ఆ ఇంట్లో తనే యకమానిలా వ్యవహరించినా పట్టించుకొనే వాళ్ళు లేరు పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యలున్నాయతనికి.
కానీ పంజరంలో పెట్టిన చిలకలా తానా బంగళాలో బంధించ బడలేదుకదా అని నవ్వుకున్నాడు రాబర్టు.
అంతలోనే అనుకున్నాడు రాబర్ట్. రోజులు, నెలలు సంవత్సరాలూ గడుస్తున్నా అజ్ఞాతవాసం చేస్తున్నాడే కాని శత్రువులని వేటాడ్డానికి ప్రయత్నం చేశానా? అని ప్రశ్నించుకున్నాడు.
పూర్ణా, రమేష్, దాసు ఆ ముగ్గురూ ఎక్కడున్నారు?
వాళ్ళు తన పరిధిలోకి రారు. తనేవాళ్ళని వెదుక్కుంటూ వెళ్ళాలి.
తన ప్రయత్నంలో ఏ మాత్రం తెలివితక్కువగా ప్రవర్తించినా పోలీసుల ఉద్బులో పడిపోతాడు.
కాశ్మీర మోహినీ ల అండదండలున్నాయి తనకి.
పోలీసులకి లోంగిపోయి. హంతకులఆచూకినీ తెలిపితే- తను బయటపడ్డానికి అవకాశాలున్నాయి కానీ తను నిరూపించుకోలేకపోతే!
అంతలోనే నవ్వుకున్నాడతను వాళ్ళని అంతం చెయ్యలవింత కాలం చేసిన ప్రయత్నం వృధా అవుతుంది.
జీవితంపట్ల మమకారం లేదతనికి.
మృత్యువుని చిరునవ్వుతో ఆహ్వానించగల గుండెద్తేర్యం అతనిలో వుంది.
రాబర్టు సిగరెట్ వెలిగిస్తూ చూశాడు. సాంబశివం సోఫాలో వెనక్కి వాలిపోయి వున్నాడు.
"పూర్ ఫెలో" అనుకున్నాడు మనసులోనే.
అతను మెల్లగా లేచి పోర్టికోలోకోచ్చాడు. తోటలో బాగా పెరిగిన మర్రిచెట్టు కింద సిమెంటు బెంచి ప్తెన కూర్చున్నాడు.
అతన్ని చూసి మూడు కుక్కలు పరిగేత్తుకోచినయి.
ఈ మధ్యకాలంలో రాబర్టుకి ఆ కుక్కలు బాగా మచ్చికయినాయి.
గాలికి మర్రిచెట్టు పండిన ఆకులు రాలుతున్నాయి.
కుక్కల్ని టూవ్ చేస్తూ కూర్చున్నడతను.
"ఏమిటాలోచిస్తున్నావు?"
ఆ మాటలకి తలెత్తి చూశాడు రాబర్టు.
మోహినీ!
ఆ క్షణంలో ఆమె అతని కంటికి ఓ వన దేవతలా కనబడింది.
కోరిన వారాల నివ్వడానికి ప్రత్యక్షమ్తెన యక్షిణిలా కనబడింది.
"రాబర్టు" మృదువుగా పిలిచింది.
"ఊం"
"ఇంకా నీ ధోరణిలో మార్పులేదు" అంది. అతని పక్కనే కూర్చుని భుజంప్తెన చేయివెస్తూ.
"మార్పు కుంటానని నీకు మాటివ్వలేదుగా" అన్నాడు.
"నాకోసం మాటివ్వలేవా?"
రాబర్టు తాత్వికంగా నవ్వేడు. ఆ నవ్వులో నువ్వెంత పిచ్చిదానివి అన్న జాలి గోచరిస్తుంది.
"నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా వుంది" అన్నాడు రాబర్టు.
"నాకు జాలికాదు కావాల్సింది రాబర్ట్ నువ్వు నన్ను ప్రేమించలేవా?"
మోహిని అడిగిన ఆ మాటలకి ఎలాంటి మగవాడయినా చలించిపోతాడు. కానీ రాబర్ట్ నవ్వేడు.
"ప్రేమ ఆ రెండక్షరాలూ నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసి ఓ జ్వాలని రగిలించాయి మోహినీ ఆ జ్వాలలోపడి కాలిపోతూనే నెన్నో తప్పలు చేశాను. అందులో ఓ తప్పుకి కారణంగా ఓ నిండు జీవితం బలయింది. ఏనాడైతే వంచనకి తలోంచానో ఆ రోజే నాలోని నీతి చచ్చిపోయింది. కొన్ని అలావాట్లకు బానిసయ్యాను. ఆ అలవాట్ల దోషానికే మేరీ చచ్చిపోయింది. కాదు ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ఆమెని చంపింది నేనే అనిపిస్తుంది నాకు రెండు మనసుల మధ్య స్సందన కలిగించి, ఆకర్షించబడి ఒకటిగా చేసేది ప్రేమ. ఆ పవిత్రమయిన రెండక్షారాలూ నా గుండెలో మైలపడిపోయి సజీవ సమాధి చేయబడినయి మోహీనీ.
అర్జునని ప్రేమించాన్నేను ఆమె జీవితంలో భాగం పంచు కోవాలను కున్నాను అదే సమయంలో కాశ్మీర చిలిపిచేష్టలకి నాలోని బలహీనత నన్ను రెచ్చగొట్టి నా పతనానికి నాంది పలికింది. రాబర్టుగా అవతారం ఎత్తాక మేరీ, చిత్ర, నువ్వు నా జీవితంలో ప్రవేశించారు. నేనేమిటో తెలీకుండా ఆ అక్కాచేల్లెలిద్దరూ వాళ్ళ కన్యాత్వాన్ని నాకర్పించారు ఇప్పుడు మిగిలింది నువ్వు. నిన్ను నేను కోరేది ఒక్కటే!" అడిగాడు రాబర్టు.
"ఏమిటి?" మెల్లగా గొంతు జిరబోతుండగా అడిగింది మోహిని
"అర్జున ఆత్మశాంతికోసం నా ప్రతిజ్ఞని సాధించేందుకు నీసహాయం నాకు కావాలి!"
మోహినీ అతనికేసి చూస్తూ వుండిపోయింది.
"సంధ్య చీకట్లు అలుముకోస్తున్నాయి. ఆ రోజుకి డ్యూటీ పూర్తి చేసుకొని సూర్యబాగవానుడు పశ్చిమాద్రీన అదృశ్యమవుతున్నాడు.
పగలను మింగుతూ చీకటిని వీజృంభస్తున్న ఆ అసుర సంధ్య వేళ రాబర్టు కళ్ళలోని కన్నీటిని చూసి మోహిని కరిగిపోయింది. అతన్ని తన గుండెల్లో దాచుకొని ఓదార్చాలనీ, లాలించాలనీ అతని బాధనంతటినీ మరచిపోయేలా చేయాలనిపించింది మోహినీకి.
ఎన్నికల్లో గెలిచిన అభార్ధిలా ఉత్సాహంతో ఆకాశంలోకి చోరబడుతున్నాడు చంద్రుడు బంజారా కొండలపైనుంచి చల్లని గాలి తేలిపోతూ వచ్చి వాళ్ళని తాకుతోంది.
రాబర్టు తలని తన గుండెలప్తెన చేర్చుకొంది మోహిని.
అది కోరికతో కాదు 'చిలిపితనంతో కాదు' అతన్ని రెచ్చగొట్టాలని కాదు. అతనిలో రగులుతున్న అగ్ని పర్వతాలనీ చల్లార్చాలన్న ఓ ఆరాటం ఆమెలో వుంది. ఓ బిడ్డని గుండెలో దాచుకొన్న మాతృమూర్తిలా అనిపించింది మోహినీ ఆ క్షణంలో
