Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 40

 


    "నువ్వు నన్ను ప్రేమించలేదా కాశ్మీరా" అతను అనుకోకుండా అడిగాడు.

    అతనలా అడిగేసరికి కాశ్మీర బావురుమంది. కట్టుకున్న భర్తని  పోగొట్టుకోలేదు.

    ప్రేమించిన ప్రియుడ్ని కాదనలేదు.

    ఈ చిత్రమ్తెన పరిస్ధితిలో చిక్కుకొని ఆమె నలిగిపోతూ విలపిస్తుంటే రాబర్టు ఆమె భుజాలను పట్టుకుని లేవదీసి గుండెల్లోకి చేర్చుకున్నాడు.

    "కాశ్మీరా!"

    మెల్లగా ఆమె కన్నీటిని  తుడిచి పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు.

    "కాశ్మీరా!"

    ఆమె మెల్లగా కన్నీటి  కళ్ళతో తలెత్తి అతన్ని  చూసింది.

    "ఆడదానికి ప్రేమించిన ప్రియుడికంటే భర్తే ముఖ్యమని ఋజువు చేశావు. నాకోసం  అతన్ని దూరం చేసుకోమని  చెప్పేంత నిచుడ్ని కాదు నేను. బతకడం చేతకాని మనిషిని నేను ఒక విధంగా నా చేతికానీతనమే నాకు అందర్నీ దూరం  చేసింది నీ భర్తని క్షేమంగా తీసుకొస్తాను. చేసిన పాపాని కి విధంగాన్తేనా పరిహారం చెల్లించు కొంటాను కాశ్మీరా!" అన్నాడు రాబర్టు.

    "రాబర్టు"

    అతను ఆమె దగ్గరగా  వచ్చాడు.

    "నిన్ను మనసారా విజయ్  అని పిలవాలనుంది" అంది కాశ్మీర.

    రాబర్టు  ఆమెని గభాల్న కౌగలించుకున్నాడు.

    "విజయ్?" అంది కాశ్మీర.

    "కాశ్మీరా నిన్ను నేను ప్రేమిస్తున్నాను" అన్నాడు రాబర్టు.

    అతని మాటల్ని నమ్మలేనట్టు చూసింది కాశ్మీర.

    అతని మాటల్ని నమ్మలేనట్టు చూసింది కాశ్మీర.

    అతను ఆమెని వదిలిపెట్టి.

    "బై బై " అంటూ బయటికి నడిచాడు.

    కాశ్మీర అతనేళుతున్న  వేపు దిగులుగా చూస్తూ నిలబడిపోయింది.

                                                   *    *    *   

    చీకటి చిక్కగా వుంది. ఆ రోడ్డు నిర్మానుప్యంగా వుంది.

    చుట్టూ కొండరాళ్ళు, చెట్లు, తుప్పలు మినహాయించి ఏమీ కనబడటంలేదు. దూరంగా  అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు తప్పు.

    రాబర్ట్ దూరంగా  నించిని చూశాడు.

    బంగాళాగేటు వేసివుంది. ప్రక్కనే వాచ్ మాన్ కూర్చుని వున్నాడు.

    మెల్లగా ఓ సారి బంగాళా  ముందునుంచి నడిచాడు.

    కాంపౌండ్ ప్రహరీగోడ  ఎత్తుగా వుంది. గోడపైన సీసం పెంకులు వున్నాయి. ఆ గోడ ఎక్కి లోపలికి దూకాలి.

    చేతి గడియారంలోకి చూసుకున్నాడు రాబర్ట్ పదకొండు దాటింది.

    మేడమీద గదిలో ల్తెటు వెలుగుతోంది. కింద పోర్టికో భాగమంతా కటిక చీకటి గా వుంది.

    వాచ్ మాన్ కళ్ళుకప్పి లోపలికేళ్ళాలి వాడిని మచ్చిక  చేసుకోవాలి.

    గోడ దూకడమా?

    వాచ్ మాన్  ని  మంచి చేసుకోవడమా?

    కొన్ని క్షణాలు ఆలోచించాడు.

    తెగింపుతో గేటుదగ్గరకు నడిచాడు రాబర్టు.

    "కౌన్ హై?" వాచ్ మాన్ అరిచాడు.

    రాబర్టు తొణకకుండా అడిగాడు.

    "అగ్గిపెట్టె వుందా సాబ్!"

    గేటు దగ్గరకు వచ్చి "హై" అంటా  అగ్గిపెట్టె  అందించ బోయాడు వాచ్ మాన్.

    "మర్యాదగా గేటు తెరువు లేకపోతే కాల్చి పారేస్తాను" అన్నాడు రాబర్టు చేతిలో పిస్తోలుని చూపిస్తూ.

    వాచ్ మాన్ అనుకొని పరిస్ధితి తేరుకోలేక నించుండిపోయాడు.

    "ఊ తెరు" అన్నాడు  రాబర్టు.

    వాచ్ మాన్ మారు మాట లేకుండా తలుపు  తెరిచాడు రాబర్టు మెరుపులా  లోపలకొచ్చి "వెనక్కి తిప్పి అతని తలపైన బలంగా కొట్టాడు.

    వాచ్ మెన్ వెనక్కీతిరగ్గానే  పిస్తోలు వెనక్కి తిప్పి అతని తల పైన  బలంగా కొట్టాడు.

    అంతే వాచ్ మాన్ నేలపైన కూలిపోయాడు. అతని శరీరాన్ని గేటు పక్కకి ఈడ్చేసి మఫ్ లర్ తో రెండు చేతులూ కట్టేశాడు గ్యారం టిగా అతనిప్పడప్పడే లేవడు.

    తోటలో ఎక్కడా ఆలికిడిలేదు.

    కుక్కలు.

    అవి ఎక్కడో వుండివుంటాయి. విటినేలా తప్పించుకోవాలి?

    రాబర్టు చెట్లచాటుగా ప్రాకుతున్నాడు.

    కుక్క అరిచింది. వెనకే మరికొన్ని  కుక్కలు అరుస్తూ పరుగెత్తు కోస్తున్నాయి.

    రాబర్టు లేచినించున్నాడు.

    కుక్కలు దగ్గరగా వచ్చేసినాయి.

    రాబర్టు సన్నగా ఈలవెస్తూ వాటిని పిలిచాడు. జేబులోంచి బిస్కట్ పాకెట్  తీసి వాటి ముందుకు విసిరాడు.

    కుక్కలు నాలుగు  రాబర్టు నిదివరో చూసి  వుండడంతో అతన్ని మిత్రుడిగా  భావించినయి. తోకలు  ఊపుతూ అతని దగ్గరగా వచ్చినాయి.

    రాబర్టుకి సమస్య తేలిగ్గా తిరిపోవడంతో ఊపిరి తీసుకుని ఆప్యాయంగా  వాటి నీ చేత్తో  సవందీసాడు.

    రాబర్టు జేబులోంచి మరో  బిస్కట్ పొట్లా౦ తీసి అక్కడపడేసి ముందుకు కదిలాడు.

    కుక్కలు అతన్ని అడ్డుపెట్టలేదు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS