశాడు ఉదయార్కర్. చెట్టుమీద నుంచి కిందికి జారిన కొండచిలువలా ఉన్నాడు సదానంద్. అతని చర్మం మీది పోలుసులు ఇది వరకటి కంటే ఇప్పుడు మరీ ప్రస్పుటంగా కనబడుతున్నాయి.
    అపరాధిలా తలవంచుకున్నాడు సదానంద్! కొద్ది క్షణాలు అలాగే నిలబడి తర్వాత హటాత్తుగా జారి బ్రహ్మచారి పాదాల మీద పడ్డాడు.
    "గురూజీ! నన్ను క్షమించండి! నన్ను క్షమించండీ గురూజీ" అన్నాడు దీనంగా.
    వేదంతంగా చిరునవ్వు నవ్వాడు బ్రహ్మచారి. నెమ్మదిగా అన్నాడు. "క్షమించడానికి నేను ఎవరిని సదానంద్? విధి ఆడించే నాటకంలో పాత్రధారులం మనసంతా! మన చేతుల్లో ఏమీ లేదు! లే! లే సదానంద్!"
    నెమ్మదిగా లేచి నిలబడ్డాడు సదానంద్. సిగ్గుతో పశ్చాత్తాపంతో కృంగిపోతున్నట్లు కనబడుతున్నాడు అతను.
    "నేను చాలా ఘోరమైన అపరాధం చేశాను గురూజీ. నేను ఎంత అవివేకంగా ప్రవర్తించనో, ఇదిగో, ఈ ఉదయార్కర్ గారికి కూడా తెలుసు" అన్నాడు విచారంగా.
    "అసలేం జరిగింది ఇంతకీ?" అన్నాడు ఉదయార్కర్.
    "దీనికంతా కారణం ఆ ప్రేమ్ కుమారే!" అన్నాడు సదానంద్ అక్కసుగా. ప్రేంకుమార్ పేరు తలుచుకోగానే కోపంతో వణకడం మొదలెట్టాడు అతను.
    "చెప్పండి! ఏం జరిగింది?" అన్నాడు ఉదయార్కర్ మళ్ళీ. ఇదంతా నిర్వికారంగా చూస్తున్నాడు బ్రహ్మచారి.
    చెప్పడం మొదలెట్టాడు సదానంద్.
    "నేను మొదట ఎడిటరు గారి దగ్గరికి వచ్చినప్పుడు మంచి ఉద్దేశ్యంతోనే వచ్చాను ఉదయార్కర్ గారూ. మాములు మనిషిని నేను నాటకాలూ, బుటకాలూ చేతకాని వాడిని.
    నా దగ్గర సీరియల్ కి పనికివస్తే మంచి సంచారం ఉందని ఎలా తెలుసుకోగలిగాడో గానీ మొత్తానికి తెలుసుకున్నాడు ఫ్రేమ్  కుమార్. ఇంకా నా వెంటపడ్డాడు. తన వెంట వచ్చేయ్యమన్నాడు. అరిచేతిలో వైకుంఠ చూపించాడు నాకు. అరలక్ష ఇస్తానని ఆశ పెట్టాడు.
    చేసిన పాపం చెబితే పోతుంది ఉదయార్కర్ గారూ, నేను డబ్బుకి కక్కుర్తి పడ్డాను. అతనితో కలిసి ఆ రెండో మేగాజైనుకి వెళ్ళి పోయాను.
    ఆ మేగజైనుకి తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేశాడు ప్రేంకుమార్. వాళ్ళకి ఇదే సమాచారంతో అద్భుతమైన సీరియల్ రాసి పెడతానని ఆశపెట్టాడు.
    ఆ తర్వాత మళ్ళీ అతను నన్ను కలవనూ, లేదూ, సీరియల్ రాయనూ లేదు.
    అతను ఎందుకు అలా చేశాడో చాలా రోజులపాటు అర్ధం కాలేదు నాకు. అర్ధమయ్యాక అంతులేని ఆక్రోశం కలిగింది. కానీ ఏం చెయ్యగలను నేను.
    ప్రేంకుమార్ నన్ను ఆ రెండో మేగజైను కి తీసుకెళ్ళిపోవడంలో ఉద్దేశ్యం నిజంగా వాళ్ళకి సీరియల్ రాసి పెడదామని కాదు.
    మొదట ఎడిటరు గారికి నిధి నిక్షేపాల గురించిన సమాచారం చెప్పను నేను. తర్వాత ప్రేమకుమార్ వచ్చి నన్ను మాయం చేసి, ఆ రెండో మేగజైనుకి తీసుకెళ్ళి అదే సమాచారం వాళ్ళకి చెప్పించాడు
    అప్పుడేమవుతుంది?
    సహజంగానే ఎడిటరుగారు నొచ్చుకుంటారు. ఆయనకి నామీద వున్న సదభిప్రాయం తొలగిపోతుంది. దురభిప్రాయం కలుగుతుంది. నన్నింక దగ్గరికి రానివ్వరు.
    నాకు ఆ పరిస్థితి కల్పించాక, మళ్ళీ తనే ఆ రెండో మేగాజైనుకి వెళ్ళి, వాళ్ళకి నామీద ఉన్నావీ లేనివీ కల్పించి చెప్పి, వాళ్ళకి నామీద దురభిప్రాయం కలిగించాడు.
    అంటే ఏమిటీ? నువ్వు నిలబడి వున్నది బురదనేల, అందుకని నువ్వీ చెట్టు కొమ్మమీదకి ఎక్కి హాయిగా కూర్చో అని చెప్పి హితభోదలేని, మునగచెట్టు ఎక్కించారు ప్రేమకుమార్. నమ్మి నేను కూర్చున్న తర్వాత ఆ కొమ్మని నిర్ధాక్షిణ్యంగా నరికి పారేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS