Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 44

 

    రాబర్ట్ కధవిన్న మోహినీ  అతని చెంపలపైన చేత్తోరాస్తూ అంది.

    "నీలాంటి  వ్యక్తి సాంగత్యం దొరకడం నిజంగా నా అదృష్టం రాబర్టు"

    మోహినీ  భుజాలచుట్టూ చేతులవేసి దగ్గరగా లాక్కున్నాడు రాబర్టు.

    "మోహినీ !"

    "ఉ"

    "నిన్నోక్క మాట అడుగుతాను. నిజం చేపుతావా?"

    మోహినీ  తలెత్తి చూసింది.

    "నువ్వింకా నన్ను నమ్మడం లేదా రాబర్టు" అడిగింది జాలిగా.

    "నిన్ను నేను  నమ్ముతున్నాను."

    "అయితే అడుగు"

    "నువ్వెంత మంది అమాయకుల్ని చంపి పూడ్చి పెట్టావ్?"

    అతని  ప్రశ్నకి బాంబు పడినట్టుగా  ఉలిక్కిపడింది  మోహిని.

    "రాబర్టు!" అంది  విస్మయంగా.

    "ఇలాంటి ప్రశ్న అడుగుతానని బహుశా గ్రహించి ఉండవు అవునా?"

    "నువ్వు నా గురించీ చాలా తప్పగా అంచనా వేశావు రాబర్టు. నేనింతవరకూ ఏ మనిషిని చంపలేదు."

    రాబర్టు  విస్మయంగా చూశాడు. పకపకమని నవ్వేశాడు.

    "భేష్  ఇంకా నీలో మార్పురాలేదు మోహినీ.  నీలో బేషజం చావలేదింకా!"

    "లేదు రాబర్టు నిజంచెబుతున్నాను. ఆ రోజు నిన్ను నా భర్తని  చెప్పి మొదటి సారిగా  నేను తీసుకొచ్చాను. నా భర్తవల్ల నాకేవిదమ్తెన సుఖాలు లేకపోయినా  పవిత్రంగా నే బతికాను కానీ నిన్ను చూపేక నాలోని ఆడతనం నిన్ను కోరింది. అందుకే అంత  సాహసంచేసి  నిన్ను తీసుకొచ్చాను. నీతో నా కోరిక తీర్చుకున్నాను. అంతే"

    రాబర్ట్ నవ్వేడు.

    "మరి నన్నెందుకు చంపాలనుకున్నావ్?" అడిగాడు  రాబర్టు.

    మోహినీ   అతనికేసి  ఆశ్చర్యంగా చూసింది.

    "నిన్ను చంపబోయానా?" అంది.

    "అనుకున్నాను  కానీ నువ్వు బాగా నటించగాలావుకూడా మోహినీ.   నా కళ్ళతో చూసిందాన్ని కాదని చెప్పడానికి ప్రయత్నంచి ఈ కౌగిలినించి దూరంకావద్దు" అన్నాడు.

    "నువ్వు అనే మాటలు నాకు అర్ధం కావటంలేదు" అంది కన్నీళ్ళతో మోహినీ

    "ఆ రోజురాత్రి మాలితో గోయ్యితవ్వించడం చూశాను. నువ్వు మాలితో ఫినిష్ హిం అనడం  విన్నాను"

    అతని  మాటలకి  మోహిని  పగలబడి నవ్వేసింది.

    "బలేవాడివే రాబర్టు. ఇదా నీ అనుమానం పక్కకి రిబిన్ వచ్చింది. దీనికి పిచ్చెక్కి మిగిలినవాటిని కరుస్తుంటే చంపేయ మన్నాను ఆ గొయ్యి తీసింది ఆ కుక్కని పాతేయడానికి" అంది మోహిని.

    "మాలి గొడ్డలిపట్టుకుని నా గదిలో కెందుకొచ్చాడు?" అడిగాడు.

    "కుక్కని కాల్చిచంపడానికి పిస్తోలుకోసం" చెప్పింది మోహిని.

    రాబర్టు  ఆమె మోహంలో  చూశాడు. నిజం  చెబుతోందా అన్న అనుమానం ఇంకా అతని మోహంలో కనబడ్డంతో మోహినీ చెప్పింది.

    "నీకెలా చెబితే నమ్ముతావో తెలిడంలా" అని నువ్వు నాతో రా" అంది మోహిని  మంచం  మించి లేస్తూ.

    "దేనికి?"

    "ఈ వేళకూడా ఓ కుక్కని చంపేశాడు మాలి. దానికి రోజే మందు పెట్టాడు దాన్ని పూడ్చి పెట్టమన్నాను. కావాలంటే చూద్దువుగాని పద" అంది.

    మోహినితో పాటుగా తోటలోకి నడిచాడు రాబర్టు.

    మాలి నేలమీద బోర్లా పడుకున్నాడు. రాబర్టు నవ్వుకున్నాడు.

    "మాలి....మాలి...." అని పిలిచింది మోహిని.

    "వాడప్పడే లేవడు నేనే కొట్టాను" అన్నాడు రాబర్టు.

    రాబర్ట్ అప్పడే చూశాడు అక్కడికి  కాస్త దూరంలో  ఓ పెద్ద కుక్క చచ్చిపడి వుంది.

    మోహిని అతన్ని చూసి___
   
    "తీరిందా ధర్మ సందేహం పద" అంది. రాబర్టు చేతిని పట్టుకుని  నడుస్తోంది మోహినీ .

    "మరి శశిభూషణ్ నీ ఏం చేయ్యలనుకున్నావ్ ?" అడిగాడు రాబర్టు.

    "చంపాలనే అతనంటే నాకు అసహ్యం. నీవల్ల బతికిపోయాడు రాస్కెల్ "అంది మోహిని.

    రాబర్టుతో పాటుగా గదిలోకి వచ్చాక  గది తలుపులు  వెస్తూ అంది మోహిని.

    "నిజంగా నేను అదృష్టవంతురాల్ని. ఆ రోజు నన్ను అపార్ధం చేసుకొని  పారిపోయావు నువ్వు. తిరిగి నువ్వు కనిపిస్తావనుకోలేదు. శశిభూషణ్ నాకు శత్రువే అయినా అతనివల్లె మళ్ళి నువ్వు నాకు కనబడ్డావు రాబర్టు ఐ లవ్ యూ" అంది మోహిని అతనిపైన వాలిపోతూ.

    రాబర్టు మోహినినీ  పొదివి పట్టుకుని  మంచం దగ్గరగా నడిచాడు.

    "ఈ రాత్రి నిన్ను నిద్ర పోనివ్వను" అంది మోహిని.

    రాబర్టు ఆమె చేతుల కిందినించి  తన చేతుల్ని  పోనిచ్చి దగ్గరగా  తీసుకుని ఆమె పెదవుల్ని చుంబించాడు. అతని  చేతులు మెల్లగా ఆమె సన్నని నడుం పైకి  జారుతున్నాయి.

    "రాబర్టు  నన్ను  వదిలిపెట్టి వెళ్ళిపావుగా?" అడిగింది మోహిని.

    "అండే నిప్పని గుప్పిట ఎంత సేపు పొవుగా?" అడిగింది మోహిని.

    "మండే  నిప్పని గుప్పిట ఎంత సేపు బిగించగలవు?" అడిగాడు.

    "అంటే?"

    "నీతో వుండాలని వున్నా, నాలో రగిలేజ్వాల హంతుకులని  వెదికి హతమార్చే వరకు చల్లారదు మోహిని. అటతర్వాత ఈ రాబర్టు ఏమవుతాడో బహుశా నేనే వుండక పోవచ్చు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS