Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 49

 

    అలాగే ఆమె వస్తోందని గ్రహించాడు టీ కొట్టు ఆసామీ! మాటలు ఆపేసి అతడు ఆమె వంక చూడటం ప్రారంభించగానే నైట్ వాచ్ మెన్ లు ఇద్దరూ తలలు త్రిప్పి చూశారు.
    అప్పటికే ప్రొఫెసర్ శ్రద్దాదేవి వారిని సమీపించింది.
    "బాబూ! మ్యూజియంలో అసిస్టెంట్ క్యూరేటర్ గా ఉన్న జయకృష్ణ ఉండే దేక్కడో నీవు చెప్పగలవా?" అని అడిగింది. జయకృష్ణ పేరు వినగానే టీ కొట్టు నడుపుతున్న ఆసామి చేతిలోని టీ గ్లాసు జారి నేల మీదికి పడిపోయింది.
    గ్లాసు పగిలి భళ్ళున శబ్దమయింది.
    అతడు తన కలవరపాటుని దాచుకుంటూ "నేరా పోయి కుడి ప్రక్కకు తిరుంబు" అన్నాడు తమిళయాసతో.
    అర్ధం కానట్టు చూసింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "అట్టా చూస్తారేమి అమ్మా! నేరా పోయి కుడిప్రక్క తిరుంబు ఈ రోడ్డే పోయా పూలమొక్క అది అల్లా వుండున్! ఆ నర్శరీస్ దవచ్చు. అక్కడ తిరుంబు . అయిదా పదియిల్లె అయ్యవారిది" అంటూ మరింత వివరంగా చెప్పాడు టీ కొట్టు ఆసామీ!
    "థాంక్స్" అని చెప్పేసి ఆ యింటికి వెళ్ళేందుకు బయలుదేరింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె అలా తిరిగి వెళ్ళిపోగానే పగిలి పోయిన టీ గ్లాసు పెంకుల్ని ఏరుకోవటం ప్రారంభించాడు.
    నిర్జనమయిన పరిసరాలలో తారు రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ వచ్చింది ప్రొఫెసర్ శ్రద్దదేవి. నర్సరీస్ ఇంకా అల్లంత దూరం వున్నదనగానే కుడిచేతి వైపు రోడ్డు కన్పించింది. ఆ రోడ్డుకి రెండు వైపులా ఎ.యి టైపు క్వార్టర్స్ కన్పించినాయి.
    ఇళ్ళ ముందు పూలమొక్కలు ఎత్తుగా ఒత్తుగా పెరిగి కన్పించాయి. నందివర్ధనాలు వృక్షాల వలె ఎదిగినాయి. గన్నేరు మొక్కలు కరెంటు తీగల్ని తాకెంటంత ఎత్తు పెరిగాయి. వాటివంక ఆశ్చర్యంతో చూస్తూ చెట్ల గుబుర్ల మధ్య ఒదిగిపోయి , అన్నీ ఒకేతరహగా వున్న ఇళ్ళను గమనిస్తూ ముందుకు సాగిందామె.
    అయిదవ యింటి దగ్గరకు వెళ్ళి ఆగింది. లోపల దీపాలు వెలుగు తున్నాయి. ప్రక్క యిళ్ళలోంచి పడక దీపాల గ్రుడ్డి వెలుతురు మాత్రమే కన్పిస్తోంది. కాని జయకృష్ణ యింటిలో దీపాలు అన్నీ వెలుగు చున్నాయి. గేటు దగ్గరగా లాగి వుంది. చెయ్యి వేస్తె అది తెరచుకో లేదు. పరిశీలించగా బయట వైపు గడియ బిగించి కన్పించింది. దాన్ని తీపి పూల మొక్కల మధ్యకు వెళ్ళింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. లోపల మనుషులు ఉన్న జాడ కన్పించలేదు.
    ఆశ్చర్యంతో మరి రెండు అడుగులు వేసి వరండాలోకి వచ్చిందామె. అక్కడ రక్తపు మరకలు కన్పించాయి. గుండెలు దడదడ లాడగా లోపలి గదుల్లోకి వెళ్ళిందామె.
    ఇల్లంతా ఎక్కడ చూసినా రక్తపు మరకలే.
    జయకృష్ణ లేడు. జ్యోతి లేదు. ఉన్నకొద్ది సామాను ఇల్లంతా చిందరవందరగా పడి ఉంది. పైన సీలింగ్ ఫాన్ తిరుగుతోంది. ఆ గాలికి రక్తపు మరకలు అరి గడ్డ కట్టినాయి.
    భయంతో, అనుమానంతో బిగుసుకు పోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఎక్కడో దూరంగా చెట్ల గుబుర్లలోంచి కబోది పక్షులు ఏడవటం విన్పిస్తోంది.
    పిచ్చేత్తిన దానిలా బయటకు పరుగు తీసిందామే. ఎక్కడకు పోవాలో తెలియని పరుగు! గిరిశిఖరాల మధ్య ఒదిగి వున్నా అనంత తిమిరరాసిలోకి----!


                               16


    ఆమె ఆ యింటిలోకి వెళ్ళటం తిరిగి కొద్ది సేపటికే భయవిహ్వలంగా బయటకు రావటం ఒక వ్యక్తీ గమనించాడు. నర్సరీస్ బయట మప్లర్ తలకు చుట్టుకుని బీడీ కాల్చుకుంటున్న వాచ్ మన్ అతడు.
    అనుమానాస్పదమయిన స్థితిలో వయస్కురాలయిన ఒక అ=వనిత అలా రావటం అతనికి సంశయాన్ని రేకెత్తించింది. వెంటనే ఆమెను అనుసరించాడు.
    ఆ చోటుకు ఈశాన్యంగా రామాలయమూ, నైరుతి దిక్కున అర్కెలాజికల్ డిపార్ట్ మెంటు ఉద్యోగుల ఇళ్ళూ ఉన్నాయి. నైరుతి దిక్కుగా కొంతదూరం పోయాక మనసుని నిలువరించుకుని ఆగిపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఊహించినదానికి పూర్తిగా వ్యతిరేకమయిన దుస్థితిలో రక్తం నిండిన ఇంటిని చూసినందువల్ల కలిగిన కంగారుని రవంత సంభాళించుకుంది.
    తానిప్పుడు ఏమి చేయాలి? ఎక్కడకు వెళ్ళాలి? అన్న ఆలోచనలు మనసులోంచి పైకి తేలాయి.
    అంతలో నర్సరీస్ వాచ్ మన్ ఆమెను సమీపించాడు. ఆమె నిలబడే ఉన్నది కాని అతడు అలవాటు ప్రకారం "తుమ్ కౌన్ హై" అని ప్రశ్నించాడు. ప్రత్యర్ధి మనస్తత్వంలోనే అయినా సమయానికి అపద్భంధవుడిలా వచ్చిన అతనికి మనసులోనే జేజేలు సమర్పించుకొంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "దుష్మన్ నహీ , దోస్త్ " అని బదులిచ్చిండామే సౌమనస్యమూ మైత్రీ భావమూ నిండిన మధుర స్వరాన.
    అతడు లాఠీని త్రిప్పి చంకలో ఇరికించుకున్నాడు. దగ్గరగా వచ్చి ప్రశ్నార్ధకంగా చూచాడు.
    "అర్కేలాజికల్ క్యూరేటర్ గారిల్లెకడ? వారితో నేను మాట్లాడాలి. అర్జంట్ - ప్లీజ్" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. వారు నిలచిన చోటు నించి దక్షిణానికి తిరిగి తారు వెయ్యని రోడ్డు మీద సరిగ్గా నూరు గజాలు నడిస్తే క్యూరేటర్ గారి, యి. టైపు క్వార్టర్స్ కనిపిస్తుంది.
    అతడు ఆమెను ఆ యింటి ముందుకు తీసుకువచ్చి ఏమి జరుగుతుందో తమాషా చూడాలన్నట్లుగా అల్లంత దూరంలో నిలిచిపోయినాడు. ప్రొఫెసర్ శ్రద్దాదేవి మెరుపు వేగంతో ముందుకు వెళ్ళి రెండు మెట్లు ఎక్కి వరండా లోకి చేరిపోయింది. యి.యి క్వార్టర్ కి వీధి వాకిలి ప్రక్కనే వున్న కాలింగ్ బెల్లుని నిర్విరామంగా నొక్కసాగింది.
    రెండు నిమిషాల తరువాత డ్రాయింగ్ రూమ్ లో దీపాలు వెలిగాయి. కాలింగ్ బెల్ మీది నించి వేలు తీసిందామే. తలుపులు తెరచుకున్నాయి! మోకాళ్ళ దాటి క్రిందికి దిగిపోయిన నీలిరంగు మీద జరీ పూలు కుట్టిన నైట్ గౌన్ లో వెలుపలకు వచ్చారు శ్రీ బృందావన్ గోయెల్.
    కళ్ళు చికిలించి సమయం కాని సమయంలో అగంతుకుడిలా వచ్చిన ఆ నవాగతు రాలివంక చూచారు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి చేతులు ముకుళించి తనను తాను పరిచయం చేసుకుంది. నుదురు మీది చిరు చెమట అద్దుకుంది.
    శ్రద్దాదేవి ఆవేళప్పుడు అలా కన్పిస్తుందని శ్రీబృందావన్ గోయెల్ ఎన్నడూ అనుకోలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆమె కనిపిస్తానని తెలుసు. జయకృష్ణకు ఆమె మీద అపారమయిన గౌరవం . జ్యోతికి ఆమె సర్వస్వం. అందు నించి వారి ద్వారా శ్రద్దాదేవిని చూచినవారితో సంభాషించే ఆవకాశం దొరుకుతుందనే అయన భావించాడు.
    కాని అనుహ్యమయిన సమయంలో ఆమె కన్పించటం విస్మయాన్ని కలిగించింది. సాదరంగా లోపలకు ఆహ్వానించాడు . క్రమ్ముతున్న చిరు చెమటల వల్ల ఆమె ఏదో ఆదుర్దా పడుతున్నారు అని ఊహించాడు ఫాన్ స్వ్హిచ్ వేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS