మోహిని అదోలా నవ్వింది.
"రాబర్ట్ నేను ప్రేమించి ఓడిపోయిన అభాగ్యురాలిని. ఆడదాని అవసరం తీరేవరకే మగాడు తియ్యని కథలు చెప్తాడన్న నిజాన్ని నేను శశిభూషణ్ వల్ల తెలుసుకున్నాను కానీ నా కుటుంబ పరిస్దితులకి తలొంచి సాంబశివంగార్ని పెళ్ళి చేసుకొన్నాను" మోహినీ రెండు క్షణాలు ఆగింది. గాజుప్లాస్క్ లోంచి గాసులోకి నీళ్ళు ఒంపుకుని తాగుతుంటే ఆమె తెల్లని కంఠం అందంగా కనబడుతోంది.
మోహినీ తిరిగి రాబర్టుకేసి చూసింది ఆమె కళ్ళలోని నీరు తళ తళమని మెరిసింది.
"దేవుడున్నాడో లేడో నాకు తెలీదు. నేనేం పాపం చేశానో నాకు అంతకంటే తెలీదు. ఈ జన్మంతా కోరికలకో పిచ్చెక్కి చచ్చిపోయేలా చేశాడు సాంబశివంగారు పెళ్ళికి ముందే మా వాళ్ళకి చెప్పారని నీకిది వరకే చెప్పాను కానీ వాళ్ళ స్వార్ధంకోసం ఆయన నా మెళ్ళో మూడు ముళ్ళు వేయింఛీ ఆ రోజునే నన్ను చంపేరు"
మోహినీ ఏడుస్తోంది.
రాబర్టు జాలిగా చూశాడామేని. సిగరెట్ వెలిగించి మోహినీ చెప్పే మాటల్ని వింటున్నాడు.
"రాబర్టు పెళ్ళయ్యాక ఆయన నాకేం చెప్పారో తెలుసా?"
రాబర్టు కాళ్ళతోనే చెప్పాడు తెలీదని.
"మోహినీ నిన్ను నేను అన్యాయం చేశానని నాకు తెలుసు అందుకే నీకోమాట చెప్పదల్చుకున్నాను. బహుశా ఏ భర్త ఏ భార్యకీ ఇలా చెప్పడు. కానీ నేను చెపుతున్నాను. ఎందుకో తెలుసా?" సాంబశివం ఆగేడు..
"తెలీదు" అంది మోహిని.
"కోరికనేది మనిషిని బానినచేసి ఆడిస్తుంది. ఆస్తీ అంతస్తు కావల్సినన్ని భోగభాగ్యాలున్నా నా భార్యా మానసికంగా చచ్చిపోకూడదు. అందుకే నీ ఇష్టాలకి నేనేరోజునా అడ్డురాను. నా పరువు ప్రతిష్టలు రోడ్డెక్కకుండా నువ్వేంచేసినా నాకిష్టమే."
మోహిని కన్నీళ్ళలో భర్త కేసి చూసింది.
సాంబశివం భార్యకేసి జాలిగా చూశాడు.
షివాస్ రీగల్ విస్కీని గ్లాసులో పోసుకొని మేల్లగ్ సిప్ చేస్తున్నాడు సాంబశివం అతని చేతిలో సిగరెట్ పొగలు కక్కతోంది.
మోహీనీ, ఏడుస్తున్నావా? నా మొహం నీకు చూసించాలంటేనే బాధగా వుంటోంది. అయాం గిల్టీ మోహీనీ మా తాత ముత్తాతల దగ్గర్నుంచి కూడా మా వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలున్నాయి. నా దుర దృష్టం ఏమిటో నా దగ్గర కొచ్చేసరికి ఒంటరివాడిన్తే పోయాను నేను చచ్చిపోతే ఇక్కడితో నా వంశం అంతరించి పోతుంది. మోహిని" ఉద్వేగంగా అంటున్నాడు సాంబశివం.
"మీరలా బాధపడకండి" అంది వెక్కిళ్ళ మధ్య మోహిని.
"నా కోసం నువ్వో పని చేస్తావా?" అడిగాడు సాంబశివం.
"చెప్పండి"
"నువ్వో బిడ్డని కనాలి"
అతని మాటలకి ఉలిక్కిపడింది మోహిని.
"ఏమిటి మీరనేది?"
"ఆ వేశపడకు మోహినీ దయచేసి నన్ను అర్ధం చేసుకో. నా వంశం నిలబడాలంటే నువ్వో బిడ్డని కనాలి. నీ ఇష్టమ్తెన వ్యక్తితో నీ ఇష్టం.... నేనడ్డు చెప్పను. నువ్వు నా భార్యని. నీ బిడ్డకి తండ్రిని నేనే అంతే" అన్నాడు.
మోహినీ వెక్కి వెక్కి ఏడుస్తూ వుండిపోయింది.
__అదీ రాబర్టు నా భర్త ఉత్తముడు అతను నాకు అడ్డురాక పోయినా అతనే నన్ను ప్రోత్సహించినా నేనతని భార్యనని తెలిసి మరో మగాడితో తప్పు చెయ్యాలనిపించ లేదు. మగవాడిని ఒక్కసారి చనునిస్తేవాడు ఆడదాన్ని ఓ ఆటబొమ్మగా చేసి ఆడిస్తాడు. అందునా ఈ ఎస్టేట్ లో విషయాలు తెలిస్త్గే ఈ ఆస్తి కోసం ఎలాంటి ద్రోహమ్తెనా తల పెట్టవచ్చు. అందుకే అయన మాటల్ని నేను అంతగా పట్టించుకోలేదా రోజు. నాతో మాట్లాడాలన్నా నన్ను చూడాలన్నా పూర్తిగా గీల్టిగా ఫీలవుతూ ఆయన తాగుడికి బానిసయిపోయారు. శశిభూషణ్ ప్తెన కసి నా గుండెల్లో మంటలు రేపుతుంటే, ఇన్ని రోజులూ భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోలేదు కానీ ఈ మధ్య ఆయనకీ ఆరోగ్యం బాగోక పోవడంతో - ఆయన కోరిక పెకారం ఓ బిడ్డని కనాలన్నా ఆశ నాలోనూ కలిగింది కానీ ఎలా? అనుకోకుండా నువ్వు తారసపడ్డావు. మాటల్లో నీ వ్యక్తిత్వాన్ని తెలుసు కొన్నాను. నీకు గుర్తుందా ?"
"ఏమిటి?"
"నా భర్తని చంపేస్తే మనం హాయిగా వుండచ్చు అని అడిగాను గుర్తుందా?
"ఆ"
"అలా ఎందుకడిగానో తెలుసా?"
"తెలీదు"
"నువ్వెలాంటి వాడివో తెలుసుకోవాలని. అందుకు నువ్వు నిరాకరించావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. రాబర్ట్ ఇప్పుడు నేను బతుకుతోంది నీ కోసం . నీ రూపం నా కడుపులో పెరుగుతోంది" అంది మోహీని"
"రాబర్టు కళ్ళలో ఓ వెలుగు కొట్టొచ్చినట్టుగా కనబడింది."
తన వల్ల మోహినీ తల్లి కాబోతుందన్న సంగతి విన్న ఆ క్షణంలో అతని గుండెలప్తెన పూలవాన కురిసినట్లయింది.
రాబర్టు పరిస్ధితుల ప్రభావానికి లోబడి నువ్వో వేరస్దుడిగా చట్టం భావిస్తున్నా. నిన్నో దేవుడిగా ఈ మోహినీ కోలుస్తోంది. ఆడదాని కెన్ని సుఖసంతోషాలు వున్నా సంతానం కోసం పరితపిస్తుంది. ఆ కోరిక ఈ జీవితంలో తిరుతుందనుకోలేదు రాబర్టు ఏ బిడ్డ్డకీ ఈ ప్రపంచంలో ఇద్దరు తండ్రుల ఆదరణ లభించదు. కానీ నా బిడ్డ అదృష్ట వంతుడు రాబర్టు. ప్రాణన్నిచ్చిన తండ్రిని నువ్వైతే గుండెల్లో పెట్టుకొని భోగ భాగ్యాలని అందించడానికి సిద్డంగావున్న మరో తండ్రి ఆయన వున్నారు" అన్నాది మోహిని.
