Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 47

 

    కుయ్యోమని అరిచి డెట్టాల్ రాసుకుని స్నానం పూర్తిచేశాడు అభిషేకన్.
    ఆ తర్వాత స్వీటుని టిఫిన్ బాక్స్ లో పెత్తుకుని గాల్లో తేలుతున్నట్లు నడుస్తూ పక్క వీదీలో ఉంటున్న తమిళుల ఇంటికి వెళ్ళాడు.
    అతన్ని చూడగానే 'వాంగో సార్! వాంగో" అని సాదరంగా ఆహ్వానించారు వాళ్ళు.
    "ఎన్నా సార్ సౌక్కియమా?" అని కుశల ప్రశ్న వేసి "చూసినారా సార్! మన తమిళ్ పిక్చరుకి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ సార్! మన టామిల్ పిక్చరు కి స్వీట్సు తెచ్చాను సార్ తినండి" అన్నాడు అభిషేకన్ ఉబ్బి తబ్బిబ్బయిపోతూ.
    వాళ్ళు ఆశ్చర్యపోయారు.
    తమిళ్ పిక్చరు గోల్డ్ మెడల్ వచ్చినందుకు కాదు.
    దానికి తెలుగువాడయిన అభిషేకన్ అంతగా ఆర్బాటం చేస్తున్నందుకు.
    వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అదరగండం లాంటి పిల్లాడు అదే సమయంలో వాంతి చేసుకోబోతున్నట్లు మొహం పెట్టాడు.
    "ఏమ్సర్! బాబుకి బాగాలేదా!" అభిషేకన్ అన్నాడు అభిమానంగా.
    "వంట్లో బాగానే వుంది. కానీ ఓవరాక్షన్ చూస్తె నాకు వాంతులోస్తాయి" అన్నాడు ఆ పిల్లాడు వినీ వినబడకుండా.
    అతని మాటలు పట్టించుకునే స్థితిలో లేడు అభిషేకన్. రయ్యి మని తన టీవియస్ మీద ఆఫీసుకి వెళ్ళిపోయాడు. దార్లో ఇరవై మందిని ఆపి గోల్డ్ మెడల్ సంగతి చెప్పాడు. ఆఫీసుకి వెళ్ళగానే మేద్రాసుకి రింగ్ చేసి తన ఫ్రెండుతో ఆ అనందం పంచుకున్నాడు. డిల్లికి కి ఫోన్ చేసి అవార్డుల ఫంక్షన్ ఎప్పుడో కనుకున్నాడు. గోల్డ్ మెడల్ గురించి ఇంకా ఇన్ ఫర్మేషన్ లాగుదామని చూసాడు గానీ అక్కడి వాళ్ళంతా బిజీగా ఉండడం వల్ల అతని వ్యూహం ఫలించలేదు.
    బాగా చీకటి పడేదాకా మెద్రాసుకి , డిల్లీకి ఫోనులు కొడుతూనే ఉన్నాడు అభిషేకన్. ఇంక లాభం లేదనుకుని నిశ్చయించుకున్న తర్వాత ఆఫీసునుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చాడే కానీ అతనికి అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు.
    గోల్డుమెడల్ గురించి ఇంకా సమాచారం తెలిస్తే బాగుండు.
    జనం ఏమనుకుంటున్నారు?
    ప్రముఖుల రియాక్షన్ ఎలా ఉంది?
    అదంతా వివరంగా తెలుసుకుంటే గానీ నిద్రపట్టదు తనకి ఇవాళ.
    కానీ ఎవరు చెబుతారు ఆ వివరాలన్నీ?
    హటాత్తుగా అతనికి ఒక ఐడియా తట్టింది.
    పెద్ద పెద్ద పత్రికల ఆఫీసులకి లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంటుంది ఎప్పటి కప్పుడు - టెలీ ప్రింటర్స్ ద్వారా !
    ఒక లీడింగ్ మేగజైను ఆఫీసు తెలుసు తనకి! వాళ్ళకి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వున్నాయి - న్యూస్ పేపర్స్ తో సహా.
    అక్కడికి వెళ్ళి ఆరాతీస్తే? ఆ ఆలోచన రాగానే టీవీఎస్ మీదికి లంఘించి మహోత్సాహంతో ఆ మేగజైను ఆఫీసుకి వెళ్ళిపోయాడు అభిషేకన్.
    లోపలికి వెళ్ళీ వెళ్ళగానే అతనికి వినబడింది ఒక ఆడపిల్ల ఆర్తనాదం.
    అకేక ఎడిటర్స్ కేబిన్ లో నుంచి వినబడుతోంది. తన నవలని సీరియల్ వేసుకోమని అడిగిన హరిణి, ఎడిటరు అందుకు ఒప్పుకోకపోతే అతను తనని బలవంతం చెయ్యబోయాడని ప్రచారం చేస్తానని బెదిరిస్తూ పెట్టిన పెద్ద కేక అది! వెంటనే అలర్టుగా అయిపోయి చెవులు రిక్కించి విన్నాడు అభిషేకన్.

                             *     *    *     *

    "మూడు వారాలు పట్టింది కాలికి తగిలిన గాయం తగ్గడానికి" అన్నాడు ఉదయార్కర్ తన కాలి వైపు చూసుకుంటూ.
    ఒక లంబాడీ తండాలోని గుడిసెలో పడుకుని ఉన్నాడు అతను.
    ఉదయార్కర్ , బ్రహ్మచారీ బృందం తుమ్మల బయలు దగ్గర ఉన్నప్పుడు ఉదయార్కర్ కాలు ఒక ట్రాప్ లో ఇరుక్కుపోయింది. పులిని పట్టుకోవడానికి అలాంటి ట్రాప్ అక్కడక్కడా ఉంచుతారు కొంతమంది వేటగాళ్ళు.
    తేలిగ్గా అర్ధమయ్యేటట్లు చెప్పాలంటే ఒక ఇనప తామరపువ్వులా వుంటుంది ఆ ట్రాప్. పులి కాలు దాని మీద పడగానే అది చటుక్కున ముడుచుకుపోతుంది. ఒక్కొక్క రేకూ ఒక్కొక్క కొక్కెంలా ముడుచుకుని పులి కాలుని పట్టేసుకుంటుంది.
    చూసుకోకుండా ఆ ట్రాప్ మీద అడుగువేశాడు ఉదయార్కర్. కండలని చీల్చుకుపోయి కాలి ఎముకదాకా లోతుగా గుచ్చుకుపోయాయి ఆ ట్రాప్ తాలుకు కొక్కాలు.
    యమబాద!
    "మీరు వెంటనే అదేదో పసరు పూసారు కాబట్టి మూడు వారాల కన్నా తగ్గుమొహం పట్టింది గాయం! లేకపోతే మొత్తం కాలే తీసి వెయ్యవలసి వచ్చేదేమో!" అన్నాడు ఉదయార్కర్ కృతజ్ఞతా పూర్వకంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS