ఆ రాస్కెల్ అంత కృతఘ్నాడని గ్రహించకపోవడం తనదే తప్పు.
మోహినీ మనుషుల్ని చాలా కరెక్ట్ గా జడి చేస్తుందని చెప్పిన సాంబశివం మాటలు గుర్తుకువచ్చి అది అక్షారాల నిజం అనుకున్నాడు రాబర్ట్.
అందుకే శశిభూషణ్ అంటే మోహినీ కి అంతద్వేషం మోహినీ లాంటి ఉత్తమురాలి గుండెల్లో చిచ్చుపెట్టి. మరో అమాయకురాలు కాశ్మీర బతుకుని నిప్పులుపాలు చేస్తున్న ఆ పశువుని కరుగుతున్న కారు డబ్బాలో ఉడక పెట్టాలనిపించింది రాబర్టుకి లేకపోతే శరీరమంతా తూట్లు తూట్లు పడేలా అంగశానికో బులెట్ చొప్పన కాల్చిచంపాలి.
రాబర్టు పెదవిని కొరుక్కున్నాడు నోటికి ఉప్పగా తగిలింది.
రక్తం!
రక్తం!!
ఇప్పుడు తను వాడి రాక్తాన్ని తాగాలి ఈ భూమ్మిద పుట్టిన ఎంతటి పాపిక్తేనా ఏదో ఒక క్షణంలో పశ్చాత్తాపం కలుగుతుంది.
కానీ ఇలాంటి వాళ్ళకి ఆ మాటకే అర్ధం తెలీదు.
చట్టానికీ, పోలిసులకి దొరకని అసల్తేన ఘరానా హంతకులు అలాంటి మనుషులే వీళ్ళకి చట్టం విధించే శిక్ష చాలదు. పడి రోడ్డు ప్తెన ఉరి తియ్యాలి.
రాబర్టు రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు.
తలలోని నరాలు తిగిపోయేలా వున్నాయి. ఆవేశంతో కాల భ్తెరవుడిలా మారిపోయాడు రాబర్టు.
ఆవేశంగా అతను లేచి నిలబడ్డాడు ఓ మహా పర్వతంలా మేడ మెట్లమీద నిలబడ్డ రాబర్టుని చూసి మోహినీ నిలువెల్లా వణికిపోయింది.
"రాబర్టు ఎక్కడికి?" కంగారుగా అడిగింది.
రాబర్టుఒక్కోమెట్టే కిందికి దిగుతున్నాడు.
అతన్ని చూసి మాలి నోటమాటలేకుండా బొమ్మాలా నిలబడి పోయాడు.
మోహినీ రెండంగల్లో వెళ్ళి అతని చేతిని పట్టుకుంది.
"రాబర్టు , ఏమ్తెంది ఎక్కడికి ప్రయాణం?" భయంగా అడిగింది.
"హత్య చెయ్యడానికి" అన్నాడు.
అతని మాటలకి బాంబుపడినట్టు ఉలిక్కిపడింది మోహిని. వెంటనే తేరుకుంది అతనికేసి కోపంగా చూస్తూ__
"నువ్వు అడుగు బయటికేస్తే నువ్వు ఈ మోహీనీ శవాన్ని చూస్తావు.
రాబర్టు మోహినీ కళ్ళలోకి దిగులుగా చూశాడు.
బరువుగా నిట్టూర్చాడు.
"ప్లీజ్! నా చేతులు కేట్టేయ్యకు మోహిని శశిభూషణ్ కి నన్ను గురించీ పూర్తిగా తేలుసు అతను నాకు కీడు తలపెట్టబోతున్నాడు."
"శశిభూషణా?"
"అవును"
"కుక్కని పెంచితే విశ్వాసంగా పడుంటుంది రాబర్టు. వాడు విశ్వాసంలేని నక్క. ఆ రోజు నువ్వే అడ్డుపడి వుండకపోతే వారని చంపెదాన్ని కాదుకానీ ఏ కాలో తీసే సేదాన్ని వాడ్ని రక్షించి నీ మెడకి తెచ్చుకున్నావు కానీ నీ కొచ్చిన భయం ఏమిలేదు రాబర్టు. మోహినీ కంఠంలో ప్రాణం వుండగా నీమీద ఈగకూడా వాలలేదు"
రాబర్టు సోఫాలో కూలబడిపోయాడు. మోహినీ మాలికేసి చూసింది.
"మాలి అర్ధం అయిందిగా జాగ్రత్త" అంది.
"అలాగేనమ్మా" అన్నాడు మాలి.
మాలి వెళ్ళిపోయాక మోహిని సాంబశివాన్ని రాబర్ట్ సాయంతో లేపి మంచం ప్తెన పడుకోబెట్టి.
"పైకిపద అంది"
రాబర్టు ఆమె వెనకే నడిచాడు.
ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు.
* * *
రాబర్టు మర్నాడు పదిగంటలకి కాశ్మీర ఇంటికి ఫోన్ చేశాడు.
"హలో" అని వినబడింది అవతల గొంతు. అది కాశ్మీర గొంతు. ఆమె పలికిన తీరునుబట్టి ఏడుస్తూ మాట్లాడుతోందని గ్రహించాడు రాబర్టు.
"కాశ్మీరా" అన్నాడు.
"రాబర్ట్ నువ్వా ఏం అసలు కనబడం మానేశావు" అడిగింది.
"ఎంత అమాయకురాలు" అనుకున్నాడు.
"నీ క్షేమం కోసం" అన్నాడు.
కాశ్మీర పేలవంగా నవ్వింది.
"ఇప్పుడు నేను క్షేమంగా వున్నానని నువ్వనుకుంటున్నావా రాబర్టు."
కాశ్మీర ఏడుస్తూన్నట్టుగా వెక్కిళ్ళు వినబడుతున్నాయి.
కాశ్మీర విడిచే ప్రతి కన్నీటిబొట్టు బారువైన అడుగుల్లా అతని గుండెలమీద పడుతున్నట్టుగా ఫీలయ్యాడు.
"ఏమ్తెంది నాతో చెప్పవూ?" అడిగాడు.
"చెప్పేందుకేముంది? ఆ రోజు నీతో అంత అప్యాయంగా మాట్లాడిన మనిషి నువ్వే విజయ్ వని తెలిసేక నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. మనిద్దరికీ సంబంధం వుందన్నాడు అవును నిజమేనన్నాను.
ఆ మాటలకి రాబర్టు ఉలిక్కిపడ్డాడు.
"నీకు మతిపోయింగా కాశ్మీర" అన్నాడు రాబర్టు.
"లేదు రాబర్టు నాకు మతిపోలేదు. ఆ మనిషి నైజం తెలిపేక అబద్దం చెప్పవలసిన అగత్యం నాకు లేదు. తెలిసీ తేలిక ఒక్కసారి అబద్ధం ఆడినిన్ను అన్యాయం చేశాను. అందుకే నిజం చెప్పాను. నేను బతుకుతానన్నా ఆశ నాకులేదు. ఏ క్షణంలో నా మరణవార్త విన్నా నీకు ఆశ్చర్యం అవసరంలేదు"
"కాశ్మీరా ప్లీజ్ నన్నిలా మాటలతో హింసించకు తెలివి తక్కువ పనిమీ చెయ్యనని నాకు మాటివ్వు"
