Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 46

 

     శశిభూషణ్ ఆ పేరుతో  పిలవడంతో విస్మయంగా  చూశాడు రాబర్ట్.

    "కాశ్మీర నాకు అన్నీ చెప్పింది.  మీకు అభ్యంతరం లేకపోతే మీరు నిర్దోషని నిరూపించడానికి  నేను ప్రయత్నం చేస్తాను" శశిభూషణ్ అన్నాడు.

    రాబర్ట్ అతని మాటలకి అదోలా నవ్వేడు.

    కాశ్మీర కూడా వచ్చి కూర్చుందక్కడ.

    "భూషణ్"

    "గాలిపటాన్ని ఎగరేసినప్పడే జాగ్రత్తాపడాలి. అది తెగిపోయాక  ఏ కొమ్మల్లోనే  తుప్పల్లోనో చిక్కుకుని చిరిగిపోతుంది. అది తిరిగి ఎగరేయడానికి పనికిరాదు"

    "మీ కెందుకంత నిస్పృహ " అడిగాడు భూషణ్.

    "చట్టం దృష్టిలో నేను అపరాధిని నేను చట్టానికి దొరక్కుండా తిరుగుతూ వాళ్ళ అభిప్రాయాన్ని బలప చనంతకాలం శతృవిని దెబ్బ తీసి  నా అనర్జున కి ఆత్మ శాంతి చేకూర్చందే  నేను నిద్రపోను. అప్పడే నాకు తృప్తి"

    "ఆల్ ర్తేట్ నేను లాయర్ తో మాట్లాడి  చూస్తాను" అని లేచాడు భూషణ్.

    శశిభూషణ్ తో  వాదించి లాభంలేదనుకొని వూరుకున్నాడు రాబర్ట్.

    శశిభూషణ్ బయటకి వెళ్ళిపోయాడు. రాబర్ట్ స్నానం చేసి వెళ్ళడానికి రెడీ  అవుతుంటే"

    "ఎక్కడికి?" అడిగింది కాశ్మీర.

    "ఎక్కడికో ఓ చోటికి వెళ్ళాలిగా!"

    "వుండిపోకూడడూ!" అభ్యర్ధనగా అడిగింది.

    "ఎన్నాళ్ళు?"

    "నేను బతికినంతకాలం!" అంది కాశ్మీర.

    "ధాంక్యూ , కాశ్మీరా ఇప్పడే  నీ భర్త నీ దారిలోకోస్తున్నాడు. తిరిగి నా ఉనికి మీ ఇద్దరిమధ్య కలతలకి  దారి తియ్యకూడదు. నన్ను వెళ్ళనీ!" అన్నాడు.

    "మళ్ళి వస్తావా!" అతను భుజం ప్తెన చెయ్యివెస్తూ అడిగింది.

    కాశ్మీర నడుము చుట్టూ చేతులు వేసి తన వేపుకి తిప్పుకున్నాడు రాబర్టు.

    ఇద్దరి కళ్ళూ కలిసేయి.

    మాట్లాడుకున్నాయి వర్షించాయి.

    ఏడ్చాయి గుండె లోతుల్ని వెతుకుతున్నాయి.

    రాబర్టు మెల్లగా  వంగి  కాశ్మీర  పెదవుల్ని అందుకున్నాడు.

    "ఇది నా ఆఖరి ముద్దు" అన్నాడు  రాబర్టు.

    "రాబర్ట్ " ఆందోళనగా అంది కాశ్మీర.

    "ఉ!"

    "నాకెందుకో భయంగా వుంది. నువ్వు ఏ అఘాయిత్యం చేయవుగా?"

    "రాబర్ట్ గుండెల్లోని  జ్వాల ఎలాంటిదో నీకు తెలిదా కాశ్మీరా?"

    కాశ్మీరా అతనికి పర్స అందించింది.

    "ఎందుకు?"

    కాశ్మీర కళ్ళల్లో నీరు పొంగింది.

    "నికే వుద్యోగంలేదు. ఇంతకాలం  ఎలా  గడిపావో నాకు తెలిదు. కానీ తెలిసి నిన్ను పట్టిచేతులతో   ఎలా పంపను?"

    రాబర్ట్ కొన్ని క్షణాలు ఆలోచించి  ఆ పర్స్ నీ  తీసుకొని జేబులో పెట్టుకున్నాడు.

    "నికేప్పాడు ఏం కావాలన్నా నా దగ్గరికి రావాలి" అంది కాశ్మీర చెయ్యిచాస్తూ.

    రాబర్టు ఆమె చేతిలో చెయ్యివేశాడు. అతని చేతిని అలాగే పట్టుకుని గేటువరకూ నడిచింది కాశ్మీర.

    తలెత్తి అతని మొహంలోకి చూసింది.

    కన్నీరు.

    ఆమె చేతిలోంచి చేతిని  విడిపించుకొని రాబర్టు ఆమె కళ్ళని తుడిచాడు.

    "వెళ్ళనా?" అడిగాడు.

    కాశ్మీర మెల్లగా తలూపింది.

    రాబర్ట్ గేటు దాటాడు.

    వస్తూన్న దుఃఖాన్ని భరించలేక ఆమె గొంతు అదురుతోంది.

    రాబర్ట్ కనుపించినంత దూరం  అక్కడే నిలబడి చూస్తూ వుండి పోయింది కాశ్మీర.

    అప్పటివరకూ వున్న ద్తేర్యం  సన్నగిల్లిపోగా  బావురుమని ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది కాశ్మీర.

                *    *    *    *

    పగబట్టిన పాము చిక్కి శల్యమ్తెపోతుంది. రాబర్టు చాలా చిక్కి పోయాడు.

    తనకిప్పుడు దేనిమీదా ఆసక్తి లేదు. ఎక్కువగా అతనిప్పుడు మోహినీ  ఇంటి దగ్గర గడుపుతున్నాడు ఒకపూట భోజనము. అది మోహినీ  బలవంతం చేసి తినిపిస్తే తప్పు తినడు.

    ఆతననుకోంటూ వుంటాడు.

    మోహిని గురించీ  మొదటో ఎంత ఘోరంగా  ఆలోచించాడు. కానీ ఇప్పడతనికి  ఆమె ఆసరా అయింది.

    ఇప్పుడు రాబర్ట్ తాగడం ఎక్కువ చేశాడు. గడ్డం బాగా పెరిగింది సిగరెట్లు కాల్చి కాల్చి నోరు  చేడుగా వుంది. పెదిమలు చిట్లి మండుతున్నాయి.

    మోహినీ  బయట కెళ్ళింది.

    రాబర్టుకి తన అసమర్ధతపై  కోపంగా వుంది.

    తనింకా బతికి వుండడంలో అర్ధం కనబడలేదు.

    అసలు తన ఉనికిని భరించే వాళ్ళున్నారా?

    ఎందుకు లేరు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS