కాశ్మీరా!
మోహిని!
చిత్ర!
తనని ఓదార్చి గుండెల్లో దాచుకోగల హృదయం ఆ ముగ్గురికి వుంది.
కాశ్మీరనీ చేరాలనుకొడం ధర్మం కాదు ఆమెకి తనని ఆదరించే హృదయమూ ద్తేర్యమూవున్నా ఆమె బతుకుని అల్లరిపాలు చేయలేడు.
మోహిని
జీవితంలో ఓడిపోయినా ఓ ప్రేమమూర్తి
కానీ తనని ఆదరించి ప్రాణంగా చూసుకోంటోంది.
మిగిలింది చిత్ర.
తను ప్రవేశిస్తే ఆమె జీవితంకూడా నాశనమవుతుంది.
అందుకే చిత్రంగా దూరం చేసుకున్నాడు రాబర్టు.
ప్రతికార వాంచతో రగిలిపోతున్న తను అసలు వీళ్ళ గురించీ ఆలోచించట మే సిల్లీగా వుందనిపించిందతనికి
కానీ చిత్ర అతని గుండెలో ఎక్కడో స్ధానాన్ని సంపాదించుకొంది లేకపోతే ఆమె గురించీ తరచుగా అతను ఆలోచించకపోను. చిత్రకి కనబడదనే అతను నిశ్చయించుకున్నాడు.
ఆ రోజు ఉదయంనించీ ఏమీ తినలేదు కడుపులో ఏదోమంటగా వుంది.
మోహిని ఇంకారాలేదు. వస్తే బయటకు వెళ్ళనివ్వదు
ఈలోగానే బయటపడాలి.
రాబర్టు గబగబ లేచి బట్టలు మార్పుకొని పోర్టికోలోకొచ్చాడు.
అప్పడే మోహిని కారు పోర్టికోలో అంది.
రాబర్టు నిరుత్సాహంగా చూసేడు.
మోహినీ కారదిగి మెట్లు ఎక్కుతూ .
"లోపలికి పద" అంది.
రాబర్ట్ ఆమె మాటలకి ఏదురుచేప్పకుండా ఆమె వెనకనే నడిచాడు.
* * * *
రాబర్ట్ కిటికీ దగ్గరనించుని సిగరెట్ కాలుస్తున్నాడు.
దూరంగా ఎక్కడో కుక్క ఏడుస్తోంది. గాలి తాకిడికి చెట్లు ఆకులు శబ్దం చేస్తున్నాయి బయట చీకటిగా వుంది. ఆ చీకటికి రాబర్టు కళ్ళు బాగా అలవాటు పడినాయి.
అంతులేని ఆలోచనలు అతని గుండెనీ చీలుస్తున్నాయి.
మనిషి జీవితపు విలువ ఎంత?
ప్రశ్న వేసుకున్నాడు రాబర్టు.
ఎంత్తేనా వుండచ్చు. ఏమైనా కావచ్చు కానీ తన విషయంలో విధి దారుణంగా కాటేసింది.
జీవితపు విలువల్ని పోగొట్టుకున్నాడు. అతనంతవరకే ఆలోచించాడు కానీ అతనికోసం ఇద్దరు అబలలు జీవితాన్నే కోల్పోయారన్న నిజం ఆ సమయంలో అతనికి తెలిలేదు.
రాబర్టు కళ్ళలో దిగులు స్పష్టంగా కనబడుతుంది.
గుండెలనిండా ఆ వేదన చోటు చేసుకుంది. కాకతాళీయంగా చేయకపోయినా శత్రువుదాడికి గురి అయ్యాడు.
అందుకు కారణం అర్జున తనని ప్రేమించడం తనమీద కక్ష సాధించలేక పూర్ణారమేష్ అర్జునని చంపారా? అన్న అనుమానం అతని అణువణులోనూ నిండిపోయింది.
ఆ రోజు కాశ్మీర అల్లరిచేష్టలకి తను లొంగివుండకపోతే అతని బ్రతుకు ఇన్ని మలిపులు తిరిగివుండేదికాదు.
జరిగిన కధని ఒక్కసారి సింహనలోకనం చేస్తే తను వేసిన తప్పటడుగులు అతనికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అప్పడే పోలిసులకి లొంగిపోయి, తను నిర్దోషినని నిరూపించుకోడానికి ప్రయత్నంచేసివుంటే ఈ నాటిజివితం మరో లా ఉండేది.
రాబర్టు కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. అప్పడే మోహిని ఆ గదిలోకి వచ్చింది.
ఆమె అడుగులచప్పుడు సైతం అతనికి వినబడలేదు.
మోహిని అతని భుజంపైన చెయ్యివేసింది.
ఆ స్పర్శ వెయ్యి ఏనుగుల బలాన్ని రాబర్టుకిచ్చేలా అనిపించింది.
వెనక్కి తిరగకుండానే ఆ చేతిపైన తన చేతిని వేసి నిమిరాడు రాబర్టు.
"రాబర్ట్" పిలిచింది మోహిని.
ఎంత చల్లగా వుందా పిలుపు.
రాబర్టు తలతిప్పి చూశాడు.
అతని కళ్ళలో నీటిని చూసి మోహిని కలవరపడింది.
"నీ కళ్ళలో కన్నీరా?" అంది అయోమయంగా రాబర్టు మాట్లాడలేదు.
తన పవిట చెరగుతో అతని కన్నీళ్ళనీ తుడుస్తూ దిగులుగా అంది మోహిని.
"రాబర్ట్ నేను శశిభూషణ్ వంచనకి గుర్తెనాక నేనో ఆడదాన్నన్న సంగతే మరిచిపోయాను కానీ తిరిగి నిన్ను చూశాక నా గుండె రెపరెపలాడింది నీకోసం ఆరాటపడ్డాను ఇప్పడి మోహిని బతికేది నీకోసం నీ కంట నీరు చూస్తే నే గుండె పగిలిపోతుంది రాబర్టునీ కోసం నేను ఏమీ చేయ్యడానిక్తేనా సిద్దంగా వున్నాను. నువ్వు ఆనందంగా వుండడం నాకు ముఖ్యం ప్లీజ్. ఒక్కసారి ఒక్కసారి నవ్వు" అంది బేలగా.
రాబర్టు ఒక్కో అడుగే వెస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
"నీలో ఇంత మార్పు వస్తుందని నేననుకోలేదు మోహీనీ ! అన్నాడు రాబర్ట్ మెల్లగా.
