Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 45


    మధ్యలో ఒక దశ మిస్ అయిపొయింది.
    "తెలుసు .....దాన్నే మిస్సింగ్ లింక్" అంటున్నాడు.
    "సరిగ్గా మిస్సింగ్ లింక్ దశలోనే మేం మీ గ్రహానికి వచ్చాం. నిజం చెప్పాలంటే కోతికీ, మనిషికీ మధ్యన ఉండిన ఆ మిస్సింగ్ లింక్ మేమే!
    "మాకు తెలిసి మిస్సింగ్ లింక్ అంటే లూసీ అనే నరవానరం. డాక్టర్ లీకీ దంపతులు ఆఫ్రికా అరణ్యాలలో ఒక ఆస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఐదదుగుల పొడుగు ఉండే ఆ ఆస్థిపంజరం అటు పూర్తిగా మనిషీ, ఇటు పూర్తిగా కోతి కాని ఒక అడనరవానరానికి సంబంధించినదై ఉంటుందనుకుంటున్నారు. కెన్యా అడవుల్లో దొరికిన మనిషిలాంటి వాడి కపాలం ...."
    రాజు మాటలకి అసహనంగా అడ్డు వచ్చాడు సిసిహ.
    "అజ్ఞానం విజ్ఞానంగా చలామణీ కావడం అంటే అచ్చంగా ఇదే! మీ మనుషులకీ సంబంధించినంత వరకూ మిస్సింగు లింకు మేమేనంటే వినిపించుకోవేం!"
    "అంటే ఏమిటి మా వుద్దేశ్యం?" అన్నాడు రాజు.
    "అదే చెప్పోస్తోంది మేం రెండు లక్షల సంవత్సరాల క్రితం మా గ్రహం నుంచి మీ గ్రహానికి షికారుగా వచ్చాం.
    ఇక్కద మీ గ్రహం మీద దిగాం. ఎక్స్ పెరిమెంట్లు చేయడం నాకు సరదా. ఇక్కడ ఏం ఎక్స్ పెరిమెంట్లు చేయవచ్చునా అని చూశాం. అప్పుడు నిటారుగా నిలబడి నడుస్తున్న కోతుల జాతులు కనబడ్డాయి. కొమ్ములు లేవు. కోరలు లేవు -- కండలు లేవు కానీ గుండె బలమూ, మెదడులో తెలువీ ఉండి అందరినీ డామినేట్ చేయాలని చూస్తున్న ఆ జీవాల కోతి చేష్టలు మాకు ముచ్చట కలిగించాయి.
    భూగోళాన్ని ప్లానెట్ ఆఫ్ ఏప్స్ గా చేసి, భూగోళానికి కోతులనే సర్వదికరులుగా చేద్దామనుకున్నాం ."
    జాగ్రత్తగా వింటున్నాడు రాజు    
    "వింటున్నావా ....ఈ  భూమికి కోతులని సర్వాధికారులుగా చేద్దామని నిశ్చయించుకున్నాం. కానే కోతిని కాస్త ,మార్చి , నాగరికత నేర్పించి, దానికి "మనిషి"  అనే పేరు పెడితే బాగుంటుందని అనిపించింది. వింటున్నావా.....'మనిషి' కోతుల్లో నుంచి వచ్చాడని మీరు అనుకుంటారు. కోతులని మనుషులుగా మార్చింది మేమేనని" మీకు తెలీదు ."
    తదేకంగా చూస్తున్నాడు రాజు. ఇతను చెబుతోంది నిజమేనా?"
    రాజు అనుమానం గ్రహించిన సిసిహ మొహంలో కోపపు ఛాయలు కనబడ్డాయి.
    "అనుమానం -- అనుమానం .... అవునా...... ఒక్కసారి ఆలోచించు. కోతి క్రమంగా డార్విన్ పరిణామ సిద్దాంతం ప్రకారం దశలు మారి మనిషిగా మారిందే అనుకుందాం. మా లెక్క ప్రకారం కోతి తాలుకూ అన్ని దశలూ తెలిశాయి. కోతికీ మనిషికీ మధ్య వున్న ఒక్క దశ మాత్రం మిస్సయింది. దాన్నే మిస్సింగ్ లింక్ అంటున్నారు మీరు. అవునా .....బాగా ఆలోచించు రాజూ........అన్ని దశలలోనూ క్రమక్రమంగా కోతికి ప్రజ్ఞ పెరిగింది కానీ ఒకే ఒక్క దశలో కోతి మనిషిగా ఎట్లా మారిందీ?" ఒక్కసారిగా అన్నితెలివి తేటలు ఎట్లా వచ్చాయి? మనిషిగా మారీ మారగానే అంత అర్జెంటుగా నిప్పు చేయడం ఎట్లా కనుక్కుందీ? వ్యవసాయం ఎట్లా నేర్చుకుందీ? ఇళ్ళు ఎట్లా కట్టిందీ? బండి చక్రం ఎట్లా కనిపెట్టిందీ?
    మీరు చెప్పుకునే పరిణామ సిద్దాంతం ప్రకారం చూస్తె, కోతి దశ నుంచి మనిషిగా మారిన ఈ జీవి ఈ రెండు లక్షల సంవత్సరాల కాలంలో లింగు లిటుకుమంటూ ఇంకా నిప్పు తయారుచేయడంలోనూ, బాణాలు తయారుచేయడంలోనూ , బండి చక్రం తయారు చేసే స్థాయికి చేరి వుండేది. కానీ, ఊహతీతంగా , మనిషి మహా నాగరికతని సాధించి, గ్రహాంతర యానాలు చేసే  స్థితికి వచ్చాడంటే మాటలా? అది మా పుణ్యమే ! మేం చేసిన పనే .....క్లాసులో కొందరు పిల్లలకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి ఒక క్లాసు చదవనక్కర్లేకుండా చేసినట్లుగా , ఒక్క దశలోనే వంద దశల మార్పులు తెచ్చాం మేము.  మనిషి అనేవాడు మేము చేసిన సృష్టి " అన్నాడు గర్వంగా.
    నవ్వాడు రాజు.
    "ఎందుకా నవ్వు?" అన్నాడు సిసిహ.
    మీరు చెబుతున్నదంతా వింటుంటే ఒక విషయం గుర్తొస్తోంది నాకు.
    "మా భూగోళం మీదే, ఒక మైనారిటీ మతం ఉంది. రీలియన్ మతం అంటారు దాన్ని. ప్రపంచవ్యాప్తంగా ఓ నలబై వేల మంది రిలియన్ మతస్థులు ఉన్నారు. మీరు చెబుతున్న దానిలాగే వుంటుంది వాళ్ళ మత విశ్వాసం కూడా. ఎవరో గ్రహాంతరవాసులు వచ్చి ప్రాచీనకాలంలో ఇజ్రేల్ దేశం ప్రాంతంలో లేబొరేటరీలు పెట్టి మనుష్యులని తయారు చేశారని నమ్ముతారు వాళ్ళు."
    "నాకు తెలుసు. అది 1973 వ సంవత్సరం . ఆ మత స్థాపకుడు వోరిల్ హాన్ కి ఫ్రాన్స్ దేశంలోని ఓ అగ్నిపర్వతం దగ్గర ఈ మహా సత్యాన్ని వెల్లడించిన గ్రహాంతర వాసిని నేనే! అప్పుడే నాకు ఇంకో విషయం కూడా తట్టింది " అన్నాడు సిసిహ.
    "ఏమిటి ?"
    "రెండు లక్షల  సంవత్సరాల క్రితం మొదలెట్టిన మా ఎక్స్ పెరిమెంటు ఫెయిలయిపోయింది. మళ్ళీ కొత్త ఎక్స్ పెరిమెంటు మొదలెట్టాలి. కొత్త సృష్టి చెయ్యాలి అని" అన్నాడు సిసిహ.
    "ఏమిటి ?"    
    "రెండు లక్షల  సంవత్సరాల క్రితం మొదలెట్టిన మా ఎక్స్ పెరిమెంటు ఫెయిలయిపోయింది. మళ్ళీ కొత్త ఎక్స్ పెరిమెంటు మొదలెట్టాలి. కొత్త సృష్టి చెయ్యాలి అని" అన్నాడు సిసిహ.
    నవ్వు మొహం పెట్టి , అపనమ్మకంగా చూశాడు రాజు.
    నాకు తెలుసు నువ్వు నమ్మట్లేదు. కానీ నీకు నమ్మకం కలిగించడం నాకు ముఖ్యం! అన్నాడు సిసిహ.
    అంటూనే ,  తన జేబులో నుంచి కర్చీపు లాంటిది తీసి , నేలమీద పరిచాడు . అగ్గిపెట్టె సైజులో వున్న ఒక పరికరం తీశాడు.
    మీట నొక్కగానే , కర్చీపు మీద చిన్న చిన్న నలుసులల్లాంటివి కనబడ్డాయి.
    క్షణాల్లో ఆ నలుసులు పెసరగింజ లంత పెద్దవయ్యాయి!!
    చూస్తుండగానే అవి అరంగుళాల సైజు మనుషులుగా మారిపోయాయి !!
    నిమిషాల్లోనే పిల్లలు టీనేజర్స్ అయ్యారు. టీనేజర్స్ యువతగా మారారు.
    కర్చీపు మీదే పొలాలు కనబడ్డాయి. వీళ్ళు వాటిని దున్నడం మొదలెట్టారు. పంటలు -- కోతలు, బదులు చదువులు పరీక్షలు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, రోడ్లు, యాక్సిడెంట్లు, రైళ్ళు, విమానాలు, దేశాలు, దండయాత్రలు, యుద్దాలు , మారణ యుధాలు , మరణాలు జననాలు సమాధులు.
    కొద్ది సేపట్లో కర్చీఫు అంతా అరంగుళం సైజు మనుషులతో కిటకిటలాడిపోవడం మొదలెట్టింది. గ్రహాంతర యానాలు మొదలయ్యాయి.
    మేం దేవతలం - ఇదంతా మా మాయ అని ఆ అంగుష్ఠ మాత్రులకి అర్ధం కావడం లేదు. అంతా మా మాయ అని తెలియకే, ఇదంతా శాశ్వతం అన్న భ్రమతో వీళ్ళకి ఎంతటి అసంతృప్తి , ఎంతటి అసూయ ద్వేషాలు , ఎంత మదం, ఎంత మత్సరమో చూడు! అన్నాడు సిసిహ అపహాస్యంగా.
    కర్చీఫు మీద బుల్లి ప్రపంచం అల్లకల్లోలంగా వుంది. మతాలూ పుట్టాయి. మారణ హోమం సృష్టించాయి.
    "మీ మనుషులని కూడ మేం ఇట్లాగే సృష్టించాం -- అయితే సైజు తేడా! కావాలనుకుంటే మేం సృష్టించిన మనుషులని మేమే అంతరింపజేయగలం కూడా! ఇదిగో .....ఇంత సులభంగా!" అని, కర్చీఫు ని పైకెత్తి దులిపాడు సిసిహ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS