"దెయ్యాలు మనలాంటివాళ్ళ జోలికి రావన్నా! మనం అప్పు అడుగుతామని వాటికి భయం."
"అలాని నీకెవరు చెప్పార్రా?"
"మా షెడ్డులో పనిచేసే రాజేశ్వరాచారి. అతను కనబడిన వాళ్ళందర్నీ అప్పు అడుగుతుంటాడు. ఇలాగే దెయ్యం మాటవస్తే మా ఓనరన్నాడు. మన రాజేశ్వరాచారికి దెయ్యం కనిపిస్తే అప్పు అడుగుతాడని. అప్పుడతడన్నాడు అందుకే దెయ్యాలు నాకు కనబడనవని."
పరుశురాం నవ్వుతుంటే కన్నయ్య అన్నాడు.
"పొద్దునే లేవాలని నేను పడుకుంటా!" అన్నాడు.
పరుశురాం చుట్టూ చూసి పడుకుని దుప్పటి కప్పుకున్నాడు.
చల్లగాలికి అతనికి కూడా వెంటనే నిద్రపట్టేసింది.
ఎంతసేపయిందోగాని మధ్యలో ఉలిక్కిపడి కళ్ళు తెరచి చూశాడు పరుశురాం. తన పక్కలో ఎవరో వున్నారు.
చేత్తో తడిమాడు.
మెత్తగా తగులుతోంది ఒళ్ళు.
చేతికి శరీరం తగిలిన తీరునిబట్టి ఆడమనిషి అయుండాలి అనుకున్నాడు పరుశురాం.
"బస్తీ మే సవాల్" అతని చెవిలో గుసగుసగా వినబడింది.
"ఏయ్ ఏమిటది?" కోపంగా లేవబోయాడు.
"ముందులే" అన్నాడు.
"ష్ గట్టిగా మాట్లాడకు. బస్తీ జనం చూస్తే నీకు గుండుకొట్టి సున్నం వేస్తారు."
"ఇలా మగాడి పక్కలోకి వచ్చి పడుకోడానికి సిగ్గులేదు నీకు?"
రాణి కసిక్కున అతని చెవిని కొరికింది.
"ఏ నీ పక్కలో పడుకోకూడదా? అయినా ఆడపిల్లే మగాడి పక్కలో పడుకోకపోతే అమ్మమ్మ పక్కలో పడుకుంటుందనుకున్నావా? సరసం కూడా తెలీదు పిచ్చితండ్రికి."
"నీ మొహం ఇక్కడినుంచి పోతావా పోవా?" కసిరాడు.
రాణి అతని మొహంలో మొహంపెట్టి తన పాదంతో అతని పాదాన్ని రాస్తూ మోకాలివరకు పాదాన్ని పాకించింది.
ఆమె ఊపిరి వెచ్చగా అతని మొహానికి తగులుతోంది.
తన ఒంట్లో ఏదో మార్పు రావడాన్ని పరుశురాం గమనించాడు.
"నేను గట్టిగా అరిచానంటే నీకు బడితపూజ తప్పదు. చేయించుకుంటావా?" అతన్ని పట్టుకుంది.
తనని ఏడిపించటానికి పంతానికి ఆమె వచ్చిందని పరుశురాంకి తెలుసు. ఆమెని ఎదురుదెబ్బ తీయడానికి సమాయత్తమయ్యాడు.
"అవసరంలేదు. నేనే నీకు చేస్తా" అన్నాడు.
"ఏం చేస్తావ్" ముద్దుగా అడిగింది అతని జుత్తులోకి చేతివేళ్ళని పోనిచ్చి తలతో అతని తలని ఢీకొడుతూ.
"చెయ్యాల్సిందే చేస్తాను."
"ఊ అబ్బ కొంచెం దగ్గరగా జరుగు. ఎవరన్నా చూస్తే ఇద్దరం కనబడిపోతాం." అతనికి మరింత దగ్గరగా తనే జరిగింది రాణి.
అతని వంటికి ఆమె గుండెలు మెత్తగా తగులుతున్నాయి.
పక్కకి తిరగబోయాడు.
"అతని భుజంపైన చెయ్యివేసి అతని ప్రయత్నాన్ని ఆ...."
"ఏమిటాడపిల్లలా గిలగిలలాడిపోతావు."
"బస్తీమే సవాల్!"
"ఇప్పుడు బంతి నా దగ్గరుంది. సొమ్ముకావాలా నాయనా సొమ్ము ఇస్తానుండు."
అతని ఛాతిపైన వెంట్రుకల్ని పట్టుకుని లాగడం మొదలు పెట్టింది.
చురచురలాడుతోంది అతనికి.
"నువ్వేం చేసినా సొమ్ముని మాత్రం వసూలు చేస్తాను" అన్నాడు.
ఆమె నవ్వింది.
"సొమ్ము ఇద్దామనే వచ్చాను. చేతనైతే తీసుకుపో" అతని మీసాన్ని పట్టుకుంది.
"ఇదా సమయం" అన్నాడు.
"ఇలాంటప్పుడు కాకపోతే ఎలా వసూలు చేసుకోగలవు. కోటా వసూలుకి ఛాన్స్ ఇచ్చాను. నీ ఓపిక మరి."
"కోటా ఏమిటి?" ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు.
"వెయ్యి ముద్దులు అని చెప్పావుగా నీ ఓపిక చూద్దామని బాకీ తీర్చాలని వచ్చాను. కానీ ఓ కండిషన్ కూడా వుంది" అంది రాణి.
"ఏమిటి" అడిగాడు.
"లెక్క ఎక్కడ తప్పితే అక్కడ్నించి మళ్ళీ లెక్క ప్రారంభమవుతుంది."
"అదెలా...."
"ఏ ఇచ్చేదానికి ఓపికున్నప్పుడు పుచ్చుకోవడానికి నీకు లేకపోతే నువ్వేం మగాడివి, వడ్డీతో సహా వసూలు చేసుకో చాతనయితే" తన మోచేతితో అతని తొడపైన గట్టిగా నొక్కింది రాణి.
రాణి నడుంమీద చేయివేసి గబుక్కున దగ్గరికి లాక్కున్నాడు.
అలాంటి చర్యకి ఆమె ఉలిక్కిపడింది. తేరుకుని అంది.
"ఏయ్ ఏదో తగులుతోంది."
"మగాడి పక్కలో దూరితే ఏదో ఒకటి తగలకుండా వుంటుందా?"
"ఛీ....!"
"ఇంతవరకూ వచ్చాక ఇంకా ఛాఛా ఛీఛీ లుండవు. చేతిని ఆమె నడుం మీదనుంచి గుండెల మీదకి పాకించబోయాడు పరుశురామ్.
"అక్కడ బాంబులున్నాయి జాగ్రత్త" చిరుకోపంతో అంది.
ఆమె చెంపలకి చెంపని ఆనించి రుద్దుకుంటూ అన్నాడు.
"నాకేం భయం లేదు.
బాంబులతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు చేత్తో తడుముతూ.