Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 53


                                                                                    21

    చేతిని రాణి నడుంమీద వేస్తూ సర్దుకు కూర్చోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు పరుశురాం.

    "ఆటోలో వెళితే పోయేది. ఈ డొక్కు రిక్షా ఎక్కించి ప్రాణం తీస్తున్నావు. నెత్తికి టాపు తగులుతోంది."

    రాణీగారికి ఎగిరి మొహంపైన పడుతోన్న తల వెంట్రుకలని చేత్తో ఒయ్యారంగా వెనక్కి తోస్తూ నవ్వింది.

    "పది రోజుల్నుంచీ కంటున్న కలిది!" అంది.

    "అంటే?"

    "నీతో కలిసి రిక్షాలో ఎక్కి సిన్మాకెళ్ళాలని...." అని నడుంపైన వున్న అతని చేతిని కొంచెం లాగి పొట్టపైన చేర్చింది.

    దాంతో అతను మరింత ఒదిగి కూర్చోవలసి వచ్చింది.

    "ఇప్పుడు బాగుంది కదు!" అడిగింది రాణి.

    "నీ మొహంలా వుంది?"

    "నా మొహానికే...." అంది మూతి తిప్పుతూ.

    "దిబ్బరొట్టి మొహం!"

    "ఉష్శు.... దిబ్బరొట్టి అని తెలిస్తే ఆ మాట అనేవాడివి కాదు!" అంది కాని కొంచెం అతన్ని రుద్దుకుంటూ రాణి.

    "నేను కూర్చోలేను దిగి నడుస్తాను" అన్నాడు పరుశురాం.

    "ఆ పని మాత్రం చేయకయ్యా! రిక్షాలో దగ్గరగా కూర్చోవచ్చని.... నాకెంతో బాగుంది. సమ్మగా
అనిపించడంలా....!"

    అతని చెవిని కొరికింది రాణీ.

    "ఆ.... సమ్మగానే వుంది. సీటుని గౌలిగూడా బస్ డిపోలా పెంచేశావు. నీ సీటుమీద నాలుగు బస్సులొచ్చి ఆగొచ్చు!"

    రాణీ కొంటెగా అంది.

    "బస్సులెందుకు మధ్యలో ఆ పనేదో నువ్వే చేయచ్చుగా!"

    "ఎప్పుడో నీకు 'బాండు' బాగా వాయిస్తాను."

    "హె.... అన్నీ కబుర్లే! పోనీ ఎప్పుడో చెప్పచ్చుగా! ఎదురుచూస్తూ కూర్చుంటాను" అంది రాణి.

    రాణి బొడ్డులో వేలు పెట్టి తిప్పాడు పరుశురాం. చక్కిలిగింతలతో ఆమె మెలికలు తిరిగిపోతూ....

    "ఏయ్! ఏమిటా పని?" అంది అతని ముక్కుని పట్టుకుని ఆడిస్తూ.

    పరుశురాం సైగ చేశాడు తన ఒళ్ళో కూర్చోమన్నట్టు!

    "ఎందుకు!" అడిగింది.

    ఆమె తొడపైన గిల్లాడు పరుశురాం.

    "గోడౌన్ లో సరుకు దాచుకోవాలనుకుంటున్నాను"

    అతని మాటలకి రాణి మోచేత్తో పొడిచింది. కింది పెదివిని మునిపంటితో నొక్కిపట్టి నవ్వుతూ అతన్ని చూస్తోంది.

    రిక్షావాడు రిక్షా దిగి హాండిల్ని గట్టిగా పట్టుకుని నడిపిస్తూ అడిగాడు.

    "ఏం సరుకు బాబూ!"

    "ఏదోలే! నీకెందుకు?" కసిరింది రాణి.

    "పెద్ద వోడ్నికదా? ఏదో సలహా చెప్పాలని అడిగాను. సరుకేదన్నా గానీ గోడౌన్ మంచిది కాకపోతే పాడైపోద్ది!

    బేగంబజార్లో మిరపకాయ బస్తాలు తడిసిపోయి మిరప కాయిలన్నీ బూజుపట్టేసినయి. గోడౌన్ మరీ పాత దనుకుంటాను. కాస్త లీకేజీ కూడా వుండే వుంటుంది.

    బంగారంలాంటి మిరపకాయలు, బూజుపట్టి పోయినయి!" విచారంగా అన్నాడు రిక్షావాడు.

    పరుశురాం నవ్వుతూ అన్నాడు.

    "మాది కొత్త గోడౌన్ లే తాతా! ఇంకా ఓపెన్ చెయ్యలేదు.!

    రాణి మోచేత్తో ఒక్కపోటు పొడిచింది పరుశురాంని.

    "ఏంటా మాటలు! గలీజ్ ఖాన్ లా!" మూతిని వెయ్యి వంకరలు తిప్పుతూ అంది రాణి.

    "వాడెవడు?"

    "మన బస్తీలో పూలు అమ్ముతాడు. నోరిప్పితే అన్ని.... అంతే!"

    రాణి మొత్తమీద చెయ్యివేసి నొక్కుతూ-

    "జబర్దస్తీ అయిన సీటు" అన్నాడు.

    "అందుకే అన్న గలీజ్ ఖాన్" అని, చటుక్కున అతని చెంపపైన ముద్దు పెట్టుకుంది.

    "బాబూ!" పిలిచాడు రిక్షావాడు.

    "పానకంలో పుడకలా నీ గొడవొకటి!" విసుక్కుంది రాణి.

    "ఏమిటీ?" అడిగాడు పరుశురాం కాస్త సర్దుకొని కూర్చుంటూ.

    "ఎలక్షన్ లు ఎప్పుడొస్తాయి బాబూ!" అడిగాడు రిక్షావాడు.

    "ఇదివరకు అయిదేళ్ళకోసారి వచ్చేయి. ఇప్పుడు ఆర్నెల్లకీ, సంవత్సరానికీ కూడా జరుగుతున్నాయి. ఇక ముందు రోజూ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు" చెప్పాడు పరుశురాం.

    "నేను కూడా ఎలక్షన్లో నించోవాలనుకుంటున్నానీసారి!"

    రిక్షావాడి మాటలకి బాంబు పడినట్టు ఉలిక్కి పడ్డాడు పరుశురాం.

    "ఏయ్ ముసలీ! కల్లు కాంపౌండ్ కెల్లి వచ్చేవా ఏంటి?" అంది రాణి.

    రిక్షా ఆగిపోయింది.

    "ఆపావెందుకు?" అడిగింది రాణి.

    "ఏం మహారాణీ!"

    "నేను ముసలి పీనుగలానూ, కల్లు కాంపౌండ్ కెళ్ళివచ్చినట్టు కనిపిత్తన్నానా నీకు."

    "నేను కూటికోసం రిక్షా లాగడం లేదు. పెజా సేవకోసం తొక్కుతున్నాను. నాకు తోచిన సేవ నేను చేస్తున్నాను.

    ఐ యాదగిరి....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS