Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 50

 


    రాబర్టుకీ  చాచిపెట్టి ఆమె చెంప పగలకొట్టాలనిపించింది. కానీ తమాయించుకుని అన్నాడు.

    "నువ్విలాంటి పనులు చేస్తే మళ్ళీ నీకు కనబడను."

    మోహినీ  అతని మాటలు విన్నదో లేదో కానీ రెండు  కాళ్ళనీ  టీపాయ్ పై పెట్టి  మోకాళ్ళ పైన  తలుంచి  గోడకేసి చూస్తోంది.

    రాబర్టు మెల్లగా ఆమెని అలాగే ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళి  మంచం పైన పడుకోబెట్టాడు. ఆమె పక్కనే పడుకుని రాబర్టు ఆమె  తలపైన చేత్తో నిమరసాగాడు.

    రాబర్టు అనుకున్నాడు.

    అంతా చిత్రంగా వుందతనికి. కలలోకూడా అతను వూహించలేదు. మోహీనీ ఈ విధంగా తనకి దగ్గరవుతుందని.

    ఇదంతా ఋణ సంబంధంగా అనిపిస్తోంది.

    మోహీనీ తన సాహచర్యాన్ని కోరుతున్నదని రాబర్టుకి అర్ధం అయిపోయింది.

    రాబర్టు కళ్ళు దించి  చూశాడు. మోహీనీ కళ్ళార్పకుండా చూస్తోంది.

    ఎక్కడో దూరంగా గంటలు వినబడుతున్నాయి.

    రాబర్టు కళ్ళు మూసుకున్నాడు.

                                                           o    o    o    o

    పదిహేను రోజుల పాటు రాబర్ట్ ఆ బంగళాలో నుంచి బయటికి రాలేదు.

    మోహీనీ అతన్ని భర్త సాంబశివంకి పరిచయం చేసింది.

    సాంబశివం  స్నేహపూర్వకంగా రాబర్టుతో మాట్లాడాడు.

    అదీకాక సాంబశివం మాట్లాడిన మాటలతీరూ ప్రవర్తనా రాబర్టుకి వచ్చింది.

    అంత మంచిమనిషికి దేవుడేందుకింత పెద్దశిక్ష వేసాడో రాబర్టుకి అర్ధంకాలేదు.

    సాంబశివం రాబర్టు తో అన్నాడు. మోహీనీ సాధారణంగా ఎవర్నీ నమ్మదు.

    "ఏ వ్యక్తిన్తేనాసరే చాలా జాగ్రత్తగా గమనించి ఎలాంటివాడో జడ్జి చేస్తుంది రాబర్టు. మా మోహినీకి నీమీద సదభిప్రాయం కలిగిందంటే నువ్వు నాకు నమ్మకస్తుడీవే ఈ రోజునించీ ఈ ఎస్టేటు వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో" అన్నాడు.

    రాబర్ట్ తో  మాట్లాడుతూనే సాంబశివం  'మాలి' అక్కడ పెట్టి వెళ్ళిన విస్కీ బాటిల్  ఓపెన్ చేశాడు.

    "నువ్వు తీసుకుంటావా?" అడిగాడు.

    రాబర్ట్ నవ్వూతూ సీసాని చేతిలోకి తీసుకున్నాడు.

    "మీరు మరీ అంత స్పృహపోయేవరకు ఎందుకు తాగుతారు?" అడిగాడు రాబర్టు.

    సాంబశివం నవ్వేడు.

    "నిజం చెప్పనా? అబద్దం చెప్పనా?" అన్నాడు రాబర్ట్.

    "మీరు అబద్దం చెప్పరని నాకు తెలుసు" అన్నాడు రాబర్ట్.

    అతను టిన్ లోంచి ఫారిన్ సిగరెట్  తిసి వెలిగించి "హావ్ ఇట్" అన్నాడు.

    రాబర్టు  సిగరెట్  తీసుకుని  వెలిగించాడు.

    "మిస్టర్  రాబర్ట్  ఎక్కువ తాగాకూడదని నాకు తెలుసు. కానీ తాగేది ఎందుకో  తెలుసా?" అతని గొంతు జీరబోయింది. ఒణికింది.

    అతను చెప్పబోయే విషయం చాలా సీరియస్ గా వుంటుందని రాబర్టు గ్రహించాడు.

    "రాబర్టు! నాకు సుఖం కావాలి. ఆడదానితో సుఖంకావాలి. కానీ కానీ అయం  అన్ ఫిట్  ఫర్ దట్ నా భార్య  అందాలరాశి సుగుణాల రాశి ఆమెని అన్యాయం చేశానన్న ఓ అసంతృప్తి నాలో ఎక్కువ్తే  పోయి ఆమెకి నా మొహం కూడా  చూపించలేని పిరికితనం నాలో క్షణ క్షణం  పెరిగిపోతోంది. నా చుట్టూ నాకెన్ని సుఖాలున్నా మనశ్శాంతి లేదు. అసంతృప్తి గిల్టీ నెస్, ఓ విధమ్తెన భయం నన్ను అశాంతికి గురి చేస్తుంటే ఆత్మహత్య  చేసుకొనే ద్తేర్యంలేక ఇలా తాగి తాగి  స్పృహలేకుండా పడివుండటం అలవాటు చేసుకొన్నాను ఇప్పుడు నువ్వు నాకు ఆత్మియుడివి స్నేహితుడివి సన్నిహితుడివి  నా పెక్రటరీవి అన్ని నువ్వే అందుకే నీకీ నిజం చెపుతున్నాను. బతికినన్నాళ్ళూ బతకడమేగానీ నా వంశాన్ని నిలుపుకొనే శక్తిలేని దౌర్బాగ్యుడ్ని సాంబశివం కళ్ళలో నీరు గిర్రున తిరిగింది.

    గ్లాసుని చేతిలోని తీసుకొని రెండే గుక్కల్లో తాగేశాడు సాంబశివం.

    కంఠం కాలిపోయిందేమో - ఊపిరితిత్తులు కరిగిపోయయేమో  అన్నట్టుగా అతను దగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

    రాబర్ట్ అతని గుండెలపైన చెయ్యి వేసి సవరదీశాడు.

    అతను కుదుటపడ్డాక రాబర్టు అన్నాడు "దయచేసి ఎక్కువ తాగకండి మీ కేమన్నా అయితే మోహినీకి అన్యాయం జరుగుతుంది."

    సాంబశివం పెద్ద ఫిలాసఫర్  లా నవ్వేడు.

    "రాబర్టు నేను పోతేమాత్రం  నువ్వున్నావుగా"

    అతని మాటలకి రాబర్టు  చాకితుడయ్యాడు  మోహినీ అతనికి అన్ని చెప్పిందా అన్న అనుమానం అతనికి కలిగింది.

    సాంబశివం విస్కీని గ్లాసులో పోస్తున్నాడు. ఆ క్షణంలో  సాంబశివం రాబర్టు  కళ్ళకి హాలాహలాన్ని  మింగుతున్న శివుడిలా కనబడ్డాడు.

     రాబర్టు అడుగుతీసి బయటపెట్టకపోతే అతని ఉనికిని కనుక్కోవటం బ్రహ్మదేవుడికి సైతం కష్టం ఆ ఎస్టేట్ లో సాంబశివం దగ్గర మోహినీ చల్లని నీడలో వుండగలిగితే అతను జీవితాంతం సుఖంగా బతికి పోగలడు.

    కానీ అక్కడేంత కాలం  వుండగలడో అతనికే తెలీదు.

    కార్చిచ్చులా దహిస్తున్న పగ అతని నరనరాల్లోనూ జీర్ణించుకానీ పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS