Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 50


    "నాకు పిచ్చి లేచింది. ఇద్దరి పరిస్థితి అదే అయితే ప్రసార సమాప్తి అవుతుంది."

    ఆమె పాదం పైన పాదంతో రాసి మెల్లగా పావడాని కాళ్ళపైకి జరపడం మొదలు పెట్టాడు.

    ఆమె కాలి పిక్కలు నున్నగా బలంగా తగులుతున్నాయి అతనికి.

    కిందనుంచి చేతిని పోనిచ్చి కాలిపిక్కని వత్తుతూ

    "నీ ఒళ్ళు బంగారంతో చేసినట్టుంది" అన్నాడు.

    "లేకపోతే సలిమిడితో చేసిందనుకున్నావా"

    చేయి తొడపైన పడింది.

    ఒక్కసారి ఒళ్ళు జలదరించినట్టయింది.

    "ఏమిటీ పిచ్చిపనులు" అంది.

    "పిచ్చివాడ్ని చేసి పిచ్చి పనులంటే ఎలా తల్లీ నాకు పూర్తిగా పిచ్చిలేస్తోంది" అన్నాడు పరుశురాం.

    "లేస్తే ఇలా చేయాలా" కోపంగా అంది రాణి.

    "ఆడించాలి. లేకపోతే నిద్రపట్టదు. ఆట మొదలు పెడదామా."

    ఆమె పొట్టని సరదాగా రాస్తూ అడిగాడు.

    ఆమె అతని చేతిని విసిరికొట్టింది.

    "ఏయ్ నేనేమన్నా నీకు మేనత్తకూతుర్ని అనుకున్నావా లేక నీ పెళ్ళాన్ననుకున్నావా వూరికే తడిమేస్తున్నావు. చెయ్యి విరిగిపోతుంది"

    "ఏం విరిగినా నీ నడుం విరక్కుండా చూసుకో! నేనసలే బండవాడిని."

    "అరుస్తాను"

    "అరువు నీ పరువే పోద్ది. ఈ బస్తీలో వుండాల్సిన దానివి. నాకే నేను నా దారిన పోతాను."

    "నిన్ను చిత్రీ పట్టించేస్తాను" ఉక్రోషంగా అంది రాణి.

    పరుశురాం ఆమె ముక్కుని అటూ ఇటూ ఆడించాడు.

    "సాన పెడతావో చిత్రీ పడతావో నీ ఇష్టం. నిన్ను మాత్రం విడిచి పెట్టను. తెల్లార్లూ నిన్ను వాటేసుకుని పడుకుంటాను. నేను కన్నయ్య ఇక్కడ పడుకుంటానని అందరికీ తెలుసు. నువ్వే నా పక్కలోకి వచ్చి పడుకున్నావని చెప్తే జనం నమ్ముతారు చూస్తాను. ఆఖరుకి మనం ఏదో చేసుకుని వుంటామని అనుకుంటారు. నువ్వేం చేస్తావో ఎలా వెళతావో నీ యిష్టం."

    ఆమె నడుం చుట్టూ చేయివేసి ఓ కాలుని ఆమె మీద వేశాడు.

    తను యిరుక్కుపోయినట్టు అర్ధమయింది రాణికి.

    అతని ముక్కుని కొరికేసింది.

    పరుశురాం నవ్వాడు.

    "నీ యిష్టమొచ్చిన చోట కొరుక్కో."

    "మీద నుంచి కాలు తియ్. దున్నపోతు కాలేసినట్టుగా వుంది."

    "అయితే దున్నపోతు పక్కలో కూడా దూరావన్న మాట."

    "నీ పళ్ళు పీకేస్తాను" కసిగా అంది రాణి.

    "ఇందాకటినుంచి నా ఛాతిపైన వెంట్రుకల్ని, మీసాలని పట్టి పీకావు. పీక్కోగలిగితే పీక్కో."

    ఇంకొంచెం దగ్గరగా వచ్చాడామెకు.

    ఉడుంపట్టులా వుంది అతని పట్టు.

    "నన్ను వదిలెయ్యవా?" అడిగింది బుజ్జగించుతున్నట్లుగా.

    "నోటి దగ్గర పెగ్గునీ, పక్కలోకొచ్చిన ఆడదాన్ని విడిచి పెట్టద్దని నా గురువుగారు చెప్పారు" అంటూ ఆమెను గుండెకి అదుముకుంటూ దుప్పటిని సరిచేశాడు.

    "తెల్లార్లూ ఈ భరతం తప్పదా?"

    "తప్పదు"

    "నాకేం తగలకూడదు"

    "కలిసి పడుకున్నాక తప్పదు"

    "అమ్మా ఎవరన్నా చూస్తారు. దుప్పటి సరిగ్గా కప్పు" తన మీదకు దుప్పటిని గుంజుకుంది రాణి.

    పరుశురాం నవ్వుకున్నాడు.

    చేతుల్ని పిరుదులమీద వేసి చివర రాస్తూ.

    "ఎలా వుంది నా దెబ్బ" అడిగాడు.

    "కోడికూర పెట్టి తెచ్చుకున్నాను" నిష్టూరంగా అంది రాణి.

    "నేనడిగింది నా దెబ్బ గురించి"

    అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది రాణి. అతను నవ్వుతూ చూస్తున్నాడు. చటుక్కున అతని పెదవుల్ని అందుకుని కొరికేసింది రాణి.

    "అబ్బా"

    "ఇదెలా వుంది" అడిగింది.

    పరుశురాం ఆమె పావడాని పైకి జరిపేసి తొడపైన చేయి వేసి వత్తాడు.

    అప్పుడు తేరుకుందామె.

    అతని చేతిని గబుక్కున పట్టుకుని "అలాంటివి చేయకూడదు పాపం" అంది.

    "ఎవరు చెప్పారు పాపమని. పుణ్యనదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది"

    "అంటే నేనేమన్నా గంగానదిలా వున్నానా?"

    అతను తన తలతో ఢీ కొట్టాడు ఆమె నుదురుకు.

    "నువ్వింకా పిల్లకాలువ్వే."

    "ఇక నే వెడతానబ్బా...." అంది రాణి.

    అతని గెడ్డాన్ని పుచ్చుకుని బ్రతిమిలాడుతూ.

    "వీల్లేదు. తెల్లారేలోగా నా కౌగిలినుంచి తప్పించుకుని వెళ్ళు. నువ్వు బాకీవున్న సొమ్మును వదిలేస్తాను. లేకపోతే రెట్టింపు సొమ్ము నాకియ్యాలి. బస్తీమే సవాల్" అన్నాడు పరుశురాం.

    రాణి నవ్వుకుంది.

    "సవాల్ బస్తీమే సవాల్" అంటూ అతని భుజంపైన చెయ్యివేసి గుండెల్ని అతని ముఖానికి తాకించింది.

    రాణీ చేయి చురుగ్గా కదులుతోంది. ఆమే ఏం చేస్తున్నా పరుశురాం గమనించేలోగా.... (ఎడిట్)

    పరుశురాం ఉలిక్కిపడ్డాడు. కంగారుగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని. "ఏయ్ రాక్షసీ! వదులు" అన్నాడు. రాణీ అతన్ని విడిచిపెట్టలేదు. రాణీ నవ్వుతూ అంది విజయగర్వంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS