రాబర్టు మోహినీ చెంపల్ని సున్నింతగా రాశాడు.
"నాకు ఆకలిగా వుంది. పద భోజనం చేద్దాం" అంది మోహిని.
రాబర్టుకి తినాలని లేకపోయినా మోహినీ కోపం లేవక తప్పు లేదు.
అతను మోహినీ తో పాటుగా డైనింగ్ హాలులోకి పడిచాడు.
భోజనం చేస్తుండగా అన్నది మోహిని.
"ఆ రోజు నన్ననుమానించి పారిపోయావు రాబర్టు. మా ఆయనకి నిన్ను పరిచయం చేసి ఈ ఎస్టేట్ మేనేజర్ని చెయ్యాలనుకున్నాను"
"నా జాతక ప్రభావమేమిటోగానీ, అన్నీ అందినట్టే అంది చేజారి పోతుంటాయి" అన్నాడు.
"నన్ను గుంరిచేమనుకుంటున్నావు?" అడిగింది.
"దేవతని చూసి దేయ్యమనుకున్నందుకు విచారిస్తున్నాను."
నేనేం దేవతని కాదు. ఓ ఆడదాన్ని నిన్ను ఆరాధిస్తున్న ఓ పిచ్చిదాన్ని" అంది మోహిని.
బాధగా చూసేడు రాబర్టు.
"నాకు దగ్గరవ్వాలని ప్రయత్నం చేయకు మోహినీ" అన్నాడు.
మోహిననీ విస్మయంగా చూసింది.
"ఏం?"
అలా ప్రయత్నం చేసిన వాళ్ళెవరూ నాకు దగ్గర కాకపోగాజీవితాల్నే పోగొట్టుకున్న దురధృష్టవంతులు నువ్వు నువ్వుగానే వుండి, నూరేళ్ళూ సుఖంగా వుండాలని కోరుకుంటున్నాను మోహీనీ"
"నీకు ఆర్పించుకొని ఈ జీవితం వ్యర్ధమనిపిస్తుంది నాకు" అంది దిగులుగా మోహీని.
"అది కేవలం నీ భ్రమ కొన్ని రోజులకి నువ్వు తల్లివ్తేతే జీవితం వల్ల నికే మమకారం కలుగుతుంది. ఆ బిడ్డని పెంచి పెద్ద చెయ్యాలని ఉన్నతుడ్ని చేయ్యలనీ ఇలా...ఎన్నో...అప్పడి రాబర్టు నీకసలు గుర్తుకూడా వుండక పోవచ్చు మోహీనీ"
"అంతేనా రాబర్టు నువ్వు తెలుసుకోంది. నా బిడ్డకి తండ్రిగా నీ స్ధానం నీకేప్పడూ వుంటుంది.
"ఏమో అప్పటివరకూ నేనంటూ వుండాలిగా?" అన్నాడు.
"రాబర్టు !" అంది మోహినీ ఆందోళనగా.
ప్లేటులో చెయ్యి కడిగేసి అతని వెనకే నడిచింది ఆమె.
రాబర్టు సిగరెట్ వెలిగించి పోగని గాలిలోకి వదిలాడు.
"మోహినీ, శృతితప్పిన వీణ అపశృతినే పలికుతుంది. నేను దారితప్పిన మనిషిని, సర్తేన దారిని వెదికి గమ్యానికి పోవాలన్నా ఆ దారినెప్పుడో పోగొట్టుకున్నాను నేను నీతి నియమాలని మరిచిపోయిన మొరటువాడ్ని. 'నాది' అనుకున్న నా బతుకుని, జీనితాన్ని జీవన సర్వస్వాన్నీ నాశనం చేసిన వాళ్ళ మీద కక్ష సాధించడానికే నేను బతికున్నాను. నేనేం చేస్తున్నా నా ప్రేయసి అర్జునని చంపినా హంతకుల గురించీ మరిచిపోను మోహినీ ఏదో ఒక రోజు వాళ్ళ అంతం చూసి కానీ నేను చావను.
మోహినీ దీనంగా అడిగింది.
"వాళ్ళని చంపి నువ్వు సాధించేదేమిటి?"
"పగ"
"పగకోసం నీ జీవితాన్ని బలిచేస్తావా?"
"నా జీవితం ఎప్పుడో నాశనం అయింది."
"అలాని నువ్వనుకుంటున్నావ్"
"రాబర్టు నువ్వు దోషివీకాదని నిరూపించి నిన్ను దక్కించుకుంటాను" అంది మోహిని దృడంగా.
రాబర్టు పకపకమని నవ్వేశాడు.
నేను నిర్దోషినని చెప్పడానికి కావల్నిన ప్రత్యక్ష సాక్షికూడా వుంది మోహిన, కానీ నేను అర్జునప్తెన ప్రమాణంచేశాను. అర్జునని దారుణంగా హింసించి చంపినా ఆ దుర్మార్గులని అంతకంతగా చిత్రవధ చేసి చంపాలి అప్పడే నాకు కొంత విముక్తి"
అతని మాటలకి మోహిని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
రాబర్టు మెల్లగా ఆమె తలపైన ప్రేమగా నిమిరాడు.
"మైహీనీ"
మోహేనీ మెల్లగా తలెత్తి అతనిమొహంలోకి దినంగా చూసింది.
ఆ కళ్ళలో అతనిపట్ల ఆమెకి గల ఆరాధన ఎలాంటిదో కళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.
రాబర్టు కిటికీ దగ్గరగా నడిచాడు. మోహిని సోఫాలో కూర్చుమంది.
సిగరెట్ ప్తెన సిగరెట్ కాలుస్తూ అక్కడే పది నిముషాలు నిలబడిపోయాడు కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ.
మోహీనీ అనుకున్నంత తెలివ్తేందికాదు ఒట్టి అమాయకురాలు అనుకున్నాడు రాబర్టు.
మోహినీని అలా సోఫాదగ్గర వదిలి అతనలా కిటికీ దగ్గర కెళ్ళడం ఎంతో పొరపాటు చేశాడు.
రాబర్టు వెనక్కి వచ్చి టీపాయ్ ప్తెన తెల్లకాగితాన్ని దానిమీద వున్న ఎర్రని అక్షరాలనీ టీపాయ్ ప్తెన మోహినీ కట్టుకున్న తెల్లచీర ప్తెన రక్తపు మరకలని చూసి స్ధంభించిపోయాడు.
"రాబర్ట్ ఐ లవ్ యూ"
మోహినీ బ్లేడుతో చేతివేలుని కొసకొని రక్తంతో ఆ కాగితం పైన రాసింది పెద్ద అక్షరాలతో.
రాబర్టు అది చూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. వాష్ బేసిన్ దగ్గర కర్చిఫ్ నీ తడిపి తీసుకొచ్చి ఆమె చేతివేలికి చుట్టి"
"ఏమిటి పిచ్చిపని!" అన్నాడు మందలింపుగా.
మోహినీ వింతగా నవ్వింది.
"ఈ మాత్రానికే అంత కంగారుపడ్డావ్ రాబర్టు. ఈ బ్లేడు తో అసలు నా పీకనే కోసేసుకోవాలనుకున్నాను."
