రాబర్ట్ నీటి గొట్టం పట్టుకొని మెల్లగా పైకి పాకాడు, చీకటిగా వుండడంచేత అతనేవారికీ కనబడడు.
బాల్కానీ లోకి చేరాడు రాబర్టు అక్కడే ఓ క్షణం నించుని చుట్టూ పరికించాడు.
ఎవరూలేరని నిశ్చయించుకుని ఒక్కొక్క గదినీ పరీక్షగా చూస్తూ నడుస్తున్నాడు.
ఓ గది ముందు అతను నిలబడ్డాడు. తలుపు తీసి వుంది.
ఆ గదే!
ఆ రోజు తనని తీసుకెళ్ళింది ఆ గడిలోకే. లోపల్నుంచి మాటలు వినబడుతున్నాయి.
రాబర్ట్ తొంగి చూశాడు.
మోహిని అపరాశక్తిలా నించుని వుంది. శశిభూషణ్ కాళ్ళూ చేతులూ కట్టిపడేసి వున్నాడు. అతను దీనంగా చూస్తున్నాడు మోహిని కేసి.
"హు. డబ్బు కోసం ఆశపడి ప్రేమించి నన్ను మోసం చేసిన మోసగాడివి నువ్వు నిన్ను క్షమించాలా?" అంటుంది మోహిని.
"లేదు మోహినీ నిన్ను మోసం చెయ్యాలనుకోలేదు. నువ్వే నన్ను అపార్ధం చేసుకున్నావు" అంటున్నాడు శశిభూషణ్.
"ఏమిటి అపార్ధం చేసుకొనేది ప్రేమించానని నమ్మించి' నన్ను లోబరుచుకుని నీ కోరికలు తిర్చుకోడం తప్పు కాదనుకో మంటావా డబ్బుకి కక్కుర్తిపడి ఇంట్లో ఆడదాన్ని పెళ్ళి చేసుకోడం తప కాదనుకొమంటావా? నువ్వు చేసిన వంచన నేను మరచిపోలేను భూషణ్ నువ్వంటే నాకు అసహ్యం నిన్ను చిత్ర వధ చేసి చంపాలని తీసుకొచ్చాను. నిన్ను క్షమించడం అనేది నేనేకాదు ఏ ఆడదీ కూడా చేయదు" ఆవేశంగా అంటోంది మోహినీ.
రాబర్ట్ కి శశిభూషణ్ మోహినీ కి మధ్య గల సంబందం పూర్తిగా అర్ధం అయింది.
శశిభూషణ్ అంటే అసహ్యం వేసింది. కానీ కాశ్మీర కిచ్చిన మాటకోసం అతన్ని రక్షించాలి.
"భూషణ్, ఆడది మగాడ్ని ఎంతగా నమ్ముతుందో, ఎంతగా ప్రేమిస్తుందో, మనసు విరిగిపోయినప్పుడు అంతగానూ ద్వేషిస్తుంది. అవసరం అయితే ఆ మనిషి ప్రాణాలు తియడానికి వెనకాడదు నీకు మనసనేది లేదు వెధవ్వి నువ్వు ఆడదానికుండే విలువనీ గ్రహించలేని ఆధముడివి నువ్వు నువ్వు ఆడిన నాటకంలో చిత్తుగా ఓడిపోయి జివితాన్ని ఎండిపోయిన మోడుగా చేసుకున్న అభాగ్యురాలిని. నా గుండె ల్లోంచి ప్రవహించే లావాలో నువ్వు కొట్టుకుపోవాల్సిందే, నీమీద కక్ష తీర్చుకోవాలనే ఈ అంతస్తుకి చేరాను. నేను చేసేపని దేవుడికికూడా తీర్చుకోవాలనే ఈ అంతస్ధకి చేరాను. నేను చేసేపని దేవుడికికూడా తెలీదు" అంటూ కొరడాతో శశిభూషణ్ నీ కొడుతుంది మోహిని.
అక్కడ నించుని చూస్తున్న రాబర్ట్ కి ఆమె అతనికి విధిస్తున్న శిక్ష సర్తేనదే అనిపించింది.
"మోహినీ పిజ్ నన్ను విడిచిపెట్టు నాబార్య అమాయకురాలు నేనేమన్నా అయితే కాశ్మీర ఒంటరిద్తే పోతుంది నేను చేసింది అన్యాయమే అని ఒప్పకుంటున్నాను. ప్లీజ్ నన్ను విడిచిపెట్టు" బ్రతిమాలాడు తున్నాడు శశిభూషణ్.
ఏం చెయ్యాలి ? రాబర్ట్ ఆలోచనలో పడ్డాడు. మోహినీ వరకు ఆలోచిస్త్ర్హే ఆమె చేస్తున్నది న్యాయంగానే వుందతనికి.
కానీ కాశ్మీర పట్ల శశిభూషణ్ మోహినికి వ్యక్తపరచిన అభిప్రాయం విన్నాక అతన్ని కాపాడాలనిపిస్తోంది.
ప్రేమని నమ్మి మోసపోయింది మోహిని. ఆమెలో ఆ మోసగాడిపై రగిలిన జ్వలకి ఆ ప్రేమజజ్వాలకి శశిభూషణ్ ఆహుతి కావాల్సిందే.
మోహినీ ప్రేమించిమోసం చేసిన మనిషిపైన పగ తీర్చుకోవాలనుకుంటోంది.
తను?
తన ప్రియురాలిని చంపిన హంతకులపైన పగ తిర్చుకోవాలను కుంటున్నాడు.
నలిగిపోయిన మనసుతోనూ జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ ఇద్దరూ కరక్టే.
కానీ మోహిని చేస్తున్న పనులు విపరీతంగా వున్నాయి.
రగిలే ప్రేమజ్వలతో అందమ్తెన కుర్రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పోవాల్సిందేనా ! బలి కావల్సిందేమా?
రాబర్ట్ చూశాడు.
మోహినీ అలిసిపోయింది. రోప్పతోంది. ఆయాసపడుతోంది.
శశిభూషణ్ ఏమీ చేయలేని స్దితిల్ నిస్సహాయింగా చూస్తూ న్నాడు.
"నిన్నిలా కాదు" అంటూ.
"మాలి" అని కేక పెట్టింది మోహిని.
"మాలిరాడు" అన్నాడు రాబర్ట్ గుమ్మంలో నిలబడి అతని గొంతు విని మోహిని వెనక్కి తిరిగింది.
అతన్ని చూస్తూనే కంగారు.
"నువ్వా రాబర్ట్ " అంది.
"అవును నేనే!" అన్నారు రాబర్ట్ లోపలికి వస్తూ.
"నువ్వా? ఎలా వచ్చావిక్కడికి?" అడిగింది మోహిని.
రాబర్ట్ ఎగతాళిగా నవ్వేడు.
"నేనెక్కడిక్తేనా రాగాలను" అన్నాడు.
"నీ ప్రాణా పైన ఆశ వుంటే ఎలా వచ్చిన వాడివి అలాగే వెళ్ళిపో " అంది మోహిని.
"తప్పకుండా వెళ్ళిపోతాను. నేనేం నీతో సరసాలడ్డానికి రాలేదు శశిభూషణ్ నీ తీసుకొని వెళతాను"
