Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 49

 

    భోజనాల తర్వాత తన సంచిలోని బట్టలు కొన్ని బయటకు తీసాడు బ్రహ్మచారి. కొత్త బనియన్లు కొన్ని, చారల డ్రాయరులు కొన్ని, పూసల ఆభరణాలు కొన్ని.
    అవి ఆ లంబాడీ కుటుంబానికి ఇచ్చాడు బ్రహ్మచారి.
    దానికే ఉప్పొంగిపోయాడు లంబాడీ. వాటిని చేతుల్లో పట్టుకుని తండా అంతా తిరిగి ప్రతి గుడిసెలోకి వెళ్ళి "దొర నాకోసం తెచ్చాడు" అని సంతోషంగా ప్రతి వాళ్ళకీ చెప్పాడు.
    ఆ తర్వాత పడుకున్నాడు అందరూ.
    లంబాడీ అతనూ, అతని భార్యా వాళ్ళకి అటువైపూ ఇటువైపూ నిలబడి, వాళ్ళు నిద్రపోయేదాకా విసనకర్రలతో విసిరారు.
    అలా గడిచిపోయాయి మూడు వారాలు.
    "ఇంకా సేపట్లో చెంచుమనిషి వస్తాడు. వాళ్ళ గూడెం లో ఒక్క పూటన్నా ఉండకపోతే అతను మనలని వదలడనుకుంటాను" అన్నాడు బ్రహ్మచారి.
    ఆలోచనల్లోంచి బయటపడ్డాడు ఉదయార్కర్. తల ఊపి, "అవునవును" అన్నాడు.
    సరిగ్గా అరగంట తర్వాత వచ్చాడు చెంచుమనిషి. వస్తూ ఈ తండా లో వాళ్ళ కోసం పుట్టతేనే, వెదురు బియ్యం, దుప్పికొమ్ములూ లాంటి కానుకలూ తీసుకొచ్చాడు.
    తండా అందరికీ వీడ్కోలు చెప్పారు బ్రహ్మచారి బృందం.
    వాళ్ళు వెళ్ళిపోతుంటే , చాలా సేపు తదేకంగా అటువైపే చూస్తూ ఉండిపోయింది తేజోది.
    తండా పొలిమేరదాకా తోడు వచ్చి అక్కడ శెలవు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు లంబాడీ.
    బ్రహ్మచారి బృందం ముందుకు సాగింది. చెంచుమనిషి దారి తీస్తున్నాడు.
    కొద్దిగా కుంటుతూ నడుస్తున్నాడు ఉదయార్కర్.
    కొంత దూరం తర్వాత మలుపు తిరిగింది దారి.
    అక్కడ కనబడింది ఒక శిధిల మందిరం.
    "ఇది చూశావా?" అన్నాడు బ్రహ్మచారి ఉదయార్కర్ తో. అతని గొంతులో ఎగ్జయిట్ మెంట్ వినబడుతోంది.
    "ఏమిటది?" అన్నాడు ఉదయార్కర్.
    "ఈదల రంగాభుపతి కట్టించిన మందిరం ఇది."
    "ఈదల రంగభూపతా? అయన ఎవరు?"
    "రాయలవారికి ఒక సామంత రాజు. ఉదయార్కర్ గుడికట్ల గ్రంధం అని ఒకటి ఉందని నేను నీకు చెప్పాను గుర్తుందా?"
    "గుడికట్ల గ్రంధమంటే , సామంత రాజులూ, రాయలవారికి కప్పం కట్టడానికి రావడం, ఖజానాలో ఖాళీ లేకపోతే దారిలోనే గుడో గోపరమో కట్టి దానిలా ఆ కప్పాన్ని దాచడం - ఆ వివరాలన్నీ రాసి ఉన్న పుస్తకమెగా గుడికట్ల గ్రంధమంటే!"
    "అదే! దానిలోని ఒక సత్రం నాకు దొరికింది. ఇదివరకు ఒకసారి.
    ఆసక్తిగా ముందుకు వంగాడు ఉదయార్కర్.
    "ఏమని రాసి వుంది దానిలో?"
    "ఈదల రంగభూపతి తాలుకూ కుప్పం" అని వుంది.
    ఆ కింద,
    'నలబై ముత్య.........
    నలభై రత్న.......
    నలభై లక్ష్మి పూజ........'అని రాసి ఉంది. ఆ కప్పాన్ని ఎక్కడ డాచారో వివరాలు ఉన్నాయి. శీశైలం అడవుల్లో ఒక మందిరం కట్టి అందులో ఈ కప్పాన్ని ఉంచాడు ఈదం రంగభూపతి.
    ఆ మందిరం ఇదే? అన్నాడు బ్రహ్మచారి డ్రమెటిక్ గా.
    "ఇప్పుడు ఇంకా ఆనిది ఇక్కడే వుందా?" అన్నాడు ఉదయార్కర్ ఉత్సుకతతో.
    బ్రహ్మచారి నవ్వాడు.
    "లేదు. నేను త్రవ్వి తెసుకున్న మొదటి నిధి అదే. ఆ పత్రం లోని వివరాల ప్రకారం ఇక్కడికి వచ్చాను నేను. అప్పటికే ఈ మందిరం శిధిలమై పడిపోయి ఉంది.
    అదృష్టవశాత్తు ఆ శిధిలాలలో నుంచి కొద్దిగా బయటికి కనబడుతోంది ఒక రాగి రేకు. దాని మీదా అవే వివరాలు ఉన్నాయి.
    'నలబై ముత్య.........
    నలభై రత్న.......
    నలభై లక్ష్మి పూజ........'అని"
    "లక్ష్మి పూజ అంటే?" అన్నాడు ఉదయార్కర్.
    "పూజ అంటే ముద్ర అన్నమాట. బంగారు కాసులు అని. ఆ వివరాల ప్రకారమే ఇక్కడ తవ్వాను."
    "దొరికాయా?"
    "దొరికాయి. ఒక పాత్రలో పెట్టి ఉన్నాయి అవన్నీ. తీసుకున్నాను, అంటే, ఈదం రంగభూపతి కట్టిన కప్పం రాయలవారికి చెందలేదు. నాకు చెందిదన్నమాట!" అని నవ్వాడు బ్రహ్మచారి. "నాద్వారా ప్రజలకు చెందింది."
    శిధిల మందిరం వెనకబడిపోయింది. పరిసరాలను పరిశేలంగా చూసి, "ఏనుగుల లోయ దగ్గరికి వచ్చాం.:" అన్నాడు బ్రహ్మచారి. తర్వాత చెంచు అతని వైపు తిరిగి -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS