Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 47

నన్నూ నిన్నూ బలహీనులనీ
ఎస్కేపిస్టులనీ నిందిస్తుంది
ఊపిరాడక గిజగిజలాడే యీ లోకం
   
ఎవరెస్టు కన్నా - ఎత్తైన నా
ఊహా శిఖరాల్ని వీళ్ళెక్కలేరు
సింధూరం కన్న ఎరుపైన నా
హృదయాన్ని వీళ్ళు చదవలేరు
ఇల్లు విడిచి ఒళ్ళు మరచి
ఒక్కసారి రా చెలీ!
ఒకరినడుం ఒకరు చుట్టి
ఉల్లాసంగా తిరుగుదాం
సరుగుడు చెట్ల నీడలలో
విరుగుడు చేవ తోటలలో
మునిమాపు వేళ రెండు నక్షత్రాలు
ముద్దు పెట్టుకుంటూన్నప్పుడు
మునికాళ్ళమీద నిలిచి దేవతలు
మనని అసూయగా చూస్తున్నప్పుడు!

    *     *    *   
                    ---1962

దీపం
   
దీపాలు బాగుంటాయి
పాపల్లాంటి దీపాలు
కనుపాపల్లాంటి దీపాలు
పాపాలవంటి సహజ స్వచ్ఛ తీవ్రమైన దీపాలు
   
చీకట్లో చీకటి కనపడదు
దీపం పాపంవంటి చీకటిని చూపెడుతుంది
దీపాలమధ్య చీకటి దివ్యంగా మెరిసిపోతుంది
దీపం ఆసరాతో చీకటి నైజాన్ని తెలుసుకో
పాపం ఆసరాతో మానవుడి నైజాన్ని తెలుసుకో

ఆకలేసినపుడు కొట్లో మిఠాయి కాజేద్దామని యానాదిపిల్ల ఆబకళ్ళు
ఆపుకోలేని యౌవనంలో తప్పటడుగువేసిన పెళ్ళికానిపిల్ల కన్నీళ్లు
ఆరులక్షలున్నా దొంగనిలవలు వేసే షావుకారు అజ్ఞానపు కుళ్ళు
తోడేలు గొర్రెను చంపి తాగుతూన్న నెత్తుటిలో సృష్టి క్రూరపు ముళ్ళు
ఆకతాయి మొగుడైనా ఆ వెధవ ప్రతిబింబాన్ని ఆప్యాయంగా మోస్   
ఆడదాని ఒళ్ళు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS