"చాలా పే చేశాడు ఆ అమ్మాయికి! నందనరావు" అన్నాడు పబ్లిషర్.
వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే ఫోన్ మోగింది. మిస్టరీ గర్ల్ అరుణ దగ్గరనుంచి వచ్చింది ఆ కాల్.
నవ్వు వినబడుతోంది ఆమె గొంతులో.
"మీ రైటర్ గారి కొత్త నవల చదివానండోయ్!" అంది పరిహాసంగా.
"ఏ రైటరు? ఏ నవల?" అన్నాడు ఎడిటరు.
"హరిణి డైరెక్ట్ నవల ది ట్రిక్" ఇవాళే చదివాను.
"ఎలా ఉంది. " ప్రోషేషనల్ క్యూరియాసిటీ ధ్వనిస్తోంది అతని గొంతులో.
"షి బెటర్ స్టాప్ రైటింగ్"
"అంటే?"
"ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఏం బాగాలేదు నవల."
"ఎందువల్ల?"
ఆ నవల ఎందుకు బాగులేదు సవివరంగా చెప్పింది అరుణ. సహేతుకంగా చెప్పింది. మంచి క్రిటిక్ తను. చివరగా అంది." ఈ నవల చదివాక ఇంకోటి అనిపిస్తోందండీ నాకు."
"ఏమిటి?"
"ఇప్పుడు హరిణి రాస్తున్న సీరియల్ కూడా మీ పత్రికలో కాకుండా డైరెక్టుగా నవలగా వచ్చి వుంటే అంత ఫినామినల్ సక్సెస్ అయిఉండేది కాదేమో! హరిణి సీరియల్ సక్సెస్ సగం కారణం మీ ప్రెజెంటేషనే అనుకుంటా!"
"మేబీ! ఆర్ మీ బీ నాట్" అన్నాడు ఎడిటర్ నాన్ కమిటాబుల్ గా.
ఎడిటరు ఫోన్ పెట్టేయ్యగానే పబ్లిషర్ అన్నాడు.
"ఈ నవలకి వచ్చినంత బాడ్ టాక్ ఈ మధ్యకాలంలో మరే నవలకీ రాలేదండీ"
మరి కాసేపు మాట్లాడి పబ్లిషర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరికొంతమంది పత్రిక అభిమానులు వచ్చారు. కొంతమంది రైటర్స్ వచ్చారు.
ఎవరి నోట విన్నా ఒకే మాట! డిస్సప్పాయింటింగ్ గా ఉంది నవల వెరీ వెరీ డిసప్పాయింటింగ్ !
ఆరోజు సాయంత్రం -
ఎడిటర్ ఇంటికి వెళ్ళడానికి లేవబోతుండగా-
అప్పుడు వచ్చింది హరిణి - వడలిపోయి ఉంది ఆమె మొహం. అపరాధిలా తలవంచుకుని గుమ్మం దగ్గరే నిలబడింది.
"కమ్! ప్లీజ్ సిట్ డవున్" అన్నాడు ఎడిటర్. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కుర్చీలో ఒదిగి కూర్చుంది హరిణి.
కొద్దిసేపు మౌనం తర్వాత -
"ఐయామ్ వెరీ సారీ సార్!" అంది హరిణి వినివినబడనట్లు.
"ఎందుకు?"
"ఐయామ్ వెరీ సారీ సార్ వన్స్ ఎగేయిన్! ఆ పబ్లిషర్ బలవంతం చేస్తే నేను......"వాక్యం సగంలో ఆపేసింది హరిణి.
"ప్లీజ్ ! లెటజ్ వాట్ టాక్ అబౌట్ ఇట్"
"మీకు ఇబ్బంది కలుగుతుందని నేను అనుకోలేదు సార్" అంది అపాలజేటిక్ గా.
"నాకేం ఇబ్బంది కలగలేదే" అన్నాడు ఎడిటర్.
"కానీ నాకు చాలా ఇబ్బంది కలిగింది సార్! మై డైరెక్ట్ నావెల్ ఈజ్ ఏ ఫెయిల్యూర్! ఏనార్ మాఫ్ ఫెయిల్యూర్"
"ఫెయిల్యూర్ ని సక్సెస్ ని ఒకేలా తీసుకోగలగాలి హరిణి" అన్నాడు ఎడిటర్ ముక్తసరిగా.
"బట్ ఐ కాన్ ట్ సర్! ఐ కాన్ ట్ సర్! మీరు నన్ను క్షమించనని అంటే, నేను మిమ్మల్ని ఒక ఫేవర్ అడుగుతాను సర్. నా నవలని మీరు సీరియలైజ్ చెయ్యగలరా? అంది హరిణి త్వరత్వరగా.
"సీరియలా? నీ సీరియల్ వస్తోంది కదా?"
"అది కాదు సర్! నా డైరెక్ట్ నవలని మీరు మీ మాగజైను లో సీరిలైజ్ చెయ్యాలి." ఆశ్చర్యంగా చూశాడు ఎడిటరు.
"ఎందుకు?"
"నేను రియలైజ్ చేశాను సర్! అంత ఘోరంగా ప్లాప్ అయిన ఆ నవల కూడా మీ పత్రికలో సీరియల్ గా వచ్చి ఉంటే కనీసం యావరేజ్ సక్సెస్ అన్నా అయి వుండేది."
"డైరెక్ట్ నవలగా వచ్చిన దాన్ని నా మేగజైనులో సీరియలైజ్ చెయ్యడం నాకు అలవాటు లేదు."
"కానీ సర్, ఇంగ్లీషులో ఆ పద్దతి వుంది. పాపులర్ అయిన డైరెక్ట్ నవలని తర్వాత సీరియలైజ్ చేస్తారు."
"కానీ అలా చెయ్యడం నా పాలసీ కాదు."
"అవచ్చు. కానీ ప్రతి విషయానికి ఎక్స్ ప్షన్స్ ఉంటాయి కదా సర్. దీన్ని ఒక ఎక్స్ ప్షన్ ల్ కేసుగా ట్రీట్ చేసి..."
"దేరీజ్ నధింగ్ ఎక్స్ ప్షనల్ అబౌట్ దిస్! ఎనీహౌ ఇటీజ్ ఎగేయినెస్ట్ మై పాలసీ"
"పోనీ అలా మీకు కుదరకపోతే , వెంటనే నా నెక్స్ ట్ నవల మరొకటి అనౌన్స్ చేసెయ్యండి. మీ మేగజైన్ లో, యాడ్స్ వస్తూ వుంటే, ఈ డైరెక్ట్ నవల ఫెయిల్యూర్ తాలుకూ ఇంపాక్ట్ కొంత తగ్గవచ్చు" అంది హరిణి ప్రాధేయపూర్వకంగా.
"ఐయామ్ సారీ" అన్నాడు ఎడిటర్.
