Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 41

    అంతవరకూ తన ప్రయత్నాని కేవిధమ్తెన అంతరాయమూ కలగక పోవడంతో రాబర్టు ఉత్సాహంగా అడుగులు ముందుకు వేశాడు.


    మోచేతులకి అంటిన  దుమ్ముని  దులుపుకున్నాడు రాబర్ట్ అతని  బూటు కాళ్ళకిందపడి ఎండిపోయిన  ఆకులు శబ్దం  చేస్తున్నాయి.

    అతనిలో రక్తం వేగంగా ప్రవహిస్తోంది.

    ఇక మిగిలింది 'మాలి'

    వాడిని  తప్పించుకుంటే ఏ విధమ్తెనా కష్టం లేదతనికి.

    వాడి కంటబడితే నిర్దాక్షిణ్యంగా తనని గొడ్డలితో నరికేస్తాడు.

    రాబర్టు చేతిలో పిస్తోలుంది. ఆ రోజునించీ దాన్ని జాగ్రత్తాగా అట్టిపెట్టాడు మళ్ళా ఆ పిస్తోలు ఆసరాతోనే ఆ బంగళాలో ప్రవేశించాడు.

    ఒకసారి అదే తన ప్రాణాన్ని కాపాడింది.

    రాబర్టు  ముందుకు తూలిపడ్డాడు.

    కాళ్ళకేదో మెత్తగా తగిలింది.

    అక్కడేదో తవ్విపోసిన మట్టి  కుప్ప. దాని పక్కనే  లోతుగా తవ్విన గొయ్యి.

     రాబర్టుకి అర్ధం  అయింది.

    మోహినీ  తన ప్రయత్నంలో  తనున్నదన్నమాట.

    అది  శశిభూషణ్  కోసం తీసిన గొయ్యి అని రాబర్టుకి తెలుసు.

    తన  కంఠంలో ప్రాణముండగా ఆ కామినీ  పిశాచి ఆటల్ని సాగానివ్వడు రాబర్టు.

    శశిభూషణ్ ప్రాణాలతో వున్నాడో? లేడా?

    ఆ ఆలోచన రాగానే ఓ క్షణం వణికిపోయాడు రాబర్టు.

    ఇంకా ఆలస్యానికి  వ్యవధిలేదు.

    చెట్లు గాలికి  కదులుతూ చేస్తున్న అలికిడి చీకటిలో మసక మసకగా  కనిపిస్తున్న నీడలు.

    ఎక్కడో గుడ్లగూబ అరిచింది.

    ఉలిక్కిపడ్డాడు రాబర్టు.

    రాబర్టు మెల్లగా లేచి పోర్టికో వ్తేపు నడిచాడు. చీకటిలో చీడీలు ఎక్కి వరండాలో  కొచ్చాడు.

    అక్కడేవరూ లేరు.

    ద్తేర్యంగా తలుపుప్తెన చెయ్యివేసి చూశాడు.

    తలుపులోపల గెడవేసి వుంది.

    తాళంవేసే కన్నంలోంచి  చూశాడు.

    హాలులో బెడ్ ల్తెట్ వెలుగుతోంది.

    సోఫాపక్కనే కార్పెట్ ప్తెన పడుకున్నాడు మోహిని భర్త.

    "పాపం అతని కింట్లో జరిగే దారుణాల గురించి తెలిదుకదా!" అనుకున్నాడు రాబర్టు.

    లోపల కెలా వెళ్ళడం?

    తలుపుకొడితే?

    కోరి అపదని ఆహ్వానించినట్టవుతుంది.

    మోహినీ దొంగముండ ఎంతపని చేసింది అనుకున్నాడు రాబర్టు. దాని ఆట కట్టించాలి. లేకపోతే యింకా ఎంతమందిని బలి తిసుకోంటుందో? ఆ ఊహ అతనికి కలగడంతో అతని మొహం ఎర్రగా తయారయింది.

    రాబర్టు చిడీలు దిగి మేడమీద వెనక భాగంలో కొచ్చాడు.

    మేడమీదికి వెళ్ళడానికి  మార్గం ఏదన్నా కనబడుతుందేమోనని అతని కళ్ళు అన్వేపిస్తున్నాయి.

    "ఏం చెయ్యాలి?"  అతను చురుకుగా  ఆలోచిస్తున్నాడు.

    "ఆగు"

    ఆ గొంతు విని అదిరిపోయాడు రాబర్ట్.

    చీకటిలో చూశాడు.

    ఆ నల్లని ఎత్తైనా  ఆకారాన్ని పోల్చుకున్నాడు రాబర్టు.

    'మాలి'

    అతని చేతిలో గొడ్డలి తళతళమని మెరుస్తోంది. రాబర్ట్ కి ఏం చెయ్యాలో తోచలేదు.

    "ఎవరు నువ్వు?" మాలి ముందుకువస్తూ అడిగాడు.

    రాబర్టు మాట్లాడలేదు. వేగంగా ఆలోచిస్తున్నాడు రాబర్ట్.

    పిస్తోలు కాలిస్తే శబ్దానికి మోహిని రావచ్చు. ఆ బంగళాలో యింకా ఎంతమంది వున్నారో తెలీదు. తెగింపుతో పిస్తోలు చేత్తో పట్టుకుని  నిలబడ్డాడు.

    మాలి చేతిలో గొడ్డలిగాలిలోకి లేచింది.

    "ఆగు" రాబర్టు సింహాకిషోరంలా అరిచాడు. మాలి అతని తెగింపుకి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు.

    "పిచ్చివేషాలు వేస్తే ఆరుగుళ్ళు నీ గుండెలోంచి దూసుకు పోతాయిమాలి" అన్నాడు రాబర్టు.

    మాలి రెండడుగులు వెనక్కి వేశాడు.

    "మనిషుల్ని చంపడం  నాకు  అలవాటులేదు కానీ అవసరంఅనుకుంటే మాత్రం కుక్కని చంపినట్టు చంపడం నాకిష్టం" అన్నడు రాబర్టు.

    మాలిలో జంకుని చూపేక రాబర్టులో వెయ్యి ఏనుగుల బలం చోటు చేసుకొంది.

    "చేతిలో గొడ్డలిని కింద పడేయ్ మాలి"

    అతను చెప్పినట్టే చేశాడు మాలి.

    "గుడ్ వెనక్కి తిరిగి నుంచో"

    మాలి వెనక్కి తిరిగి నించున్నాడు.

    రాబర్టు మెల్లగా అతని వెనకగావెళ్ళి జేబులోంచి కర్చీఫ్ నీ తిసి  మాలి ముక్కు దగ్గర పెట్టాడు. మాలి గింజుకున్నాడు. కానీ రెండునిముషాల్లో పర్వతంలా కిందకి ఒరిగిపోయాడు.

    అది క్లోరోఫారం వున్న కర్చీఫ్ అంచేత మలి మరో రెండు గంటలవరకు ఖచ్చితంగా స్పృహలోకిరాడు.

    రాబర్టు కొండంత ద్తేర్యంతో ముందుకి కదిలాడు ఇప్పడతనికి వందమంది శత్రువుల్ని ఎదుర్కో గల మనోద్తేర్యం అతనిలో కలిగింది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS