Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 43


    ఈ సీరియల్ ప్రభంజనం ఉన్నప్పుడే హరిణి పేరుని కేష్ చేసుకోదలచుకుంటున్నారన్నమాట!
    గుడ్! అది సహజమే.
    కానీ, హరిణి ఇక్కడికి రావడం ఎందుకు మానేసింది?
    మళ్ళీ అదే ప్రశ్న!
    ఆప్రశ్నకు సమాధానం మరికొద్ది క్షణాలలోనే దొరికింది ఎడిటర్ కి.
    "ఏం నవల వేస్తున్నారు? టైటిల్ ఏమిటి?" అన్నాడు పబ్లిషర్ తో.
    "ది ట్రిక్' సర్"
    "వాట్?"
    "ది ట్రిక్" సర్"
    అప్పుడు చూశాడు ఎడిటరు పబ్లిషర్ తెచ్చిన యాడ్ వైపు.
    "మొదటి నవలతోనే సంచలనం సృష్టించిన యంగ్ రైటర్ హరిణి మరో అద్భుత సృష్టి.
    "ది ట్రిక్"
    ఎట్ సేటేరా, ఎట్ సేటేరా!
    ఆ నవల తను హరిణి రెండో సీరియల్ గా వేస్తానని చెప్పింది. ఆమె ఇంత క్రేజ్ ఉన్న రైటరు కాకముందే చెప్పాడు ఆ మాట, ఆమెని ప్రోత్సహించడం కోసం.
    ఒక సీరియల్ తోనే మారిపోయి, డబ్బుకోసం మాటతప్పే స్థితికి ఎదిగిపోయిదన్న మాట ఈ యంగ్ రైటర్!
    కొద్ది రోజుల క్రితం ఆమె అన్న మాటలు అతని చెవిలో ఇంకా గింగురుమంటునే ఉన్నాయి.
    "సర్! నాకు దేవుడు నిజంగా వున్నాడో లేడో తెలియదు నాకు తెలిసిన దేవుడు మాత్రం మీరే సర్!
    నిజంగా మీరే"
    స్తబ్ధత ఆవరించింది అతని మనసుని.


                              *     *    *    *

    మాచెర్ల మెయిన్ రోడ్ మీదికి తను వచ్చీ రాగానే దాదాపు తనపై ఉరుకుతున్నంత రాష్ గా ఒక జీపు దూసుకుపోవడం గుర్తు వచ్చింది ఉదయార్కర్ కి.
    యాదృచ్చికమే అయి వుండవచ్చు ఆ సంఘటన కానీ ఇంతకు ముందు బ్యూటీక్లినిక్ లో తనకి జరిగిన అనుభవం తను ప్రతి సంఘటననీ మరో యాంగిల్ లో నుంచి అలోచించి కీడు శంకించేలా చేస్తోంది.
    ఆ జీపు తనని డాష్ కొట్టబోవడం కాకతాళీయమే వుండవచ్చు మేబీ!
    ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నాడు అతను.
    చిక్కటి అరణ్యంలోనుంచి పయనిస్తున్నారు అతనూ, బ్రహ్మచారి, స్మేల్లర్, దుర్గయ్య సన్నటి పాములు కాళ్ళకి పెనవేసుకుంటున్నట్లు పాదాలని పెనవేసుకొంటున్నాయి లతలు. ఆకాశం కనబడకుండా పచ్చటి పందిరి వేసినంత దట్టంగా పెరిగి వున్నాయి పెద్ద పెద్ద చెట్లు. వాటిమధ్య నుంచి దారి చేసుకు దూసుకొస్తున్న సూర్యకిరణాలు లేజర్ బీమ్స్ లాగాకనబడుతున్నాయి.
    రోజుల తరబడి నడుస్తూనే ఉన్నారు అడవిలో వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్న ఆ దారి అంతా తనకు కొట్టినపిండే అన్నట్లు తడుముకోకుండా దారి తీస్తున్నాడు బ్రహ్మచారి. ఆ ప్రాంతంలో ఎక్కడా జనసంచారం బొత్తిగా లేదు. మనిషి అనేవాడు కనబడి వారం రోజులు దాటుతోంది వాళ్ళకి.
    హటాత్తుగా ఒకచోట ఆగిపోయాడు స్మేల్లర్.
    అతని మొహంలోకి పరీక్షగా చూస్తున్నాడు బ్రహ్మచారి "ఏమిటి" అన్నాడు నిదానంగా.
    "మనిషి వాసన!" అన్నాడు స్మేల్లర్.
    తల పంకించాడు బ్రహ్మచారి.
    మళ్ళీ నడక సాగించారు అందరూ.
    ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఉదయార్కర్. అతని ఆశ్చర్యాన్ని గమనించి అన్నాడు బ్రహ్మచారి. "ఘ్రానేంద్రియం మనుషుల కంటే జంతువుల్లో ఎక్కువగా చురుగ్గా పనిచేస్తుంది. అల్లంత దూరంలో ఉండగానే మనిషి వాసన పసికడుతుంది పులి. ఒక్కొక్క మనిషి శరీరానికి ఒక్కొక్క ప్రత్యేకమాయిన వాసన ఉంటుంది. అలాంటి వాసనలు నాలుగొందల పైనే వున్నాయని అంచనా. అలా వాసన చూసి పసిగట్టే శక్తి స్మేల్లర్ కి ఉంది. మనుషులనేమిటి? బంగారాన్నే పసిగట్టగలడు గదా అతను" అని నవ్వాడు బ్రహ్మచారి. అతను నవ్వు తుంటే బ్రహ్మరాక్షసుడు నవ్వుతున్నట్లే వుంది.
    మౌనంగా వింటూ నడుస్తున్నాడు ఉదయార్కర్.
    "ఈవాసన అనేదే వశీకరణ విద్యలో కూడా ఒక ముఖ్యాంశం" అన్నాడు బ్రహ్మచారి.
    "ఎలా!" అన్నాడు ఉదయార్కర్.
    "ఉదాహరణకు మరుల మాతంగి అనే మొక్క ఒకటి ఉంటుంది. దానిని చిన్న చిన్న ఆకులు. ఆ ఆకులని యూరిన్ లో పచ్చి నక్క, బల్లి తోకలో కలిపి ఊరేసి గోంగూరతో కలిపి నూరతారు. అది వలచిన స్త్రీ నెత్తిమీద పెడితే ఆమె దాసానుదాసురాలాయిపోతుంది. అంటే, ఇక స్మెల్ ని ఆమె మర్చిపోలేక, ఆ వ్యక్తీ కోసం తపించి పోతుందన్న మాట. ఇంక దానికి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గదు."
    "అయితే దానికింక విరుగుడు లేదా?" అన్నాడు ఉదయార్కర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS