Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 52

 

    "శ్వేతకి సమాధి గుహలో లభించిన నిధుల్ని ఎక్కడదాచారు?" అని కఠినంగా ప్రశ్నించాడా వ్యక్తీ.
    "ఏమో నాకు తెలియదు " అన్నది జ్యోతి. ఇంతకాలంగా ఆమె మనసులో రగులుతున్న కొన్ని అనుమానపు తెరలు తొలగిపోవటం ప్రారంభించినాయి. సమాధానాలు దొరకని మరికొన్ని అనుమానాలు అలాగే నిలబడి వున్నాయి. తనకు కన్పించే శ్వేతకి ఎవరు?
    శ్వేతకి సమాధిలో నిదులున్నాయని తెలుసుకున్న వీరెవరు? వీరికి ఆ విషయం ఎలా తెలిసింది?
    రాగిరేకులో నిధులను గురించి ఎందుకు వ్రాయలేదు?
    ఉంటే ఆ నిధులు ఎక్కడున్నాయి?
    ప్రస్తుతానికి వీరి వలయం నించి బయటపడే మార్గం ఏమిటి? ఈ అంశాల గురించి ఆలోచించటం ప్రారంభించింది.
    ఆ ఎదుటి వ్యక్తీ ఆమె మౌనాన్ని సహించలేకపోయినాడు.
    "నిజం చెప్పకపోతే నువ్వూ, లచ్చిమీ, నీ ప్రియతముడయిన జయకృష్ణ - అందరూ ఇక్కడే సమాధి అయిపోతారు" అంటూ బెదిరించాడా వ్యక్తీ. జ్యోతి రవంత ధైర్యాన్ని కూడదేసుకంది. ఈ కారు చీకటిలో తాము ఎక్కడున్నదీ అర్ధం కావటల్లేదు. అతని మాటల్ని అనుసరించి జయకృష్ణ కూడ చిక్కిపోయినాడని తెలుస్తోంది.
    ఆనాడు ఒక ఆగంతకుడయిన వ్యక్తీ వచ్చి తామ్రపత్రాలున్న స్టీం లాంచిని లక్ష రూపాయలయినా యిచ్చి కొనుగోలు చేయాలని ఎందుకు ప్రయత్నించాడో యిప్పుడు బోధపడింది.
    వీరే అతడిని పంపి వుంటారు. కాని అతడు ప్రమాదంలో ప్రాణాలే కోల్పోయినాడు. సమాధి గుహలలో ఏవో నిదులున్నాయని ఎలాగో తెలుసుకున్న వీరు వాటికి దారి తెలుసుకోలేక పోయినారు. దారి తెలిసిన తన చుట్టూ వల పన్నుతున్నారు మొదటి నించీ!
    అయితే శ్వేతకీ ఎవరు? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకకుండా అలాగే మిగిలి వుంది. ఏది ఏమయినా ముందు ఇక్కడి నుంచి బయటపడే దారి ఆలోచించాలి. వారేమీ కావాలని ఆశిస్తున్నారో అది  ఇవ్వగలమని ఆశ చూపటమే అందుకు అనువు అయిన మార్గం.
    జ్యోతి అతనికి విన్పించేలా నవ్వింది.
    "నువ్వెంత అజ్ఞానివి మూర్ఖుడా! సమాధి గుడులలోని నిధులు నీకు అంత సులభతరంగా లభ్యమవుతాయని అనుకుంటున్నావా? అవి పొందగలగటానికి నన్ను బంధించటం ఒకదారి అనుకుంటున్న నీ అజ్ఞానానికి నవ్వు వస్తోంది.
    నీకు కావలసినవి నిధులు అయితే, వాటికి మార్గం చెప్పేందుకు నాకు అభ్యంతరం లేదు. కాని ముందుగా నువ్వు నేను చెప్పినట్లు వినాలి. నా ప్రయత్నాలను ఇంకా కొనసాగించాలి కదా! అందుకు నీ సహాయం కావాలి. ముందు జయకృష్ణను ఇక్కడకు తీరుకురా! ఆ తరువాత నీవు సమాధిలోకి పోవలసిన దారి ఏదో నేను చెప్తాను " అని విశ్వాసపాత్రమయిన స్వరాన బదులు చెప్పింది జ్యోతి.
    అతడు ఆమె మాటల్ని రవంత అనుమానించాడు. అనుమానించటం తన విధి అన్నట్లుగా అనుమానించాడు.
    "నీవు నన్నుమోసగించటానికి ప్రయత్నిస్తే జరిగిందేమిటో నీకు తెలుసు కదా!: అని ప్రశ్నించాడు కఠినమయిన స్వరాన.
    "నేను మోసగించే విషయం అలా ఉంచు. బల ప్రయోగంతో ఆ విషయాన్ని తెలుసుకోగలనని నీవు ఆలోచిస్తే జరిగేదేమిటో గ్రహించు. నా అనుకునేది అంతా వోదులుకుని , ప్రాణాలను సైతం పణంగా ఒడ్డి నేనీ ప్రయత్నంలోకి దిగాను. నన్ను హింసించినా, ప్రాణం తీసినా నీకు ఆ నిధులకు వెళ్ళే దారి మాత్రం తెలియదు. నిధులు సంపాదించాలన్నది నీ లక్ష్యమయితే నేను చెప్పినట్లే నీవు వినాలి. ముందు జయకృష్ణను చూడాలి నేను" అన్నది జ్యోతి దృడమయిన స్వరాన.
    ఆమె తన మొండి వైఖరిని మార్చుకోదని , బెదిరించి కాని, బాలవంతం తో కాని తానా విషయాన్ని తెలుసుకోలేదనీ భావించాడు. ఆ నీడ లాంటి వ్యక్తీ. వెంటనే అక్కడ నించి బయలుదేరి వెళ్ళిపోయాడు.
    కొద్ది నిమిషాలు భయంకరమైన నిశ్శబ్దం తరువాత లైట్లు వెలిగాయి. తామిద్దరూ అదునాతనమయిన ఏర్పాట్లు కలిగిన ఒక ఇంటి గదిలో ఉన్నట్లుగా గ్రహించింది జ్యోతి.
    కొద్ది నిముషాల తరువాత జయకృష్ణను వెంట పెట్టుకుని దీర్ఘతరమూ దృడతరమూ అయిన శరీరం కలిగిన ఒక వ్యక్తీ ఆ గది లోనికి వచ్చాడు. జ్యోతి నేత్రాలు ఆనంద కేదారాలయినాయి.
    ఆమె అంతర్యం ఆనంద తరంగిణి అయిపొయింది.
    ఆ యిరువురి మధ్య చూపులతోనే నిశ్శబ్దమయిన సంకేతాలు నడిచాయి. జ్యోతిని, లచ్చిమిని చూడగానే జయకృష్ణ దిగజారి పోతున్న మనోధృతిని సమీకరించుకోగలిగాడు.
    "ఇది బలమైన కోట లాంటి చోటు. ఇక్కడి నుంచి తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తే మా మనుషులు నిర్ధయంగా మిమ్మల్ని కాల్చి వేస్తారు. నాతొ సహకరిస్తే మీరు క్షేమంగా బయటపడి వెళ్ళిపోవచ్చు. ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి" అన్నాడు దీర్ఘతరమూ , దృడతరమూ అయిన శరీరం కలిగిన వ్యక్తీ.
    "అక్కడ నిదులున్నాయని నీకేవరు చెప్పారు?" అని అడిగింది జ్యోతి.
    "అది నీకు అర్ధం కాని -- అర్ధం చేసుకోలేని విషయం . ఎదురు ప్రశ్నలు వేయకు. అడిగింది చెప్పు" అన్నాడతడు.
    "మమ్మల్ని తీసుకురాగలిగావు కాని నిధుల గురించి వివరించే పత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేక పోయినావు. నిన్ను చూస్తేనిజంగా జాలి వేస్తోంది. క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్ గారి వద్ద వున్నాయి. అయన ఎక్కడ దాచారో మాకు తెలియదు. వెళ్ళి తెల్సుకో!" అన్నది జ్యోతి నిర్లక్ష్యంగా.
    అతడు రవంత సేపు ఆలోచించాడు.
    "మీలో ఒకరు ఇక్కడే వుండండి. ఒకరు నాతొ వచ్చి శ్రీ బృందావన్ గోయెల్ దగ్గరున్న వివరాలను తీసుకురండి. ఏ ఒక్కరూ మోసగించాలని ప్రయత్నించినా రెండవ వారు బలి అవుతారు " అన్నాడు.
    జయకృష్ణ అతనితో వెళ్ళేందుకు బయలుదేరాడు. దీపాలను మలిగించి గదిలో అంధకారం నింపేశాడతడు.
    జయకృష్ణ అతనితో పాటు కారులో ఫిల్టర్ హవుస్ దిక్కుగా ప్రయాణమయినాడు. అణిచి పెట్టిన స్ప్రింగ్ లా కూర్చున్నాడు జయకృష్ణ.

                               17


    అల్లంత దూరాన దీపకాంతులు కన్పించగానే కారును రోడ్డుకు అడ్డంగా తీసుకువచ్చి నిలిపి వేసింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "క్యూరేటర్ సర్! ఆ వచ్చే కారులోనే మన ప్రత్యర్ధులున్నారు. సాహసంతో వారిని ఎదుర్కోవాలి. అందకుండా పోయినాయనుకున్న బ్రతుకు అర్ధాలపై ఆశలు చిగురింపచేసిన జ్యోతి కోసం ఈ సాహసం చెయ్యక తప్పదు.
    "నా ప్రోత్సాహంతో సాహసోపేతమైన మార్గంలోకి వచ్చిన జ్యోతికి తోడుగా నిలిచాడు జయకృష్ణ.
    వారిద్దరి కోసం నేను తెగించాలి -- తప్పదు. కానీ మీరు బాధ్యత కలిగిన పెద్ద పదవిలో ఉన్నారు. మీ ప్రోత్సాహ సహకారాలతో మీ అనుభవాల వెలుగుతో ముందు ముందు ఎందరో యువకులు అర్కేలాజికల్ అన్వేషణలు కొససాగించాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS