Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 40

    హమ్మయ్య అనుకుంటూ క్యాబిన్ లోంచి బయటకి వచ్చాడు రాంపండు.

    గబగబా టేబుల్ సర్దేసి "నేనిఉమ్క వస్తానోయ్" అన్నాడు బ్రహ్మాజీతో."ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు?" అడిగాడు బ్రహ్మాజీ

    "ఓ గంట పర్మిషన్ తీసుకున్నాను."

    "అబ్బో! వ్యవహారంగాడు నీకు గంట పర్మిషన్ ఇచ్చాడన్నమాట! ఏదైనా పనిమీద వెళుతున్నావా?"

    "పనేంలేదు... సినిమాకి వెళుతున్నా" చెప్పాడు అతను.

    "బాబోయ్... నన్ను మాత్రం సినిమాకి రంమాని అనకు"భయం అభాయమ్గా అతని వంక చూస్తూ అన్నాడు బ్రహ్మేజీ .

    "నిన్నెందుకు రంమ్మంటానూ?

    "అయితే ఈవేళ నువ్వోక్కడివే సినిమాకి వేళ్ళదల్చుకున్నావన్నమాట."

    "అబ్బే కాదు!"

    "ఒహో...అయితే మీ ఆవిడతో వేళుతున్నావన్నమాట"

    రాంపండు వులిక్కిపడ్డాడు

    ఆవిడా! అవిడెంటీ ఛీ... మరేంటీ?

    "అంటే... అదేలే... అలాగే అనుకో... నేనొస్తా" సణుగుతూ అని తడబడే అడుగులతో బయటకి వెళ్ళిపోయాడు రాంపండు.

    బ్రహ్మాజీ రాంపండు వెళ్ళిన దిక్కునే చూస్తూ నోరు తెరిచాడు.
   
                                              *    *    *    *   
    హలో సీటు నెంబర్లు చూసుకుని కూర్చున్నాక రాంపండు మ్నేల్లగా వైష్ణవి అడిగాడు.

    "అసలీ సినిమా బాగుంతుందంటావా?"

    "ఏం? ఎందుకని ఆ డౌటు వచ్చింది?" అడిగింది వైష్ణవి.

    "ఏమో సినిమా వేరు చూస్తె 'మాయ అల్లరి రౌడి మొగుడు' అని వుంది... టికెట్స్ తీసుకునేప్పుడు సిగ్గుగా అనిపించింది." ఆమె నవ్వింది.

    "మేకు అన్ని విషయాల్లోనూ  మొహమాటమే! మీలాగే అందరూ సిగ్గుపడితే హాలు ఇలా పుల అయ్యేది కాదు కదా! అయినా ఇప్పుడు వచ్చే సినిమా టైటిల్స్ అన్నీ ఇలానే వుంటున్నాయి. జనం ఇలాంటి టైటిల్స్ అలవాటుపడిపోయారు"  అంది ఆమె.

    ఆమె అలా అటుమ్డగా హలో లైట్లు ఆరిపోయాయి. రాంపండు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. హలో లైట్లు వుంటే అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది.

    అందరూ తననే చూస్తున్నారన్న ఫీలింగ్. అప్పటిదాకా కుర్చీలో బాగా వెనక్కి జారపడి కూర్చున్నా వాడల్లా ఇప్పుడు నిటారుగా, కాన్షి డేన్స్ తో ధైర్యంగా కూర్చున్నాడు.

    స్క్రీన్స్ మీద అడ్వర్ టైజ్ మెంట్లు పడసాగాయి.

    వైష్ణవిది మిడిల్ కార్నర్ సీటు ప్రక్కనే రాంపండు, అతని ప్రక్కనుండి వేరే వాళ్ళు.

    కుర్చీ చేతిమీద తన చెయ్యి పెట్టుకుందామని అనుకుంటే వైష్ణవి అప్పటికే తన చేతిని పెట్టుకుని కూర్చుంది. ఇటు ప్రక్కన కూర్చున్న తను కూడా కుర్చీ చేతిమీద తన చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు.

     రాంపండుకి  అపరిచాతలు తనకి తగిలితే పరమ చిరాకు. అందుకునే రెండు చేతుల్నీ ఒళ్లో పెట్టుకుని కూర్చున్నాడు.

    అసలు ఈ ద్తిఎతర్ వాళ్ళు ఏ కుర్చీ చేతులు ఆ కుర్చీకి సపెరేట్ గా పెట్టొచ్చు కదా... ఇలా కామన్ గా ఎందుకు పెడతారో? అని విసుక్కున్నాడు.

    అడ్వర్ టైజ్ మెంట్లు అయిపోయి సినిమా స్టార్ట్ అయ్యింది.

    సినిమా కదా మాములు ఫార్ముల కధే!

    ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు!! ఒక హీరోయిన్ భార్య అయితే మరో హీరోయిన్ ప్రేఎసి. హీరో ఒకరికి తెలీయకుండా మరొకరితోచాలా కంపార్టబుల్ గా గడిపేస్తుంటాడు. పైగా ఇద్దరు హీరోయిన్లకీ హీరో పోలికలు వున్నవాళ్ళు ఇద్దరూ వున్నారనే ఫీలింగ్! కూడా హీరోనే వాళ్ళకి కలిగిస్తాడు.

    ఇద్దరు హీరోయిన్సూ హీరోతోప్లస్ వెనకాల పెద్ద మందతో పాటలు వూహించుకోడం....

    హీరోకి విలన్ గుండాలతో ఫైట్లూ వగైరా....

     రాంపండు కుర్చీలో యిబ్బందిగా కదిలాడు.

    "అలా బిగుసుకుపోయి కూర్చోకపోతే కుర్చీ చేతిమీద చెయ్యేసి రిలాక్స్ యి కూర్చోకపోతే కుర్చీ చేతి మీద చెయ్యేసి రిలాక్స్ యి  కూర్చోవచ్చుగా.... చేతిని కుర్చీ చేతిమీద వుంచాడు. వైష్ణవి చేయి మొత్తగా అతని చేతికి తగిలింది.
    అతన్ని కుర్చీ చేతిమీద తన చేయి  పెట్టుకోమని చెప్తూనే ఆమె తన చేతిని కుర్చీ చేతి మీంచి తియ్యలేదు.

    ఒకే కుర్చీ చేతిమీద వాళ్ళిద్దరి చేతులూ... ఒకరి చేతికి మరొకరి చేయి తగులుతూ....

    రాంపండుకి హాయిగా అనిపించింది. అయిన కూడా మైండంతా  గజిబజిగా అయి పోయింది. అంతవరకూ సినిమాని శ్రద్దగా చూసిన అతనికి అప్పుడు తేరమీద ఏం చూస్తున్నాడో అర్డంకావటంలేదు. బొమ్మలు కదలడం, మట్లాడ్డం మాత్రమే అతని కళ్ళకి కనిపిస్తుంది కానీ ఏం మాట్లాడుతూన్నాయో, ఏం కదులు తున్నాయో అతని బుర్రకి ఏమీ అర్ధం కావడంలేదు.

    అతని నరాలు తియ్యగా మూలిగే. తల ప్రక్కకి త్రిప్పి వైష్ణవి వంక చూశాడు. ఆమె సినిమాని దీక్షగా చూస్తుంది!

    "నాకు తగులుతున్న ఫీలింగ్స్ ఈమేకి కలవడంలేదా... కలిగినా ఏం జరగనట్టు నటనా?

    ఆడవాళ్ళు నటిస్తారా లేకపోతే, మగ వాళ్ళలా వెంటనే ఫీలింగ్స్ కలగవా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS