Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 45

 


    అతని  మాటలకి  మోహిని కంపించిపోతూ చేత్తో అతని పెదవుల్ని మూసింది.

    రాబర్టు మోహినీని పూర్తిగా స్వాధీనం  చేసుకున్నాడు.

                                    *    *    *    *

    రాబర్టు గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు.

    అతన్ని చూస్తూనే కాశ్మీర  పరుగెత్తుకొచ్చి కాళ్ళప్తెన పడిపోయింది.

    రాబర్టు కాశ్మిరని లేవదీశాడు.

    "రాబర్టు, నీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళలో నేనూ నా భర్తా కూడా  వున్నాం  మా వల్ల నువ్వు పోగొట్టుకున్నదాన్ని తిరిగి నికిచ్చే శక్తి మాకేలాగూ  లేదు అయినా నా భర్తని కాపాడి నాకు అప్పగించిన పుణ్యమూ ర్తివి నువ్వు, నీ ఋణం ఎలా తీర్చుకోవాలో   తెలీడంలేదు రాబర్టు" అంది కాశ్మీర.

    రాబర్ట్ శశిభూషణ్ కేసి చూశాడు.

    "చూడు మాస్టర్  భూషణ్ మనిష్తేపుట్టాం కొన్ని బలహీనతలుండడం ఎవరిక్తేనా  సహజమే  అది నీకూ తెలుసు నువ్వు ఏ వ్యక్తిని  దృష్టిలో  పెట్టుకుని నీ భార్యని హింసిస్తున్నావో  ఆ వ్యక్తిని నేనే.  నా అసలు పేరు విజయ్."

    శశిభూషణ్  ఆశ్చర్యంగా చూశాడు.

    రాబర్ట్ చిన్నగా నవ్వేడు.

    కాశ్మీర అమాయకురాలు  ఆమె కంటినీరు చూసి  హృదయం ద్రవించి నిన్ను  కాపాడెను. ఆ కన్నీటి  విలువ నీ నిండు ప్రాణం.

    "నీ భార్యలోని  మంచితనాన్ని  గుర్తించి ఆదరించడం  ప్రేమించడం  నేర్చుకో!" అన్నాడు రాబర్ట్.

    "చచ్చిన  పామునింకా  ఎందుకు కోడతావ్  రాబర్టు నీకు మాటిస్తున్నాను కాశ్మీరనీ నా ప్రాణప్రదంగా చూసుకొంటాను."


    రాబర్టు కటువుగా చూసేడు.

    "మాటివ్వవలసింది నాక్కాదు. నీ భార్యాకి" అన్నాడు.

    శాశిభాషణ్  కాశ్మీర రెండుచేతులూ  పట్టుకున్నాడు.

    "నన్ను క్షమించు కాశ్మీర.   ఇంకెప్పుడు నిన్నిలా బాధపెట్టాను" అన్నాడు.

    శశిభూషణ్, కాశ్మీర పట్టుబట్టడంతో ఆ రాత్రికి అక్కడే ఉండి పోయాడు రాబర్టు.

    భోజనం చేసేక కబుర్ల అనంతరం శశిభూషణ్ , కాశ్మీరా ప్తెకి వెళ్ళిపోయారు.

    రాబర్ట్ హలో పోఫాలో పడుకున్నాడు. అతన్ని ఆలోచనలు వెంటాడుతూన్నాయి.

    నిద్ర పట్టడంలేదు

    కళ్ళముందు ఏవో మసకనీడలు.

    అర్జున!

    తన ప్రాణం...తన సర్వస్వం.

    ఏమ్తేపోయింది?

    జీవితాన్ని ముగిస్తూ తన గుండెల్లో అరణి జ్వాలల్ని రగిలించి పోయింది.

    ఎన్నాళ్ళింకా ?

    ఆ హంతకులు ఎక్కడున్నారు?

    కాశ్మీర

    మేరీ

    చిత్ర

    మోహినీ

    ఒక్కో నిడా చెదరిపోతోందో. ఆ చెదరిపోతున్న నీడల్ని చూసి తను బెదరిపోవడం లేదుకదా అన్న ఓ అనుమానం.

    కానీ ఆ జ్ఞాపకాల  తెరలనించి  క్షణం పాటు కూడా బయటపడలేనని అతనికి తెలుసు.

    దారి తప్పిన తన జీవితానికి దారిలేదు.

    "వుంది" అనుకొంటే అది తేలవితక్కువ తనమే అవుతుంది.

    రాబర్ట్ మనిషికాదు.

    ఓ అగ్ని పర్వతం.

    ఆ అగ్ని పర్వతానికి శాంతి  అవసరం లేదు. రక్తానికి రక్తం కావాలి.

    ఇప్పడా అగ్నిపర్వతం చాలా దగ్గర్లోనే పగిలిపోడానికి సిద్దంగా వుందన్న  సంగతి అతనికి తెలిదు.

    రాబర్టు లేచి కూర్చున్నాడు.

    అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు?

    ఈ మార్పెలా వచ్చింది?

    ఎందుకొచ్చింది?

    జరిగిదానిని ఓ పిడకలగా  మరచిపోనూ లేడు.

    మరిచిపోయి సుఖంగా బతకనూలేడు.

    నిజంగా రాబర్ట్ బతకాలంటే ఒక్కటే మార్గం.

    అది చావు.

    చావే అతని జీవితానికి పరిష్కారమని  రాబర్టుకి తెలుసు.

    నిద్ర దూరమ్తెంది.

    సిగరెట్ ప్తెన  సిగరెట్ కాలుస్తున్నాడు.
   
    చేతిగడియారంలో టైమ్ మూడుగంటలని సూచిస్తోంది.

    టీపాయ్ ప్తెన కాళ్ళు పెట్టి మరో సిగరెట్  వెలిగించాడు.

    ఒక్కొక్క తెరా విడిపోతోంది. కానీ అంతలోనే అతని ఆలోచనలు చంచలంగా తాయారవుకున్నాడు.

    చిత్రని చూడాలనిపించిందతనికి' సిగరెట్లన్నీ అయిపోయినాయి.

    రాబర్ట్ సోఫాలో పడుకున్నాడు.

    ఉదయం ఎనిమిదయినా  లేవలేదతను.

    శశిభూషణ్ బయటికి వెళ్ళబోతుండగా లేచాడు. రాబర్టు అతను లేవడం చూసి  శశిభూషణ్ అతని కెదురుగావచ్చి కూర్చున్నాడు.

    "విజయ్"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS