క్షణంలో కర్చీపులో పుట్టిన ప్రపంచం యావత్తూ అదృశ్యమైపోయింది !
"కోతుల్లో నుంచి మనిషిని సృష్టించాం మేము. అంతటి వాడవుతాడని ఆశించాం . కానీ -- చివరికి మనిషేమయ్యాడు - మృగాలు బెటరనేటట్లు తయారయ్యాడు ." అన్నాడు సిషిహా.
"సో"? అన్నాడు రాజు ప్రశ్నార్ధకంగా చూస్తూ.
"పూర్తిగా చెప్పనీ...... మనిషిని సృష్టించినప్పుడు మేం అనుకున్నదేమిటీ.....మనిషి మేం చూపించిన దారిలో మా దేవతల లేవెలుకి ఎదగాలని. ఇక్కడ ఒక విషయం నువ్వు గమనించావో లేదో ....సృష్టిలో వున్నది తమకు చేతనయినంతవరకూ అనుభవించడం, ఆనందించడం మాత్రమే తక్కిన జీవులకి తెలుసు. కానీ తన అనందం కోసం, అవసరం కోసం కొత్త వాటిని సృష్టించుకునే తెలివి తేటలు మనిషికి మేం ఇచ్చాం. మనిషి మెదడుని అలా మార్చాం. ఉదాహరణకు నిప్పు సంగతే తీసుకుందాం. ఉన్న నిప్పుని ఉపయోగించుకోవడం వేరు. ఎక్కడ బడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు నిప్పు తయారు చేసుకునే సామర్ధ్యం వుండబట్టే కదా నాగరికత పెరిగింది.
నిప్పు తాలుకు పవర్ ని గ్రహించబట్టే మీరు, అగ్నిని ఒక ముఖ్యదేవతగా పూజిస్తున్నారు. నిప్పులాగే అతి ముఖ్యమైనవి నీళ్ళు. నీళ్ళు దొరికే చోటుకి వెళ్తాయి జంతువులు. ఉన్న నీళ్ళని తాగుతాయి. నీళ్ళు ఎండిపోతే నీళ్ళు ఎక్కడ వున్నాయో వెదుక్కుంటూ ఒక్కసారి వందలాది కిలో మీటర్ల దూరం వలస వెళ్ళిపోతాయి . మళ్ళీ వర్షాలు పడ్డాక తిరిగి వస్తాయి.
మనిషి అట్లా కాదు. తాను నిలిచినా చోటే నీళ్ళు కావాలనుకుంటాడు. నీళ్ళ కోసం బావులు తవ్వుతాడు. వర్షపు నీళ్ళు వృధా కాకుండా ఉండడానికి చెరువులు త్రవ్వుతాడు. నదికి అడ్డంగా ఆనకట్టలు కట్టి ప్రవాహం దిశని తన అవసరాలకి తగినట్లుగా మళ్ళిస్తాడు.
ఏ జంతువుకూ లేని తెలివి తేటలని మనిషికి ఇచ్చింది ఎవరు ? మేము. మేమే!"
"ఇంతకీ మీరు చెప్పదల్చుకున్నది .....' అన్నాడు రాజు.
అసహనంగా అన్నాడు సిసిహ. .." అసలు విషయానికి వచ్చేముందు ఇంకొక్క విషయం చెప్పనీ ......ఈ ప్రక్రుతిలో కొన్ని నియమాలు వున్నాయి. కొన్ని న్యాయాలు వున్నాయి. ఆహార నిద్రామైధునాల విషయంలో ఒక్కొక్క జీవికి ఒక్కక్క రకం న్యాయాన్ని పెట్టింది ప్రకృతి. ఆకలేసినప్పుడు ఆహారం తింటాయి జంతువులు. నిద్ర టైం కి నిద్రపోతాయి. కొన్ని జీవులు రాత్రి నిద్రపోయి పగలు సంచరిస్తాయి. కొన్ని జీవులు పగలు విశ్రాంతిగా వుండి రాత్రిళ్ళు వేటాడుతాయి.
సీజనల్ గా వాటిలో మైధునం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సీజన్ తర్వాత అవి కలయికని కోరవు. స్థానబలిమి కోసం టెరిటరీ గురించి జంతుజాలంలో పోరాటాలు వుంటాయి. లీడర్ షిప్ కోసం పోట్లాటలు వుంటాయి.
కానీ-- మనిషి సంగతి వేరు. చాలా ముఖ్యమైన విషయం విను రాజూ! అన్ని జంతువులూ ప్రకృతి పెట్టిన న్యాయం ప్రకారం నడుచుకుంటాయి. ప్రకృతి ప్రేరణవలన పనులు చేస్తాయి. కానీ మనిషి అట్లాకాదు. ఆహార నిద్రా మైధునాల విషయంలో ప్రకృతి పెట్టిన నియమాల ప్రకారమే మనిషి నడవడు.
స్వతంత్రించి తనకు తానుగా తనకు నచ్చిన నియమాలు పెట్టుకున్నాడు. దొరికింది దొరికినట్లుగా తినాలన్నది ప్రకృతి న్యాయం. మనిషి ఆహారాన్ని ఇష్టమైతే పచ్చిది తింటాడు. లేదా ఉడకబెడతాడు. ఎండ బెడతాడు. ఉప్పులో ఊరేస్తాడు. నూనెలో వేయిస్తాడు. రుచి కోసం దానికి ఇదీ, దీనికి అదీ కలుపుతాడు. కాఫీ సంగతే చూడరాదూ- కాఫీ చెట్టు కాయలని కొసి, గింజలను ఎండబెట్టి, వాటిని వేయించి , పొడి చేసి, దానికి చికోరి కలిపి , కాఫీ పౌడరు తయారుచేసి , నీళ్ళను మరగబెట్టి , దానిలో ఈ పౌడరు కలిపి, ఫిల్టరులో వడకట్టి , పాలు పొంగించి, ఈ కషాయానికి పాలు కలిపి అందులో చెక్కెర వేసి ఆ వేడి కాఫీని ఊదుకుంటూ తాగితే ఆనందంగా ఉంటుందని మనిషి యెట్లా కనిపెట్టాడంటావ్? నిరంతరమైన ప్రయోగాలు! ఆ ప్రయోగాలు చేసే మేధస్సుని ఇచ్చింది మేమే.
అట్లాగే నిద్ర సంగతి తీసుకో. మనుషులందరూ పగలు మేలుకుని రాత్రిళ్ళు నిద్రపోతారు. నైట్ వాచ్ మాన్ రాత్రంతా డ్యూటీ చేసి పగలు నిద్రపోతాడు. ఫ్యాక్టరీలలో అవసరాలకు తగినట్లుగా అనేకమైన షిప్తులు వుంటాయి. పగటి షిప్టు, సాయంత్రపు షిప్టు, రాత్రి షిప్టు అలాగ! అందరు మనుషులూ రాత్రిళ్ళు నిద్రపోతే తెల్లారేసరికి న్యూస్ పేపర్లు మనకి అందవు. పొతే కామం. సంతానోత్పత్తి కోసం ప్రకృతి ఉద్దేశించిన ఈ ప్రక్రియ అనాదిగా మానవ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. మనిషి సెక్సు కోరికలకి పగలు లేదు. రాత్రి లేదు.సీజను లేదు. సిస్టం లేదు. విశృంఖలత్వం సెక్స్ అనేది ఒక బిగ్ బిజినెస్. సినిమాల దగ్గర్నుంచి అడ్వర్ టైజ్ మెంట్ల దాకా మనుషులందరికీ రాత్రింబవళ్ళు అదే పనా అన్నట్లుగా .." అని ఆగి, ఆయాసం తీర్చుకుని మళ్ళీ అన్నాడు సిసిహ.
పని అన్నాను కదూ. అన్ని జంతువులకు కొన్ని రకాల పనులు మాత్రమే వుంటాయి. ఆహారం కోసం వెదుక్కోవడం, పార్ట్ నర్ ని సంపాదించుకోవడం, నిద్ర .......తన సెక్యూరిటీ, తన టేరిటరీని రక్షించుకోవడం , సాటి జంతువులలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిచడం లేదా కనీసం తన స్థాన్నాన్ని నిలుపుకోవడం.... ఇవీ పనులు .
ఏ జంతువుకి ఆ జంతువూ తన పనిని తనే స్వయంగా చేసుకుంటుంది. చాలా అరుదుగా సింహం, చిరత అడవి కుక్కలు లాంటి జంతువులూ సామూహికంగా వేటాడి ఆపనిని కలిసి చేస్తాయి.
అంతే తప్ప , ఏ జంతువూ -- రిపీట్ -- ఏ జంతువూ కూడా ఇంకో జంతువూ కింద పని చెయ్యదు. అది కూడా జీతం డబ్బుల కోసం పని చెయ్యదు. కానీ, మనిషి తను డబ్బు ఇచ్చి ఇంకొకళ్ళ చేత పని చేయిస్తాడు. డబ్బు కోసం ఇంకొకళ్ళ దగ్గర పని చేస్తాడు. అంటే ఏమిటి ? ఆహారం కోసం వెదుక్కోవడం అనే ప్రకృతి సహజమైన పనిని మానేసిన మనిషి, ఇంకొకళ్ళ దగ్గర జీతానికి ఇంకేదో పనిచేసి, ఆ డబ్బుతో ఆహారం సంపాదిడన్నమాటా."
రాజూ -- మనిషి పరిణామదశలో బార్టరు పద్దతి నీకు తెలుసు. తనకు అవసరం లేని వస్తువును ఇచ్చి తనకు అవసరం ఉన్న వస్తువుని దాన్ని తను సొంతంగా సంపాదించకుండా పొందగలగడం బార్టరు పద్దతి.
అసలు వస్తువుల ప్రసక్తి లేకుండానే "సేవలు" అందించి వాటికి బదులుగా "డబ్బు" సంపాదించి , దానితో అవసరమైనవి -- ఆహారం - నిద్ర కోసం వసతి, నిద్ర పట్టడానికి స్లీపింగు పిల్సు -- నిదపోవడానికి మంచం, పరుపులు, దిండ్లు దుప్పట్లు సెక్స్ కోసం సొసైటీ ఆమోదించిన పార్ట్ నర్ , లేకపోతే టెంపరరీ పార్ట్ నర్ ని తెచ్చుకోవడం - వగైరా వగైరాలన్నీ "కొనుక్కోగలగడం " మనిషి కనిపెట్టిన నావెల్టీ . సృష్టీ నియమాలకు విరుద్దంగా , మనిషి ఎప్పుడూ తనకూ తానుగా కొత్త నియమాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.
అప్పట్నుంచీ బాష అవసరం ఏర్పడింది. తక్కిన జంతువూలకు బాష అవసరం అంతగా లేదు. ఆకలి, దాహం, కోపం తాపం, కోరిక, భయం లాంటి ప్రిమిటివ్ సెంటిమెంట్లను వెల్లడించే కొన్ని అరుపులు , కొన్ని రకాల బాడీ లాంగ్వేజ్ చాలు.
కానీ చాలా కంప్లికేట్ అయిపోయిన మనుషుల అవసరాలు, అనుభవాలు , అనుభూతులు వగైరాల కోసం కాంప్లికేటిడ్ బాష అవసరం అయింది. పదాలు పుట్టుకొచ్చాయి. వాటిని రికార్డు చేయడానికి అక్షరాలూ ఏర్పడ్డాయి" అన్నాడు సిసిహ.
వెంటనే అదోలా నవ్వి , అందుకుంది సృష్టి - సిహానా.
అక్షరాలు ఎప్పుడు పుట్టుకోచ్చాయో , అక్షరాలా అప్పట్నుంచే మనిషి మరింత కంప్లికేట్ అయిపోయాడు. మనిషి తనకు తను పెట్టుకున్న నియమాలను అక్షర రూపంలోకి మార్చడంతోనే అసలు తిప్పలు వచ్చాయి ......" అంది సృష్టి.
అది నిజమేనని తెలుసు రాజుకి.
సిసిహ అన్నాడు "పులి ఉందనుకో . పులి సంచారానికి కొన్ని కిలోమీటర్ల వైశాల్యం గల టెరిటరీ కావాలి. 'ఈ టెరిటరీ నాది' అని తెలియజేయడానికి అది కొన్ని చోట్ల మార్కు చేసుకున్నట్లుగా యూరిన్ స్ప్రే చేస్తుంది. కొన్ని చోట్ల చెట్ల బెరడు మీద గోళ్ళతో గీతలు పెడుతుంది. తక్కిన పోటీదారులకు ఆ హెచ్చరిక చాలు ."
నవ్వుతూ అంది సృష్టి.
