"రాబర్టు నీకోసం నా ప్రాణాల్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడను నేను నీ బిడ్డ తల్లిని కాబోతున్న ఈ మోహినీ ప్తెన అ మాత్రం అధికారం నీకులేదా? నన్ను శాశించే అదికారం నీకుంది. రాబర్టు ప్లీజ్! నువ్వులా దిగులుగా వుంటే నాకు పిచ్చి పడుతుంది ఒక్కసారి నువ్వు నవ్వు నవ్వితే ఆ నవ్వు నా గుండెలప్తెన పన్నీటి జల్లులా అనిపిస్తుంది" అంది మోహిని.
రాబర్టు మోహనీ సుదుటిప్తెన ముద్దు పెట్టుకున్నాడు.
రాబర్టు మోహినీ కేసి చూశాడు.
తెల్లని సిల్క్ చీర నల్లని స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంది జుత్తుని పూర్తిగా వదిలేసి రిబ్బన్ కట్టింది వెన్నెల కాంతికి ఆమె చెక్కిళ్ళు అద్దలా మెరుస్తున్నాయి చీర కుచ్చెళ్లకీ. జాకెట్ కీ మధ్య జా నెడు పొట్ట కొంచెం ఎత్తుగా కనబడుతూ వెండి కొండ అంచులా కనబడుతోంది. రంగు వేసుకున్న ఆమె పలుచని పెదాలు గులాభీ రేకుల్లా వున్నాయి.
మోహినీ అతని కళ్ళలోకి చూస్తూ.
"ఎందుకలా చూస్తున్నావు?" అడిగింది.
"నేను దేవతల్ని ఎప్పడూ చూడలేదు. ఎదురుగా వున్న నిన్ను ఎలా కొలవాలో తేలీక..." అన్నాడు.
మోహినీ సన్నగా నవ్వింది. ఆ నవ్వులో 'సువ్వుత్త వెర్రివాజమ్మని అన్న అర్ధం స్పురిస్తోంది.
మోహినీ లేచినుంచోని అతనికి చెయ్యి అందించింది.
రాబర్టు ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి, తోటలోంచి పోర్టుకో దగ్గర కొచ్చాడు.
మాలి ఎదురుగా వస్తున్నాడు దానితో రాబర్ట్ కాస్త ఎండ౦గా నడవటం చూసి, మోహినీ నవ్వుకోంది.
* * *
మోహినీ మేడమీదికి వెళ్ళింది.
సాంబశివం స్పృహలోలేడు, మూడు ఖాళి సీసాలు పక్కన పడి వున్నాయి.
అతనికి కాశ్మీర గుర్తుకొచ్చింది.
'ఏం చేస్తుందో'
రాబర్టు టెలిపోన్ దగ్గరకి నడిచి ఓ నెంబర్ డయల్ చేశాడు.
రెండుక్షణాల తర్వాత అవతలినింఛి 'హలో' అన్న గొంతు వినబడింది.
అది శశిభూషణ్ గొంతు రాబర్టు పోల్చుకున్నాడు.
"నేను రాబర్టుని" అన్నాడతను.
రెండునిమిషాల పాటు అటువైపునించి సమాధానం లేదు. అటు తర్వాత ఫోన్ పెట్టేసినట్టు శబ్దం వినిపించింది.
శశిభూషణ్ ఎందుకిలా చేశాడో రాబర్టుకి అర్ధం కాకపోగా చాలా ఆశ్చర్యం కలిగింది. అక్కడ తన గురించి వినకూడద మనుషులుగానీ వున్నారా?
రాబర్ట్ కి కోపం వచ్చింది.
శశిభూషణ్ పైన అతనికి అనుమానం కలిగింది.
అతని ప్రవర్తన ఎలాంటిదో కాశ్మీర ద్వారా ఇదివరకే తెలుసు కున్నాడు రాబర్టు మోహినినీ నమ్మించి మోసం చేసిన దగాకోరు.
లాయర్ తో మాట్లాడి తనని నిర్దోషిగా నిరూపిస్తావన్న మనిషేనా శశిభూషణ్.
సమాజంలో శశిభూషణ్ లాంటి నమ్మక ద్రోహులు వున్నంత కాలం అభం శుభం తెలీవి అమాయకులు దోపిడీకి గురికాక తప్పదు.
ఒకవేళ తన ఆలోచనలు తప్పేమో అన్న అనుమానం కలిగింది రాబర్టుకి.
మళ్ళి పోన్ చేస్తే?
అనాలోంచితంగా రిసీవర్ ని ఎత్తి నెంబర్డ డయాల్ చేశాడు రాబర్టు.
"శశిభూషణ్ హియర్!"
"నేను రాబర్టునీ"
"షటప్! ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకు " కర్కశంగా అన్నాడు శశిభాషణ్.
"భూషణ్ నీకేమయింది. ఎందుకిలా మాట్లాడుతున్నావ్ ?" ఆవేశంగా అన్నాడు రాబర్టు.
శశిభూషణ్ అవతల్నించి హేళనగా నవ్వేడు. అటు తర్వాత అన్నాడు.
"మిష్టర్ రాబర్టు ఉరఫ్ విజయ్ నేను నువ్వనుకున్నంత పిచ్చి వెధవని కాను నీకూ నా పెళ్ళానికి ఎంత కథ నడిచింది గమనించడానికే ఆ రోజు లౌక్యంగా బిహేవ్ చేశాను. కట్టుకున్న పెళ్ళాన్ని మరో పురుగేడుస్తుంటే చూసి సంబరపడే బుద్దావతారాన్ని కాదునేను."
రాబర్టు కోపంగా అన్నాడు.
"ఇప్పుడు నీ మూడ్ బాగున్నట్టులేదు తర్వాత మాట్లాడతాను."
"డోంటాక్ బ్లడి బుల్ షిట్. మరోసారి కనీసం ఈ దిక్కుకేసి తలెత్తినా చేతులకి బేడీలు పడతాయి ఉరికంబం ఎక్కుతావు" అంటూ విసురుగా రిసివర్ని క్రేడిల్ ప్తెన పెట్టేశాడు శశిభూషణ్.
రాబర్టుకి రక్తం మొహంలోకి పొంగింది. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
"శశిభూషణ్!" పళ్ళు పటపట కొరికాడు. ఆ మనిషే కనక ఎదురుగా వుంటే ఆ క్షణంలో రాబర్టు ఏంచేసేవాడో చెప్పటం కష్టం.
అతనికిప్పుడు మనుషులపైన నమ్మకం పూర్తిగా పోయింది.
మేకతోలు కప్పకొన్న తోడేలు శశిభూషణ్ అనిప్పడే అతను తెలుసుకున్నాడు.
కాశ్మీర మొహంచూసి ఆనాడు విడిచి పెట్టాడు శశిభూషణ్ నీ.
కాశ్మీర కన్నిటికి కరిగిపోయి మోహినీ బంధనంలోంచి అతన్ని మరోసారి కాపాడాడు.
