Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 46

 

    ఓ ! నువ్వా? వచ్చావా?" అన్నాడు అమిత ఆశ్చర్యంతో !
    "చాల తెలివిగా యిరికించాడు. రాలేననుకున్నావు కదూ! నా కన్నముందు నువ్వు సాధించగలిగింది ఏమీ లేదని తెలుసుకో" అందామె!
    "ష్ ష్ ష్------పెద్దగా మాట్లాడకు! ఘూర్కా మన ఉనికి పసిగట్టాడంటే మన యిద్దరి పని ఖతం" అన్నాడు జయసింహ!
    "ఇంత పిరికి వాడివి ఈ ప్రయత్నంలోకి ఎలా వచ్చావు. పులిలా కనిపిస్తున్నాడు కదా నీకు? పిల్లిలా మారుస్తాను క్షణాల్లో!
    "చూస్తావా నా తడాఖా!" అంటూ రోడ్డు మీదికి వెళ్ళిందామె! తనలాగే ఆమె కూడ చాల మొండి ఘటం! చూస్తూ ఉండిపోయాడు.
    ఘూర్కా చివరి దమ్ము లాగి బీడీ విసిరికొట్టాడు.
    "అమ్మో రక్షించండి! బాబోయ్ రక్షించండి! ఆడపిల్లని! అన్యాయమై పోతున్నాను . రక్షించండి. కాపాడండి" అంటూ కేకలు విన్పించాయి.
    "ఎవరో పాపం ఆడపిల్ల! రౌడీలు వెంటపడి వుంటారు" అనుకుంటూ మోల్డా మీదినించి లేచాడు. గేటు మీదుగా రెండు వంకలనూ తొంగి చూచాడు.
    అల్లంత దూరంలో ఓ అమ్మాయి రోడ్డు మీద పడి వుంది.
    హత్య కూడ జరిగిపోయిందా? ఆమె క్రిందపడి విలవిలలాడుతోంది. తన్ను కొంటోంది. నెమ్మదిగా గేటు తెరచుకుని రోడ్డు మీదికొచ్చాడు. కనుచూపు మేర దూరంలో ఆమె తప్ప యింకెవ్వరూ కన్పించలేదు ------
    బహుశా పారిపోయి వుంటారు. పడి వున్న ఆమె దగ్గరగా వచ్చాడు. అది గమనించి మరింతగా కంఠస్వరాన్ని పెంచి అరవటం మొదలెట్టింది.
    "ఆడపిల్లని! అన్యాయమై పోతున్నాను. నన్ను కాపాడండి బాబోయ్!"
    "ఎందుకలా అరుస్తావు? ఎవరూ లేరిక్కడ! ఉటోఉటో" అన్నాడు ఘూర్కా!
    "అయితే మీరు రౌడీ గారు కాదన్నా మాట!" లేచి కూర్చుంది.
    "కౌన్ రౌడీ! కైసా రౌడి! కోయి నై యిధర్"
    "హమ్మయ్య బ్రతికాను " లేచి నిలబడింది.
    "దాదానే కుచ్ కియా? క్యా బేటా! అప్ తో అచ్చీ హైనా?"
    "ఘూర్కాగారూ! నన్ను కాపాడండీ! దాదాలు వెంట పడ్డారు"
    "అరె పగ్లీ క్యా! కోయినై యిధర్! సిరఫ్ మైహో!"
    "నేను కాలేజికి వెళ్లివస్తుంటే నన్ను వెంబడించారు!"
    "రాత్ యే! కాలేజ్ ? పగ్లీ హాగయా క్యా?"
    "కాలేజీ కాదు ఘూర్కాగారు! ట్యూషన్!"
    "ఐసాబతావోన! ఫికర్ మత్ కరోజేటి! ఘర్ జావ్!"
    "వాళ్ళు మళ్ళీ వస్తారు. అమ్మ బాబోయ్ చంపేస్తారు"
    "ఫికర్ మత్ కరో! అవమేరే సాత్! అంటూ మరో బీడీ వెలిగించి ముందుకి నడిచాడు ఘూర్కా! అతని వెనుక నెమ్మదిగా అడుగులేస్తూ భయాన్ని నటిస్తోందామె.
    గేటు ఎదురుగ్గా క్రీ నీడలో పొంచి వున్న జయసింహ గుటకలు మ్రింగటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అతని వంక గర్వంగా చూసింది. తన పాచిక పారినందుకు లోలోపల ఉప్పొంగి పోయింది.
    గేటు నించి లోనికి తీసుకు పోయాడు . మోల్డా చూపించాడు.
    "బైటో భేటీ! అరాం కరో! కుచ్ దేర్ అరాం కరో! బాద్ మే వాపస్ చలో!" అన్నాడు జాలిపడి!
    కొంచెం దూరంలో నిలబడి పోయాడు. అతని ఎదురుగ్గా కూర్చుని చేయగలిగింది ఏమిటో ఆమెకు బోధపడలేదు.
    పుట్టు పూర్వోత్తరాలు అన్నీ మాఫీ తీయటం ప్రారంభించాడు . ట్యూషన్ కి వెళ్ళి వస్తుంటే వెంట పుస్తకాలు ఉండాలి కదా అడిగాడు.
    దాదాలు వెంట పడినప్పుడు పరుగెడుతుంటే దారిలో ఎక్కడ పడిపోయాయని సమాధానం చెప్పింది.
    వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.
    అతడు ఉర్దులో అడిగితె తెలుగులో, తెలుగులో అడిగితె ఇంగ్లీషులో సమాధానాలు చెప్పి మతి పోగొట్టింది.
    ఆ బాధ పడలేక కాస్సేపు కూర్చుంటే భయం తగ్గిపోయి ఆమె వెళ్ళిపోతుందని భావించి మౌనం వహించాడు.
    "దాహంగా ఉంది. మంచినీళ్ళున్నాయా?" ఎలాగయినా అతన్ని ఆ చోటు నించి కదిలించాలని అడిగిందా,మె!
    "ఉన్నాయి బెట్! తెచ్చిస్తాను. అక్కడే కూర్చో!' కొయ్య ముక్కలతో బిగించిన గదిలోకి వెళ్ళాడు. ఈలోగా తోటలో వున్న పూల మొక్కల వంక పరిశీలనగా చూసిందామె!
    ఆ మొక్కని గుర్తించటం ఎలాగో బోధపడలేదు. యింటి చుట్టూ ఇంచుమించూ హెక్టారు స్థలంలో కొన్ని వందల మొక్కలున్నాయి.
    "ఇంటి చుట్టూ ఇంత మంచి తోట పెంచినందుకు ఈ యింటి వాళ్ళని అభినందించాలి అందామె మంచినీరు త్రాగి!
    "బేటీ భయం పూర్తిగా తగ్గిపోయిందా?" ఎంతో ఆదరంగా అడిగాడు.
    "తగ్గిపోయింది! ఇప్పుడు బాగానే వున్నాను"
    'అయితే నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు" నిర్మొహమాటంగా చెప్పాడు! ఆ మాటలు విని ఆమె ఉలికిపడింది.
    "మళ్ళీ దాదాలు వెంట పడతారేమో! అమ్మో నాకు భయం!"
    "అయితే ఈ రాత్రంతా యిక్కడే ఉంటావా?" ఘర్ చలో!"
    "కాస్సేపాగి వెళ్ళిపోతాను. పూల మొక్కలు బాగున్నాయి కదూ-----!"
    "వాళ్ళకేం మారాజులు? పెంచుకుంటారు ! బడా"
    "ఈ మొక్కల పేర్లు అన్నీ నీకు తెలుసా?"
    "కొన్ని పేర్లు తెసుకు! అయినా గుర్తుండవు"
    "స్టార్ సన్ అనే పూల మొక్క ఏదో నీకు తెలుసా?"
    "ఆ పేరు ఈ మధ్యనే ఎప్పుడో విన్నాను సునామై!"
    "అవును. ఈ మధ్యనే అమ్మాయి గారు తెచ్చ్జి నాటారు!"
    "అమ్మాయిగారూ మీకు తెలుసేంటి? మాటామ్ హై క్యా"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS