"అది నీవల్ల అయ్యాపని కాదు రాబర్ట్ ఈ శశిభూషణ్ చిత్రవధ చేసైగానీ నాకు మనశ్శాంతి లేదు"
"మోహినీ " కటువుగా పిలిచాడు రాబర్ట్.
"ఏమిటి?" అంది.
"నువ్వు అస్టాల్ ఆడదానివి. నిన్ను చూస్తేనాకసహ్యం చంపేయాలన్నంత కోపం నాకుంది. ఎందుకో తెలుసా? 'పగ' అన్న రెండక్షరాలకి అర్ధం తెలీని మూర్ఖురాలివి. శశిభూషణ్ నీకు చేసిన ద్రోహానికి పరిహారంగా అమాయకుల జీవితాలతో ఆటలాడటం నేరం మోహినీ" రాబర్ట్ మాటలకి మోహిని రుసరుసలాడుతూ చూసింది.
"చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలని అంటారు ఇందుకే కాబోలు" నవ్వేడు రాబర్ట్.
అతని చేతిలో పిస్తోలు నిగనిగలాడుతూ కనబడేసరికి మోహినీ ఓ అడుగు వెనక్కి వేసింది.
రాబర్ట్ చేతిలో పిస్తోలుని చూడగానే శశిభూషణ్ ప్రాణం లేచి వచ్చింది.
రాబర్టు ఓ అడుగు ముందుకేసాడు. అతని కళ్ళెర్రగా వున్నాయి జుత్తు చెదిరిపోయి మొహం పిక్కుపోయి విశ్రాంతి లేనివాడిలా వున్నాడు.
"మోహినీ, నీ కథ విన్న తరువాత ఇతన్ని చూసైచిత్ర హింసలకి గురి చెయ్యాలని నాకూ అనిపించింది.కానీ అతని భార్యకి నేను మాటిచ్చాను అతన్ని కాపాడుతానని అంతేకాదు. నీ జాలి కథే కనక నేను వినకపోతే ఈ వేళ నీ ప్రాణాలు అనంతంలో ఎప్పుడో కలిసిపోయి వుండేవి మనిషి వంచనకి గుర్తేతే ఆ మనిషి గుండెల్లో రగిలేజ్వాల ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీపట్ల నాకు సానుభూతే గానీ, పగేమిలేదు మోహినీ"
మోహినీ కళ్ళలో నీరు సుడులు తిరిగింది.
"రాబర్టు" పిలిచింది మోహినీ.
"ఏమిటి?
"నిన్నోక్కటడుగుతాను చెప్తావా?" అంది.
"చెప్పు"
"ప్లీజ్ నన్ను చంపేయ్" అంది మోహిని
"నేను మనుషుల్ని చంపే ప్రోఫేషనల్ని కాదు. నా జీవితంలో ఆదుకొన్న వాళ్ళని అంతం చేయబోతున్న మృత్యువుని నేను
మోహినీ అడుగువెస్తూ వచ్చింది రాబర్టు దగ్గరకి.
రాబర్టు చేతిలో పిస్తోలు గురిచేసి పెట్టాడు.
"నువ్వు శశిభూషణ్ నీ తీసుకెళ్ళు" అంది స్ధిరంగా మోహిని.
ఆమెలో ఆ మార్పు వస్తుందని రాబర్టుకి ముందే తెలుసు.
"రాబర్టు మంచం దగ్గరకెళ్ళి శశిభూషణ్ కట్లు విప్పదిశాడు.
మోహినీ గోడకి చేరగిలబడినించుండి నిస్సహాయంగా చూసింది.
రాబర్టు! ప్లీజ్ , అతన్ని వెంటనే వెళ్ళిపొమ్మను అతన్ని నేను క్షమించలేను ఆ రాస్కేల్ని పొమ్మను దయచేసి బయటికి వెళ్ళి పొమ్మని చెప్పు" జుత్తు సిక్కొని ఏడుస్తూ ఆరుస్తోంది మోహిని రాబర్టు శశిభూషణ్ కి స్తెగా చేశాడు.
అతను తలోంచుకుని వెళ్ళిపోతుంటే వెనకే రాబర్టు నడవ బోయాడు.
అతని కాలు పట్టుకొని లాగినట్టుయింది. రాబర్టు తలతిప్పి చూశాడు.
మోహిని - నేలమీద బోరున ఏడుస్తూ అతన్ని ఆపడానికి ప్రయత్నస్తోంది.
"ఏమిటిది" అన్నాడు రాబర్టు.
"రాబర్టు! నువ్వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ...నువ్వు ఇక్కడే ఉండిపో"
మొహిననీ పూర్తిగా మార్పు వచ్చిందని ఆమె నటించడం లేదని రాబర్ట్ గ్రహించాడు.
ఆమె కన్నీటిలో దోషం లేదిప్పుడు.
మోహినీ లేచినించుని అతన్ని పెదిమిల్ని అందుకోంది.
రాబర్టు ఆవిడ భుజం ప్తెన మెల్లగా తట్టాడు.
మోహినినీ ఓదార్చాడు రాబర్టు. అయినా ఆమెలో నిరుత్సాహం కొట్టొచ్చినట్లుగా కనబడుతూనే వుంది.
"నాకు ఆకలిగా వుంది" అన్నాడు రాబర్టు.
"పద" అంది.
రాబర్టు గదిలో కూర్చున్నాడు. మోహిని అతను కూర్చున్న గదిలోకి ఆపిల్స్ , చపాతీలు కూర తీసుకొచ్చింది.
"నువ్వూ తీసుకో" అన్నాడు.
"నాకు ఆకలిగాలేదు" అంది.
రాబర్టు అది తిని మంచం ప్తెన వాలిపోయాడు.
మోహిని వచ్చి అతని పక్కనే పడుకొని అతని గుండెప్తెన చేత్తోరాస్తూ వుండిపోయింది.
"చిన్నపామున్తేనా పెద్దకర్ర కొట్టమన్నావ్. మరిప్పుడు పక్కలో పడుకున్నావేం" అడిగింది మోహిని.
"నేనూ నీజాతివాడినే మోహినీ" అన్నాడు రాబర్ట్.
మోహినీ మెల్లగాలేచి అతని గుండెలప్తెన వాలింది.
"అన్నివుండి నేనూ, అన్ని పోగొట్టుకుని నువ్వు, ఎందుకిలా అగ్నిలోపడి కాలిపోతున్నాం?" అడిగింది మోహిని.
ప్రేమించిన మనిషి మోసం చేశాడన్న ఆవేశం నిన్నో పిచ్చి దాన్నీ చేసింది కానీ ప్రేమించిన ప్రియురాలిని పోగొట్టుకుని నన్ని పరిస్ధితికి తీసుకెళ్ళినా వాళ్ళప్తెన ప్రతీకారవాంచతో రాగులుతున్న అగ్నిగోళన్నీ నేను"
"అంటే?"
మోహిని జాలిగా అడిగింది.
రాబర్టు కళ్ళలో నీరు తిరిగింది.
