Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 54

 

    రాబర్టు నన్నింకా బతుకుతూ ఇలాగే చావమంటావా?"

    "నీ సుఖం నాకు కావాలి" స్ధిరంగా అన్నాడు కాశ్మీర బాధగా నవ్వింది.

    "ఎంత పిచ్చివాడివీ  నువ్వు నేనంటే నీ కెందుకింత  అభిమానం."

    "మంచి మనుషుల్ని  అభిమానించడం, ప్రేమించడం ఓ మనిషిగా నా ధర్మం"

    "అంతేనా?"

    "నీకెలా చెబితే అర్ధం అవుతుందో నాకు తెలీడం లేదు"

    "నువ్వు నీ కేప్పడూ అందని చందమామవే రాబర్టు నా గుండె  చీల్చి  చూడు.  నీకు ఏం కనబడుకుందో . రాబర్టు నన్నేక్కడికయినా తిసికెళ్ళిపోరాదూ" కాశ్మీర  అడిగింది.

    కాశ్మీర పద్మవ్యూహంలో చిక్కుకున్న అభాగివి.  ఆమెని రక్షించడం తన కర్తవ్యం కానీ కానీ తనే ఓ తెగిన గాలిపటం  ఆమెకి తనేవిధంగా రక్షణ నీవ్వగలడు?

    కాశ్మీర గొంతు జిరగా వినబడింది.

    "అర్ధం చేసుకున్నాను నేనడిగిన  కోరికకి  వెంటనే సమాధానం చెబితే నాకు నువ్వున్నావన్నా  కొండంత ద్తేర్యంతో బతుకుప్తెన తిరగ బడేదాన్ని. మాటివ్వడానికి నువ్వు ఆలోచనల్లో పడిపోయావు. పోనిలే రాబర్టు ఇంకేమన్నా మాటాడు" అంది.

    "ఏం మాట్లాడను ? నీ మాటలు వింటుంటే భయంగా వుంది. నువ్వేమన్నా చేస్తే నామీద ఒట్టు" అన్నాడు.

    కాశ్మీర నవేస్తూ "సరే!" అంది.

    "అలా కాదు స్పష్టంగా చెప్పు!"

    "నేను ఆత్మహత్య చేసుకోనని నీకు మాటిస్తున్నాను. నీమీద ఒట్టు.

    "గుడ్"

    "ఒసారి వస్తావా" అడిగింది.

    "ఎప్పుడు రాను?"

    "తనోస్తాడిప్పుడు సాయంత్రం ఆరింటికి క్లబ్బు కేళతాడు అప్పుడు రా"

    "అలాగే" అన్నాడు రాబర్టు.

    ఫోన్ పెట్టబోతూ వెనక్కి చూసింది కాశ్మీర .

    శశిభూషణ్ నిలబడి వున్నాడు.

                                                                    *    *    *

    మోహినీకి చెప్పి కారులో  బయలుదేరాడు రాబర్టు.

    కాశ్మీరని  చిక్కుల వలయంలోంచి ఎలా తప్పించాలా అన్న యోచనలో వున్నడతను. పెదాలమధ్యా వెలుగుతోన్న  సిగరెట్  పొగలు కక్కుతోంది.


    రాబర్ట్ కారుని కొంత దూరంలో పార్క్ చేసి దిగాడు. మెల్లగా అడుగులు వెస్తూ ఆ ఇంటి ప్రహరీ  గోడ దగ్గర ఆగాడు.

    చేతిలోని సిగరెట్ నీ అవతల పారేసి గేటు తీసుకుని లోపలికి నడిచాడు రాబర్టు లోపల ఏ విధమ్తెన అలికిడిలేదు.

    కాశ్మీర తనకోసం ఎదురుచూస్తూ వుంటుందనీ,  తనని చూడగానే పరుగెత్తుకొచ్చి గుండెలప్తెన వాలి పోతుందనీ  అనుకున్నాడతను.

    కానీ అలా జరగకపోవడంతో విస్మయం చెందాడతను.

    మెల్లగా అడుగులో అడుగువెస్తూ  వంరండాలో కొచ్చాడు.

    శశిభూషణ్ గానీ  వున్నాడా ?

    అంతవరకూ వచ్చాక  అడుగు వెనక్కి వేయదల్చుకోలేదు  రాబర్టు.

    మెల్లగా మునివేళ్ళతో  తలుపుకొట్టాడు. అయిదు  నిమిషాల  తర్వాత వంటమనిషి  తలుపు తీసింది.

    రాబర్టునీ చూడగానే  బావురుమంది వంటమనిషి.

    "ఏమ్తెంది ?" గుండె వేగంగా కొట్టుకుంటోందతనికి.

    "అమ్మగారు.... కిరసనాయిల్ పోసుకొని ....కాలిపోయారయ్యా...."


    రాబర్టు గుండె ఆగిపోయింది. స్పృహ గాని పోతుందా అన్నట్టుగా తలుపుకి చేరగిలబడి బొమ్మాలా నిలబడిపోయాడు.

    అతని కళ్ళు అగ్ని గోళల్లా తయరయినాయి చూసే వాళ్ళకి  అవి పెలిపోడానికి  సిద్దంగా వున్న డ్తెన మ్తెట్స్ లా వున్నాయి.

    గాంధి హాస్పిటల్  కి  తీసుకెళ్ళారరయ్యా" అంది  వంట మనిషి .

    రాబర్టు  అక్కడ ఒక్కక్షణం నిలబడలేదు. ఇంచుమించు గా అతను పరుగెత్తాడు. కారు బుల్లెట్ లా దూసుకుపోతోంది.

    అతని హృదయంలో ఉప్పెన చెలరేగింది. ఎదురుగా ఏం వస్తుంది కూడా లక్ష్య పెట్టకుండా పదిహేను నిమిషాల్లో అతను హాస్పిటల్ దగ్గరికి  చేరాడు.

    వార్డులో కనుక్కున్నాడు రాబర్టు.

    "షీ ఈజీ డెడ్ మార్పురీలో వుంది బాడి" ఎవరో చెప్పారు.

    రాబర్టు గుండెల్లో చెయ్యిపెట్టి కేలికినట్టుయింది. అతనికి దుఃఖం ఆగటంలేదు.

    కాశ్మీర!

    కాశ్మీర!!

    కాశ్మీర!!!

    అతను నడుస్తున్నాడు అడుగులు పడడంలేదు. పసిపిల్లాడిలా తప్పటడుగులు పడుతున్నాయి.

    కన్నీళ్ళతో మార్పురి ఎదురుగా నించున్నాడు.

    అక్కడున్న మనిషి తలుపు తెరిచాడు శవాలగది.

    శవాల గదిలో కాశ్మీర!?

    కలలోకూడా  అనుకొని విషయం.

    ఇది కలా? నిజామా?

    గుడ్డలో చుట్టేసి వుంది కాశ్మీర శరీరం.

    మొహం నల్లగా పోగాసూరిపోయి....బొబ్బలెక్కి....

    కళ్ళు గట్టిగా మూసుకుని బావురుమన్నాడు రాబర్టు.

    అతని కళ్ళనించీ కన్నీరులేదు. రక్తం ప్రవిస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS