Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 55

 

     "ఆత్మహత్య చేసుకోనని నాకు  మాటిచ్చికూడా ఇంత దారుణాని  కోడిగట్టావా? నిన్ను నా  గుండెల్లో  దాచుకోవాలని మరీ   వచ్చాను కాశ్మీరా" వణుకుతున్న చేతులో ప్రేమతో,  అప్యాయంగా ఒక్క సారి ఆమె తల పైన  చెయ్యివేసి నిమిరాడు.

    రాబర్టు మెల్లగా బయటకొచ్చాడు.

    అతని కళ్ళు శశిభూషణ్ కోసం వెదికినయ్

    "రాస్కెల్" పళ్ళు పటపటమని కొరికాడు రాబర్టు.

    భార్య చనిపోతే ఎక్కడున్నట్టు వీడు?

    కాశ్మీర ఎందుకు చచ్చిపోయింది.

    ఇది ఆత్మహత్యా?

    హత్యా?

     ఇది ఏక్సిడెంట్ కాదు. ఇంట్లో వంటమనిషి వుండగా కాశ్మీరకి వంటగదిలో కెళ్ళేపని అవసరం లేదు.

    ఆత్మహత్య చేసుకోనని తనకి  మాటిచ్చింది. ఆరుగంటలకి తనని రమ్మని మరి  చెప్పింది.

    అయితే హత్యా....?

    రాబర్టు వార్డ్  కేసి నడిచాడు.

    కాశ్మీరా డెత్  స్టేట్ మెంటు ఏమని ఇచ్చింది.?

    కాశ్మీర కేసులో అటెండ్ అయిన డాక్టర్ జాలిగా అన్నాడు.

    "సారి ఆమె ఏమీ చెప్పలేదు తీసుకోచ్చిన  కొన్ని గంటల్లో పోయింది"

    కాశ్మీర శరీరాన్ని ఇంటికి తీసుకెళ్ళలుండా శశిభూషణ్ ఎక్కడి కెళ్ళినట్టు?

    కొద్ది దూరంగా వస్తున్న మనుషుల్ని పోల్చుకున్నాడు రాబర్టు

    కాశ్మీర తండ్రి తల్లి. శశిభూషణ్ రామదాసు చెయ్యి పట్టుకుని నడిపించుకోస్తున్నాడతను.

    రాబర్టు పక్కకి తప్పుకున్నాడు. ఆమె తల్లి తండ్రి గుండెపగిలేలా ఏడుస్తున్నారు. శశిభూషణ్ చేతికి కట్లు కట్టివున్నాయి. అతని చేతులేందుకు కాలాయి?

    కాశ్మీర కాలిపోతుంటే మంటలు ఆర్పడానికి గాని ప్రయత్నం చేశాడా?

    ఓ వ్యానులో కాశ్మీర శరీరాన్ని ఎక్కించారు.

    ఆ రాత్రే  కాశ్మీరకి అంత్యక్రియలు జరిగాయి.

     ఆ చీకటిలో స్మశానంలోకి కాలుతోన్న  ఆ చితి దగ్గరగా  నడిచాడు రాబర్టు.

    అతని కన్నీళ్ళు ఆమె  ఆత్మకి  శాంతిని చేకూరుస్తాయని రాబర్ట్ కి తెలుసు.

    కాలుతోన్న శవం తాలూకు కపాలం పగిలినట్టుగా 'టాప్' మన్న శబ్దం.... ఆ శబ్దం విన్న రాబర్ట్ మోకాళ్ళపైన  కూలబడిపోయాడు. సడే చితిలో  పది అతనికీ  చచ్చిపోవాలనిపించింది

    మండుతోన్న  ఓ కట్టేని చేతిలోకి తీసుకున్నాడతను.

    ఇప్పడతను  స్మశానంలో ఓ కోరిని దెయ్యంలా వున్నాడు. అతను ఏం చేయబోతున్నాడో  అన్న భయం తో  స్మశానంలోని ప్రేతాత్మలన్నీ గడగడ వణికిపోయినాయి.


    కాలుతోన్న కాశ్మీర చితికేసి   ఆఖరిసారి చూసాడు రాబర్ట్.

    అతని కళ్ళలోనుంచి  కారుతోన్న కన్నీటి రక్తం కాశ్మీరని   బతికించలేదన్న  సంగతి  అతనికి తెలుసు.

    మెల్లగా చేతిలో మండుతోన్న కట్టేని కాష్టంపైకి పడేశాడు.

    లేచినుంచున్నాడు  రాబర్టు. ఇప్పడతనిలో జాలి. దయ అనే పదాలు పూర్తిగా కాలిపోయినయి.

    ఓ కఠినమయిన  రాయిగా అతని గుండె మారిపోయింది.

    జేబులోంచి సిగరెట్  పెట్టెతిసి  సిగరెట్ వెలిగించి ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు.

    రాత్రిపూట అందునా అర్దరాత్రి  సమయంలో ఒంటరిగా స్మశానంలో అడుగు  పెట్టటం తప్పని  అతనికి  తెలుసు.

    భూతాలూ, దెయ్యాలు ప్త్వేరవిహారంచేసే  ఆ సమయంలో అతను కూడా ఓ  దెయ్యంలా  వుందిప్పుడు.


    కడఊపిరిలో  వుండగానన్నా ఒక్కసారి ఆమెని  చూడలేక పోయానే  అనే దుగ్ధ అతన్ని పీడిస్తోంది.

    అందాలబొమ్మ అపారంజిబొమ్మ కాశ్మీర. ఆ చిలిపితనం చిలిపిచేష్టలు. ఆ కళ్ళలో కదిలే ప్రేమ, అనురాగం అతని మనసుని తొలిచేస్తున్నాయి.

    ఎందుకిలా అయింది?

    శశిభూషణ్ కాశ్మీరని  చంపాడన్నా నమ్మకం రాబర్టులో బలంగా కలిగింది.  తనకీ  కాశ్మీరకి వున్న సంబంధం గురించి అతనికి తెలీటమే ఈ హత్యకి కారణమని అతనికిప్పుడు బాగా తెలుసు.

    కాశ్మీర  శశిభూషణ్  నీ కాపాడమని  ఎంత విలవిల్లాడిపోయింతా  రోజు. అతని ఎన్ని హింసలు పెట్టినా సహించిన  సహనశీలి కాశ్మీర.

    ఆ దుర్మార్గుడికి చేతులెలావచ్చాయి ఓ  నిండు జీవితాన్ని కాల్చేయడానికి?

    పళ్ళు పటపటమని కొరికాడు రాబర్టు.

    మోహినీకి సహరించి  ఆనాడే శశిభూషణ్ చంపినట్టయితే ఈ నాడిలా కాశ్మీర చనిపోయేది కాదు.

    మంటల్లో కాలిపోతూ ఎలా  అల్లాడిపోయిందో అమాయకురాలు

    దేవుడా నువ్వున్నావా?

    వుంటే ఎక్కడున్నావ్? ఏంచేస్తున్నావ్? ఇంతదారుణం నీకళ్ళ ముందు జరుగుతూవుంటే  కళ్ళుమూసుకున్నావా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS